Chilli Chicken: రెస్టారెంట్ స్టైల్ చిల్లీ చికెన్ ని ఇలా ఇంట్లో చేస్తే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
మాంసాహారంలో ప్రియులు ఇష్టంగా తినే వాటిల్లో చికెన్ కూడా ఒకటి. చికెన్ తో ఒక్కటేంటి.. చాలా రకాల ఫుడ్ ఐటెమ్స్ చేసుకోవచ్చు. చికెన్ తో కొన్ని వందల రెసిపీస్ తయారు చేసుకోవచ్చన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. చికెన్ తో చైనీ ఫాస్ట్ ఫుడ్ కూడా తయారు చేసుకోవచ్చు. వాటిలో చిల్లీ చికెన్ కూడా ఒకటి. రెస్టారెంట్స్ కి వెళ్లారంటే చాలా మంది చిల్లీ చికెన్ ఆర్డర్ చేస్తారు. ఇలా రెస్టారెంట్ లోనే కాకుండా.. ఇంట్లో కూడా మనం ఈజీగా చిల్లీ చికెన్ ని..

మాంసాహారంలో ప్రియులు ఇష్టంగా తినే వాటిల్లో చికెన్ కూడా ఒకటి. చికెన్ తో ఒక్కటేంటి.. చాలా రకాల ఫుడ్ ఐటెమ్స్ చేసుకోవచ్చు. చికెన్ తో కొన్ని వందల రెసిపీస్ తయారు చేసుకోవచ్చన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. చికెన్ తో చైనీ ఫాస్ట్ ఫుడ్ కూడా తయారు చేసుకోవచ్చు. వాటిలో చిల్లీ చికెన్ కూడా ఒకటి. రెస్టారెంట్స్ కి వెళ్లారంటే చాలా మంది చిల్లీ చికెన్ ఆర్డర్ చేస్తారు. ఇలా రెస్టారెంట్ లోనే కాకుండా.. ఇంట్లో కూడా మనం ఈజీగా చిల్లీ చికెన్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చిల్లీ చికెన్ ను పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఈ చిల్లీ చికెన్ ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
చిల్లీ చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
బెన్ లెస్ చికెన్, ఉల్లి పాయలు, పచ్చి మిర్చి, ఆయిల్, కారం, ఉప్పు, గరం మసాలా, సోయాసాస్, కోడి గుడ్డు, కార్న్ ఫ్లోర్, వెల్లుల్లి రెబ్బలు, మిరియాల పొడి, పంచదార.
చిల్లీ చికెన్ తయారీ విధానం:
ముందుగా ఒక లోతైనా పాత్ర తీసుకుని అందులో చికెన్ ముక్కలు వేయాలి. వాటిపై కార్న్ ఫ్లోర్, గుడ్డు, ఉప్పు, సోయాసాస్ వేసి బాగా కలుపు కోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఓ అరగంట పాటైనా మూత పెట్టి పక్కకు పెట్టు కోవాలి. చికెన్ ని ఇంకా ఎక్కువ సేపు మ్యారినేట్ చేసుకుంటే.. ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి, వేడెక్కాక.. మ్యారినేట్ చేసుకున్న చికెన్.. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకూ వేయించి.. పక్కకు పెట్టుకోవాలి.
ఆ తర్వాత ఇప్పుడు సాస్ పాన్ తీసుకుని.. అందులో కొద్దిగా నూనె వేసి.. వేడెక్కాక.. సన్నగా కట్ చేసిన పచ్చి మిర్చి, వెల్లుల్లి వేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో సరిపడా వాటర్ వేసి మరిగించాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు పంచదార, మిరియాల పొడిచ ఉప్పు, కొద్దిగా సోయా సాస్ వేసి కలుపుకోవాలి.
ఆ తర్వాత ఇందులో ముందుగా వేయించి పక్కకు పెట్టుకున్న చికెన్ కూడా వేసి కలుపుకోవాలి. ఇలా మొత్తం నీరంతా ఆవిరి అయిపోయే దాకా ఉంచాలి. చివరగా దించే ముందు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మరి కాసేపు వేయించాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ చికెన్ తయారవుతుంది. దీన్ని వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.








