Cooker Chicken Biryani: కుక్కర్‌లో సింపుల్‌గా టేస్టీ చికెన్ బిర్యానీ.. వాసనతోనే కడుపు నిండుతుంది!
సండే వచ్చిదంటే చికెన్, మటన్ లేదా సీ ఫుడ్ వీటిల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా వండాల్సిందే. సాధారణంగా చాలా వరకు చికెన్ కర్రీనే వండుకుంటారు. చికెన్‌తో ఎన్నో వెరైటీలు తయారు చేసుకోవచ్చు. అదే విధంగా చికెన్‌తో లెక్కలేనన్ని బిర్యానీలు తయారు చేస్తారు. వాటిల్లో ఇప్పుడు కుక్కర్‌లో సింపుల్‌గా చికెన్ బిర్యానీ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రెసిపీ తయారు చేసేటప్పుడు వచ్చే సువాసనతోనే..

సండే వచ్చిదంటే చికెన్, మటన్ లేదా సీ ఫుడ్ వీటిల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా వండాల్సిందే. సాధారణంగా చాలా వరకు చికెన్ కర్రీనే వండుకుంటారు. చికెన్‌తో ఎన్నో వెరైటీలు తయారు చేసుకోవచ్చు. అదే విధంగా చికెన్‌తో లెక్కలేనన్ని బిర్యానీలు తయారు చేస్తారు. వాటిల్లో ఇప్పుడు కుక్కర్‌లో సింపుల్‌గా చికెన్ బిర్యానీ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రెసిపీ తయారు చేసేటప్పుడు వచ్చే సువాసనతోనే కడుపు నిండిపోతుంది. ఎక్కువ సమయం కూడా పట్టదు. సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో? ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం.
కుక్కర్ చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు:
చికెన్, నార్మల్ రైస్, ఉల్లిపాయలు, పచ్చి మర్చి, ఫ్రైడ్ ఆనియన్స్, టమాటాలు, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, బిర్యానీ మసాలా, పుదీనా, కొత్తి మీర, కరివేపాకు, ఆయిల్, నెయ్యి, బిర్యానీ దినుసులు. ముందుగానే ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసి పెట్టుకోవాలి.
కుక్కర్ చికెన్ బిర్యానీ తయారీ విధానం:
ముందు చికెన్‌లో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి మ్యారినేట్ చేసుకోవాలి. నెక్ట్స్ బియ్యాన్ని కూడా ఓ అరగంట ముందు కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి. నెక్ట్స్ బిర్యానీ దినుసులు, పుదీనా వేసి వేయించాలి. నెక్ట్స్ ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి కలర్ మారేంత వరకు వేయించి.. అల్లం పేస్ట్ వేసి ఓ నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు మరో నిమిషం పాటు వేయించాక.. మ్యారినేట్ చేసిన చికెన్ వేసి ఓ పది నిమిషాలు మీడియం మంటపై ఉడికించాలి. ఇప్పుడు ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్‌లో సగం వేయాలి.
ఆ తర్వాత కారం, ఉప్పు, గరం మసాలా, బిర్యానీ మసాలా వేసి ఓ ఐదు నిమిషాలు వేయించి.. చిన్న టీ గ్లాస్ వాటర్ వేసి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు బిర్యానీ రైస్ వేసి.. బాగా కలపాలి. (మీరు తీసుకున్న బియ్యం క్వాంటిటీకి వాటర్ తీసుకోవాలి). ఇప్పుడు ఇందులోనే మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తి మీర, కరివేపాకు వేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టాలి. రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి.. కుక్కర్ వేడి తగ్గేంత వరకూ అలానే వదిలేయాలి. ఆ తర్వాత మూత తీసి ఒకసారి బిర్యానీ అంతా కలిపి సర్వ్ చేసుకోవడమే. అంతే ఎంతో రుచిగా ఉండే కుక్కర్ చికెన్ బిర్యానీ తయారు.








