Chukka Kura: చుక్క కూర గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

|

Aug 22, 2024 | 1:21 PM

ఆకు కూరలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో ఆకు కూరలు తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆకు కూరల్లో తోట కూర, చుక్క కూర, పాల కూర, గోంగూర, పొనగంటి కూర, మెంతి కూర ఇలా చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ మీ ఆహారంలో తీసుకోవడం వల్ల అద్భుతమైన..

Chukka Kura: చుక్క కూర గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
Chukka Kura
Follow us on

ఆకు కూరలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో ఆకు కూరలు తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆకు కూరల్లో తోట కూర, చుక్క కూర, పాల కూర, గోంగూర, పొనగంటి కూర, మెంతి కూర ఇలా చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ మీ ఆహారంలో తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. తోట కూర, పాల కూర రెగ్యులర్‌గా తింటున్నా.. చుక్క కూర మాత్రం చాలా తక్కువ మంది తీసుకుంటారు. చుక్క కూరలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది పుల్లగా ఉంటుంది. మరి చుక్క కూర తింటే ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చుక్క కూరలో పోషకాలు:

విటమిన్లు సి, కే, లూటిన్, బీటా కెరోటిన్, ఐరన్, మెగ్నీషియం, మంచి కొవ్వులు, మాంసకృతులు, పీచు పదార్థాలు, పిండి పదార్థాలు వంటివి ఉంటాయి.

క్యాన్సర్‌కు చెక్:

చుక్క కూర తినడం వల్ల క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడొచ్చు. క్యాన్సర్ వచ్చిన వారు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎక్కువగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వంటివి వస్తాయి. ఇవి రాకుండా చుక్క కూర అడ్డుకుంటుంది.

ఇవి కూడా చదవండి

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:

చుక్క కూరలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. చుక్క కూరను తీసుకోవడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది బలపడుతుంది. దీంతో రోగాలు, వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. వైరస్‌, ఇన్ ఫెక్షన్లు త్వరగా ఎటాక్ చేయవు.

ఐరన్ మెండుగా:

చుక్క కూరలో ఐరన్ శాతం కూడా మెండుగా లభిస్తుంది. రక్త హీనత సమస్య ఉన్నవారు చుక్క కూర తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. వారంలో రెండు, మూడు సార్లు చుక్క కూర తింటే ఈ ప్రాబ్లమ్ నుంచి బయట పడొచ్చు.

జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం:

చుక్క కూర తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు ఎంతో ఆరోగ్యం. తరచూ చుక్క కూర తింటే జీర్ణ వ్యవస్థ ఎంతో చక్కగా పని పనిచేస్తుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

యూరినరీ సమస్యలు మాయం:

చుక్క కూర తినడం వల్ల యూరినరీ ఇన్ ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. యూరినరీ ప్రాబ్లమ్స్‌తో బాధ పడేవారు చుక్క కూర తినడం చాలా మంచిది. ఇందులో ఉండే పోషకాలు మూత్ర మార్గంలో ఏర్పడిన ఇన్ ఫెక్షన్లలను దూరం చేస్తాయి.

వెయిట్ లాస్ అవుతారు:

బరువు తగ్గాలి అనుకునేవారు చుక్క కూర తినడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. ఇందులో ఫైబర్, పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తక్కువగా తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది.  కాబట్టి ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..