Fish Iguru: చేపలతో ఇగురు.. ఇలా చేశారంటే రుచి అదుర్స్ అంతే!

చేపలు అంటే చాలా మందికి ఇష్టం. చేపలు తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. చేపలతో ఎక్కువగా పులుసు, ఫ్రై మాత్రమే చేస్తూ ఉంటారు. కానీ చేపలతో ఇగురు కూడా చేసుకోవచ్చు. ఇది కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఎప్పుడూ ఒకే లాంటి రెసిపీ కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి. తప్పకుండా ఇంట్లో వాళ్లందరికీ నచ్చుతుంది. వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. మరి ఈ చేపల ఇగురు..

Fish Iguru: చేపలతో ఇగురు.. ఇలా చేశారంటే రుచి అదుర్స్ అంతే!
Fish Iguru
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Sep 07, 2024 | 10:16 PM

చేపలు అంటే చాలా మందికి ఇష్టం. చేపలు తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. చేపలతో ఎక్కువగా పులుసు, ఫ్రై మాత్రమే చేస్తూ ఉంటారు. కానీ చేపలతో ఇగురు కూడా చేసుకోవచ్చు. ఇది కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఎప్పుడూ ఒకే లాంటి రెసిపీ కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి. తప్పకుండా ఇంట్లో వాళ్లందరికీ నచ్చుతుంది. వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. మరి ఈ చేపల ఇగురు ఎలా తయారు చేస్తారు? చేపల ఇగురుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చేపల ఇగురుకు కావాల్సిన పదార్థాలు:

శుభ్రం చేసిన చేపలు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, గరం మసాలా, అల్లం తురుము, కారం, ఉప్పు, పసుపు, ధనియాలు, జీలకర్ర, బిర్యానీ ఆకులు, టమాటాలు, ఆయిల్.

చేపల ఇగురు తయారీ విధానం:

ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో ధనియాలు, పసుపు, కారం, ఉప్పు, అల్లం తురుము, టమాటా ముక్కలు వేసి పేస్టులా రుబ్బుకోవాలి. ఖాళీగా ఉండే ఒక గిన్నె తీసుకోండి. ఇందులో ఆయిల్ వేసి వేడెక్కాక చేప ముక్కలు వేసి రెండు వైపులా వేయించుకోవాలి. వీటిని తీసి పక్కకు పెట్టుకున్నా ఇందులోనే జీలకర్ర, ఎండు మిర్చి వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత బిర్యానీ ఆకులు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కలర్ మారక మిక్సీ పట్టిన మసాలా పేస్టు వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కలపాలి.

ఇవి కూడా చదవండి

ఇదంతా ఇగురులా ఉడుకుతున్నప్పుడు చేప ముక్కలు వేయాలి. ఓ నిమిషం పాటు ఉడికాక ఒక గ్లాస్ వాటర్ వేయాలి. ఇప్పుడు పచ్చి మిర్చి నిలువునా కోసి వేయాలి. ఇప్పుడు నీళ్లు దగ్గరయ్యాక ఇగురులా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లాలి. అంతే ఎంతో రుచిగా ఉండే చేపల ఇగురు సిద్ధం. ఇది చాలా రుచిగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి.

అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు