AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోడకు బిగించిన ఏసీ బాంబుగా మారుతుంది.. మీరు ఈ పొరపాటు చేస్తే, మీ ప్రాణాలు పోవడం ఖాయం!

వేసవి తాపం నుండి ఉపశమనం కోసం చాలా మంది బడ్జెట్ తక్కువగా ఉందని సెకండ్ హ్యాండ్ ఎయిర్ కండిషనర్లను (AC) కొనుగోలు చేస్తుంటారు. అయితే, సరైన అవగాహన లేకుండా వీటిని కొనడం ప్రాణాపాయంగా మారవచ్చు. ఇటీవల కాలంలో ఏసీలు పేలుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అందుకే ఏసీ కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి.

గోడకు బిగించిన ఏసీ బాంబుగా మారుతుంది.. మీరు ఈ పొరపాటు చేస్తే, మీ ప్రాణాలు పోవడం ఖాయం!
Old Ac Inspection GuideImage Credit source: tv9 telugu
Jyothi Gadda
|

Updated on: May 15, 2026 | 1:20 PM

Share

ఎండల తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఏసీల వాడకం విపరీతంగా పెరుగుతోంది. కొత్త ఏసీలు కొనలేని వారు తక్కువ ధరలో వస్తున్నాయని సెకండ్ హ్యాండ్ ఏసీల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ, సరిగ్గా చెక్‌ చేయకుండా పాత ఏసీలను వాడటం వల్ల అవి బాంబుల్లా పేలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏసీ పేలుళ్లకు ప్రధాన కారణాలు:

ఏసీ పేలుళ్లకు కేవలం ఎండలు మాత్రమే కారణం కాదు, యంత్రంలోని అంతర్గత లోపాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా కంప్రెసర్ మీద అదనపు భారం పడటం, గ్యాస్ లీకేజీ, నాణ్యత లేని వైరింగ్ వల్ల షార్ట్ సర్క్యూట్ సంభవించి పేలుళ్లు జరుగుతాయి.

సెకండ్ హ్యాండ్ ఏసీ కొనేటప్పుడు చూడాల్సినవి:

ఏసీ పైపుల వద్ద లేదా కంప్రెసర్ దగ్గర ఆయిల్ మరకలు ఉంటే అక్కడ గ్యాస్ లీక్ అవుతున్నట్లు అర్థం. గ్యాస్ తక్కువగా ఉన్నప్పుడు కంప్రెసర్ నిరంతరం పనిచేయాల్సి వస్తుంది, దీనివల్ల అది వేడెక్కి పేలిపోయే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

పాత ఏసీలలో వైర్లు కాలిపోయి ఉన్నాయా లేదా జాయింట్లు ఎక్కువగా ఉన్నాయా అని చూడాలి. వదులుగా ఉన్న కనెక్షన్లు స్పార్కింగ్‌కు దారితీస్తాయి.

ఏసీ నడుస్తున్నప్పుడు అసాధారణమైన శబ్దాలు వస్తున్నా లేదా కాలిన వాసన వస్తున్నా దానిని వెంటనే ఆపివేయాలి. ఇది లోపల ఏదో పెద్ద సమస్య ఉందనడానికి సంకేతం. ఆ ఏసీని క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేశారో లేదో అడిగి తెలుసుకోవాలి. సరైన మెయింటెనెన్స్ లేని ఏసీలు ఎక్కువ విద్యుత్తును వాడటమే కాకుండా త్వరగా పాడవుతాయి.

పాత ఏసీని కొన్న వెంటనే నేరుగా వాడకుండా, ఒక నిపుణులైన మెకానిక్‌తో పూర్తి స్థాయిలో చెక్‌ చేయించాలి. ఇండోర్, అవుట్‌డోర్ యూనిట్ల మధ్య గాలి ప్రసరణ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా అవుట్‌డోర్ యూనిట్‌ను ఎండ నేరుగా తగలకుండా నీడలో ఉండేలా చూసుకోవడం మంచిది. ప్రాణాల కంటే తక్కువ ధర ముఖ్యం కాదని గుర్తుంచుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
జబర్దస్త్‌పై టాలీవుడ్ హీరోయిన్ సంచలన కామెంట్స్!
జబర్దస్త్‌పై టాలీవుడ్ హీరోయిన్ సంచలన కామెంట్స్!
మంచం మీద కూర్చుని భోజనం చేస్తున్నారా? ఇది తప్పక తెలుసుకోండి
మంచం మీద కూర్చుని భోజనం చేస్తున్నారా? ఇది తప్పక తెలుసుకోండి
రా రమ్మంటూ రహదారి వేస్తున్నసముద్రం! రెండుగా విడదీస్తూ మాయా మార్గం
రా రమ్మంటూ రహదారి వేస్తున్నసముద్రం! రెండుగా విడదీస్తూ మాయా మార్గం
పెళ్లి కాలేదని చిన్నచూపు చూస్తున్నారా? గౌరవం దక్కే సూత్రాలివే
పెళ్లి కాలేదని చిన్నచూపు చూస్తున్నారా? గౌరవం దక్కే సూత్రాలివే
ఏలినాటి శని, అర్ధాష్టమ శనితో బాధపడుతున్నారా? ఇది తెలుసుకోండి
ఏలినాటి శని, అర్ధాష్టమ శనితో బాధపడుతున్నారా? ఇది తెలుసుకోండి
ఇలా చేస్తే చాలు చపాతీలు ఎన్ని గంటలైనా దూదిలా మెత్తగా ఉంటాయి..
ఇలా చేస్తే చాలు చపాతీలు ఎన్ని గంటలైనా దూదిలా మెత్తగా ఉంటాయి..
ఈ రాశి అమ్మాయిల సహనం ముందు ఎవరైనా తలవంచాల్సిందే..
ఈ రాశి అమ్మాయిల సహనం ముందు ఎవరైనా తలవంచాల్సిందే..
బంగారం మార్కెట్‌కు భారీ షాక్.. నాలుగు రోజుల్లోనే ఇంత జరిగిందా..?
బంగారం మార్కెట్‌కు భారీ షాక్.. నాలుగు రోజుల్లోనే ఇంత జరిగిందా..?
హార్దిక్ లేకపోవడమే ముంబైకి కలిసొచ్చిందా?
హార్దిక్ లేకపోవడమే ముంబైకి కలిసొచ్చిందా?
ఈ ఆటోలో ఎక్కిన వారికి చలితో వణుకే! డ్రైవర్ అదిరిపోయే ఐడియాకు ఫిదా
ఈ ఆటోలో ఎక్కిన వారికి చలితో వణుకే! డ్రైవర్ అదిరిపోయే ఐడియాకు ఫిదా