Semiya Bobbatlu: వెరైటీగా సేమియా బొబ్బట్లు.. రుచిలో అదరహో అంతే!

ఇంట్లో ఎలాంటి ఫంక్షన్లు, పండుగలు వచ్చినా ఏదో ఒక స్వీట్ ఖచ్చితంగా తయారు చేస్తూ ఉంటాం. అందులోనూ బొబ్బట్లు అంటే చాలా మందికి ఇష్టం. నెయ్యి వేసి ఈ బొబ్బట్లు తింటూ ఉంటే ఆహా అనిపిస్తుంది. బొబ్బట్లు పేరు చెబితేనే నోరు ఊరిపోతుంది కదా.. మరి అంత రుచిగా ఉంటాయి. నోట్లో అలా పెడుతూ ఉంటే కరిగిపోతాయి. వీటిని చాలా జాగ్రత్తగా చేయాలి. కాస్త సమయం కూడా పడుతుంది. కానీ తక్కువ సమయంలోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది కూడా సేమియాలతో..

Semiya Bobbatlu: వెరైటీగా సేమియా బొబ్బట్లు.. రుచిలో అదరహో అంతే!
Semiya Bobbatlu
Follow us

|

Updated on: Sep 26, 2024 | 3:03 PM

ఇంట్లో ఎలాంటి ఫంక్షన్లు, పండుగలు వచ్చినా ఏదో ఒక స్వీట్ ఖచ్చితంగా తయారు చేస్తూ ఉంటాం. అందులోనూ బొబ్బట్లు అంటే చాలా మందికి ఇష్టం. నెయ్యి వేసి ఈ బొబ్బట్లు తింటూ ఉంటే ఆహా అనిపిస్తుంది. బొబ్బట్లు పేరు చెబితేనే నోరు ఊరిపోతుంది కదా.. మరి అంత రుచిగా ఉంటాయి. నోట్లో అలా పెడుతూ ఉంటే కరిగిపోతాయి. వీటిని చాలా జాగ్రత్తగా చేయాలి. కాస్త సమయం కూడా పడుతుంది. కానీ తక్కువ సమయంలోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది కూడా సేమియాలతో.. అదేంటి? అనుకుంటున్నారు. పండుగలకు చాలా మంది సేమియా కేసరి తయారు చేస్తూ ఉంటారు. అలాగే కేసరి ప్రిపేర్ చేసి.. బొబ్బట్లు తయారు చేసుకోవచ్చు. మరి ఈ సేమియా బొబ్బట్లు ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సేమియా బొబ్బట్లకు కావాల్సిన పదార్థాలు:

సేమియా, పంచదార లేదా బెల్లం, యాలకుల పొడి, నెయ్యి, సన్నగా తరిగిన జీడి పప్పు గోధుమ పిండి, ఉప్పు, ఆయిల్, కొబ్బరి పొడి.

సేమియా బొబ్బట్లు తయారీ విధానం:

ఈ సేమియా బొబ్బట్లు తయారు చేసుకోవడానికి ముందుగా గోధుమ పిండిని కలిపి పెట్టుకోవాలి. ఇందులో ఉప్పు, ఆయిల్ వేసి బాగా కలిపి మెత్తగా కలిపి ఓ అరగంట పాటు పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నెయ్యి వేయాలి. ఇందులో సేమియాలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే నీళ్లు వేసి మరిగించాలి. నీళ్లు మరిగాక సేమియాలు వేసి ఇవి మరుగుతున్నప్పుడు పంచదార కూడా వేసి బాగా కలుపుకోవాలి. చివరగా సన్నగా కట్ చేసిన జీడిపప్పు, యాలకుల పొడి, కొబ్బరి పొడి కూడా వేసి కలపాలి. చివరలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. పంచదారకు బదులు బెల్లం కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు సేమియా చల్లారాక.. ఉండలు చుట్టి పక్కన పెట్టాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఒక పెనం తీసుకుని స్టవ్ మీద పెట్టండి. ఇప్పుడు చపాతీ పిండిని కూడా ఉండలుగా చుట్టి పక్కన పెట్టాలి. ఒక్కో ముద్ద తీసుకుని అందులో సేమియా మిశ్రమం ఉంచి.. కాస్త పల్చగా చపాతీలను ఒత్తుకోవాలి. ఇప్పుడు వీటిని పెనం మీద వేసి నెయ్యి వేసి కాల్చుకోవాలి. ఇలా అన్నీ తయారు చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే సేమియా బొబ్బట్లు సిద్ధం. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి.