AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya: థియేటర్లలో సూర్య సినిమా.. కళ్లకు గంతలు కట్టుకుని కత్తితో అభిమాని హల్‌చల్.. ఏం చేశాడో చూశారా?

ఈ మధ్యన కొందరు సినిమా అభిమానులు వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ పై హీరోల మాదిరిగానే వారు ఫీలవుతున్నారు. సినిమాల్లోని సీన్లను రీక్రియేట్ చేస్తూ ఆడియెన్స్ ను భయపెడుతున్నారు. ఇప్పుడు సూర్య సినిమా కరుప్పు (వీరభద్రుడు) విషయంలోనూ ఇదే జరిగింది.

Suriya: థియేటర్లలో సూర్య సినిమా.. కళ్లకు గంతలు కట్టుకుని కత్తితో అభిమాని హల్‌చల్.. ఏం చేశాడో చూశారా?
Suriya Movie
Basha Shek
|

Updated on: May 15, 2026 | 1:23 PM

Share

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇతనికి తమిళంలోనే కాదు తెలుగులోనూ భారీగా అభిమానులు ఉన్నారు. కాగా సూర్య నటించిన లేటెస్ట్ సినిమా ‘కరుప్పు( తెలుగులో వీరభద్రుడు) శుక్రవారం (మే15) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో ఎప్పటిలాగే సూర్య అభిమానులు థియేటర్ల దగ్గర నానా హంగామా చేశారు. సినిమా పోస్టర్లు, కటౌట్లతో రచ్చ చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ కొందరు అభిమానులు మరీ పిచ్చొళ్లలా ప్రవర్తించారు. సినిమాలో హీరో చేసే ఒక రిస్కీ ఫైట్ సీన్‌ను రీ-క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో కొందరు యువకులు కత్తితో ప్రమాదకరమైన ఫీట్ చేశారు. ఒక యువకుడు కళ్లకు గంతలు కట్టుకుని, కింద పడుకున్న మరో వ్యక్తి పొట్టపై ఉన్న ఒక ముల్లంగిని కత్తితో రెండు ముక్కలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు సదరు అభిమానిపై తీవ్రంగా మండిపడుతున్నారు. అదృష్టం కొద్దీ ఎవరికీ ఏం కాలేదు కానీ ఒక వేళ గురి తప్పి పొట్ట కత్తికి తగిలి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచిస్తేనే భయమేస్తుందంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సినిమాల్లో హీరోలు చేసే విన్యాసాలన్నీ నిపుణుల సమక్షంలో గ్రాఫిక్స్ సహాయంతో చేస్తారని అభిమానులు గుర్తించాలని హితవు పలుకుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని, కుటుంబ సభ్యులను కన్నీళ్లు పెట్టించవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక వీరభద్రుడు సినిమా విషయానికి వస్తే.. ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ సినిమాలో సౌతిండియన్ బ్యూటీ క్వీన్ త్రిష హీరోయిన్ గా నటించింది. విలన్ గా ఆర్జే బాలాజీనే యాక్ట్ చేసినట్లు తెలుస్తోంది. వీరితో పాటు ఇంద్రాన్స్, స్వస్తిక, యోగి బాబు, మన్సూర్ అలీఖాన్, అడుకలం నరేన్, దీపా శంకర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.ఆర్. ప్రభు ఈ సినిమాను నిర్మించారు. సాయి అభ్యంకర్ స్వరాలు సమకూర్చారు.

సూర్య సినిమాకు సూపర్ హిట్ టాక్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!