Prawns Vankaya Curry: చిట్టి రొయ్యలు, వంకాయ ఇగురు.. మాటల్లో చెప్పలేని రుచి..

సీ ఫుడ్ అంటే చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. అందులో రొయ్యలు అంటే చాలా మందికి ఇష్టం. రొయ్యలను ఎక్కువగా బిర్యానీలో వేసి వండుతూ ఉంటారు. రొయ్యలు కూడా తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అప్పుడప్పుడైనా తినడం మంచిది. అందులోనూ పెద్ద రొయ్యల కంటే చిట్టి రొయ్యలు చాలా రుచిగా ఉంటాయి. ఈ చిట్టి రొయ్యల్లో వంకాయలు, టమాటాలు, గుడ్లు, ములక్కాడ, బెండకాలు, బీరకాలయు ఇలా ఎలాంటి వెజిటేబుల్స్ వేసుకుని అయినా వండుకుంటే..

Prawns Vankaya Curry: చిట్టి రొయ్యలు, వంకాయ ఇగురు.. మాటల్లో చెప్పలేని రుచి..
Prawns Vankaya Curry
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 27, 2024 | 9:45 PM

సీ ఫుడ్ అంటే చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. అందులో రొయ్యలు అంటే చాలా మందికి ఇష్టం. రొయ్యలను ఎక్కువగా బిర్యానీలో వేసి వండుతూ ఉంటారు. రొయ్యలు కూడా తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అప్పుడప్పుడైనా తినడం మంచిది. అందులోనూ పెద్ద రొయ్యల కంటే చిట్టి రొయ్యలు చాలా రుచిగా ఉంటాయి. ఈ చిట్టి రొయ్యల్లో వంకాయలు, టమాటాలు, గుడ్లు, ములక్కాడ, బెండకాలు, బీరకాలయు ఇలా ఎలాంటి వెజిటేబుల్స్ వేసుకుని అయినా వండుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఎక్కువగా వంకాయ, చిట్టి రొయ్యల ఇగురు మరింత టేస్టీగా ఉంటాయి. వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకుని కలిపి ఒక్క ముద్ద తింటే మాటలు ఇక ఉండవు. కేవలం తింటూనే ఉంటారు. అంత రుచిగా ఉంటుంది ఈ కర్రీ. మరి వంకాయలు వేసి పచ్చి రొయ్యల కూర ఎలా చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

చిట్టి రొయ్యలు, వంకాయ ఇగురుకు కావాల్సిన పదార్థాలు:

శుభ్రం చేసిన రొయ్యలు, వంకాయలు, ఉల్లిపాయలు, టమాటా, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, ఆయిల్, కొత్తిమీర.

చిట్టి రొయ్యలు, వంకాయ ఇగురు తయారీ విధానం:

ముందుగా పచ్చి రొయ్యలను శుభ్రం చేసి.. ఓ పాత్రలో వేసుకోవాలి. ఇందులో పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి పొయ్యి మీద పెట్టాలి. కాసేపటికి నీరంతా బయటకు వస్తుంది. ఇలా నీరంతా బయటకు పోయేంత వరకు ఉడికించాలి. కొద్దిగా నీరు ఉన్నప్పుడు వంచేసి రొయ్యలను పక్కన పెట్టాలి. ఇప్పుడు కర్రీ చేసే పాన్ తీసుకుని ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చి మిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా వేయించుకోవాలి. ఇవి ఎర్రగా వేగాక.. వంకాయ ముక్కలు వేసి ఓ రెండు నిమిషాలు వేయించాక.. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం వేసి మరో రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత రొయ్యలు కూడా వేసి ఓ ఐదు నిమిషాలు వేయించాలి. నెక్ట్స్ సరిపడా నీళ్లు వేసి ఒక ఉడుకు వచ్చాక గరం మసాలా వేసి కలపాలి. ఇలా నీరంతా ఇంకేదాకా చివరిలో కొత్తిమీర వేసి కలిపి దగ్గరగా ఇగురు అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే వంకాయలు, పచ్చి రొయ్యల కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓసారి చేయండి. రుచి అదిరిపోతుంది.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!