AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెస్టారెంట్‌లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా? ఈ మహిళకు ఎదురైన చేదు అనుభవం మీకో హెచ్చరిక!

నేటి కాలంలో ఏ రెస్టారెంట్‌కు వెళ్లినా టేబుల్‌పై ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. దానిని స్కాన్ చేస్తేనే మెనూ ఓపెన్ అవుతుంది. ఫిజికల్ మెనూ కార్డుల అవసరం లేకుండా స్మార్ట్‌గా ఆర్డర్ చేయడం అలవాటైపోయింది. అయితే, ఈ 'స్మార్ట్' పద్ధతి వెనుక పెద్ద ప్రమాదం పొంచి ఉందని పూణేకు చెందిన రిషికా దత్తా ఉదంతం వెల్లడిస్తోంది. డిజిటల్ మెనూ సిస్టమ్ ద్వారా కస్టమర్ల డేటా ఎంత సులభంగా దుర్వినియోగం అవుతుందో స్పష్టం చేస్తోంది.

రెస్టారెంట్‌లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా? ఈ మహిళకు ఎదురైన చేదు అనుభవం మీకో హెచ్చరిక!
Restaurant Qr Code Scam
Jyothi Gadda
|

Updated on: May 14, 2026 | 11:50 AM

Share

ఈ రోజుల్లో రెస్టారెంట్లు, కేఫ్‌లలో మెనూలను చూడటానికి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం సర్వసాధారణమైపోయింది. ప్రజలు టేబుల్‌పై ఉంచిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే, వారి మొబైల్ ఫోన్‌లో మెనూ ఓపెన్‌ అవుతుంది. నిమిషాల వ్యవధిలోనే ఆహారాన్ని ఆర్డర్ చేస్తున్నారు. కానీ, చూడటానికి చాలా సులభంగా, ఆధునికంగా అనిపించే ఈ పద్ధతి అంతే ప్రమాదకరమైనదని మీకు తెలుసా? పుణెలో జరిగిన ఇలాంటి ఒక ఘటనే ప్రజల గోప్యతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.

నిజానికి, పూణే నివాసి అయిన రిషికా దత్తా తన అనుభవాన్ని వివరిస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. రిషికా చెప్పిన ప్రకారం, ఆమె ఏప్రిల్ 28న రాత్రి భోజనం కోసం ఒక ప్రముఖ రెస్టారెంట్‌కు వెళ్లారు. ఇతర కస్టమర్లలాగే, ఆమె కూడా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, మెనూ చూసి, ఫుడ్ ఆర్డర్ చేసి, ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. అకస్మాత్తుగా రాత్రి పూట రిషికకు ఒక గుర్తుతెలియని నంబర్ నుండి హాయ్ అని మెసేజ్ వచ్చింది. మొదట, అది పొరపాటు ఏమోనని ఆమె అనుకుంది. ఎవరు పంపారో తెలుసుకోవడానికి ఆమె కేవలం “?” (ఎవరు అన్నట్టుగా ప్రశ్నార్థకం)అని పంపింది. ఆ తర్వాత, ఆమె తన ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి నిద్రపోయింది.

ఇవి కూడా చదవండి

అయితే, ఉదయం ఆమె మళ్లీ తన ఫోన్ చూసుకున్నప్పుడు, ఆ సందేశం పంపింది అదే రెస్టారెంట్‌లోని ఒక వెయిటర్ అని ఆమెకు తెలిసింది. ఆ మహిళ చెప్పిన ప్రకారం, ఆ వెయిటర్ ఆమెతో స్నేహం చేస్తానని చెప్పి, ఆ తర్వాత క్రమంగా మరింత వ్యక్తిగతమైన ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. రిషిక దిగ్భ్రాంతికి గురైంది. ఆ ఉద్యోగికి తన ఫోన్ నంబర్ ఎలా దొరికింది అన్నదే ఆమె మనసులో మెదిలిన అతి పెద్ద ప్రశ్న. క్యూఆర్ మెనూ సిస్టమ్ ద్వారా తన మొబైల్ నంబర్‌ను సంపాదించి ఉంటారని ఆమె అనుమానించింది.

రిషిక తనకు వచ్చిన మెసేజ్‌లను స్క్రీన్‌షాట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి వేగంగా వైరల్ అయి తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. తాము కూడా గతంలో ఇలాంటి సంఘటనలనే ఎదుర్కొన్నామని కొంతమంది మహిళలు పేర్కొన్నారు. కేవలం క్యూఆర్ కోడ్‌ల ద్వారా మాత్రమే మెనూలను అందించే రెస్టారెంట్లకు ఇకపై వెళ్లబోమని కొంతమంది యూజర్లు తెలిపారు.

View this post on Instagram

A post shared by Rishika Dutta (@imagebyrizz)

కాగా, బాధిత మహిళ ఈ విషయాన్ని రెస్టారెంట్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందిన తర్వాత, రెస్టారెంట్ నిందితుడైన ఉద్యోగిని తొలగించిందని ఆమె చెబుతోంది. అయితే, ఈ చర్యకు సంబంధించి తనకు ఎలాంటి రాతపూర్వక రుజువు ఇవ్వలేదని, అలాగే రెస్టారెంట్ అధికారికంగా క్షమాపణ కూడా చెప్పలేదని ఆమె అంటోంది. అయితే, ఈ సంఘటన తర్వాత, చాలా మంది క్యూఆర్ కోడ్ మెనూ విధానంపై ప్రశ్నలు లేవనెత్తారు. క్యూఆర్ కోడ్‌లు, ఆన్‌లైన్ చెల్లింపులు, డిజిటల్ మెనూల వంటి సౌకర్యాలు వేగంగా ప్రజల జీవితంలో భాగమైపోయినప్పటికీ, డేటా భద్రత సమస్య కూడా అంతే ముఖ్యమైందని వారు అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us