AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Diseases: గుండె జబ్బులను ముందుగానే గుర్తించగలిగే లక్షణాలు ఇవే.. మీలోనూ ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి యేట ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ ప్రత్యేక రోజున పలు రకాల ఆరోగ్య సమస్యలు, వాటి నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం థీమ్ 'నా ఆరోగ్యం, నా హక్కులు (My Health, My Rights)'. ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గుండె సంబంధిత వ్యాధుల గురించి అవగాహన కలిగించేందుకు నిపుణులు పిలుపునిచ్చారు..

Heart Diseases: గుండె జబ్బులను ముందుగానే గుర్తించగలిగే లక్షణాలు ఇవే.. మీలోనూ ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Heart Diseases
Srilakshmi C
|

Updated on: Apr 07, 2024 | 8:41 PM

Share

ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి యేట ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ ప్రత్యేక రోజున పలు రకాల ఆరోగ్య సమస్యలు, వాటి నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం థీమ్ ‘నా ఆరోగ్యం, నా హక్కులు (My Health, My Rights)’. ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గుండె సంబంధిత వ్యాధుల గురించి అవగాహన కలిగించేందుకు నిపుణులు పిలుపునిచ్చారు. నేటి కాలంలో గుండె జబ్బులు ఎందుకు పెరుగుతున్నాయి? వారి ప్రారంభ లక్షణాలు ఏమిటి? వాటిని ఎలా నివారించవచ్చు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు నిపుణుల మాటల్లో మీకోసం..

గతి తప్పిన ఆహార అలవాట్లు, అస్తవ్యస్తమైన జీవనశైలి వల్ల గుండె జబ్బులు పెరుగుతున్నాయని ఢిల్లీలోని ధర్మశిల నారాయణ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని ఇంటర్నల్ మెడిసిన్ విభాగం డాక్టర్ గౌరవ్ జైన్ చెబుతున్నారు. చాలా మంది ఈ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించలేరు. కారణం ఏమిటంటే.. వ్యక్తులకు లక్షణాల గురించి సరైన అవగాహన లేదు. తీవ్రమైన ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె వేగంగా కొట్టుకోవడం లేదా తగ్గడం, మూర్ఛ, వికారం, వాంతులు, ఎల్లప్పుడూ బలహీనంగా అనిపించడం, జ్వరం, అలసట, దీర్ఘకాలంగా కడుపు నొప్పి వంటి ఏదైనా సమస్య ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ లక్షణాలు కనిపిస్తే, వైద్యుడిని సంప్రదించి చెకప్‌ చేయించుకోవాలి.

జైపూర్‌లోని నారాయణ హాస్పిటల్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ విభాగంలో డాక్టర్ బ్రిజ్ వల్లభ్ శర్మ మాట్లాడుతూ.. ప్రతిరోజూ కొంత శారీరక శ్రమ చేయడం ద్వారా గుండె జబ్బులను నివారించవచ్చని అంటున్నారు. అందుకు వ్యాయామం లేదా యోగా చేయవచ్చు. రోజువారీ జీవితంలో మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడంపై శ్రద్ధపెట్టాలి. సమతుల్య ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఏదైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. అన్నింటికంటే ముఖ్యంగా సరైన ఆహారపు అలవాట్లను పాటించడం చాలా అవసరం అని డాక్టర్ శర్మ చెబుతున్నారు. మీకు ఎక్కువ జంక్ ఫుడ్ తినే అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలి. ఆహారంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఫాస్ట్ ఫుడ్ తినే ధోరణి పెరుగుతోంది. ఇది గుండె జబ్బులకు ప్రధాన కారణం.

ఇవి కూడా చదవండి

సరైన సమయంలో పరీక్షలు చేయించుకోవాలి

గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే సకాలంలో పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. గుండె జబ్బుకు సంబంధించి ఏవైనా లక్షణాలు కనిపిస్తే లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవాలి. అలాగే ఎక్స్-రే, యాంజియోగ్రఫీ కూడా చేయించుకోవాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..