Bagara Baingan: సింపుల్‌గా బగారా బైంగన్ తయారీ.. టేస్ట్ మామూలుగా ఉండదు..

| Edited By: Ravi Kiran

Jul 20, 2024 | 10:15 PM

వంకాయతో చేసే రెసిపీలు అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. అందులోనూ గుత్తి వంకాయ అంటే మరింత ఇష్టం. వంకాయతో ఎన్ని రకాల వెరైటీలు, స్నాక్స్ తయారు చేసినా చాలా రుచిగా ఉంటాయి. ముఖ్యంగా మసాలా వంటలు అయితే సూపర్ అంతే. అయితే బగారా బైంగన్‌ కర్రీకి ఉండే రుచి మరొక కర్రీకి రాదు. ఈ కర్రీ ప్రిపేర్ చేయాలంటే.. కాస్త శ్రమ పడాలి. అయితే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. సింపుల్‌గా చేసినా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఈ రెసిపీ ఎంతో ఫాస్ట్‌గా కూడా..

Bagara Baingan: సింపుల్‌గా బగారా బైంగన్ తయారీ.. టేస్ట్ మామూలుగా ఉండదు..
Bagara Baigan
Follow us on

వంకాయతో చేసే రెసిపీలు అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. అందులోనూ గుత్తి వంకాయ అంటే మరింత ఇష్టం. వంకాయతో ఎన్ని రకాల వెరైటీలు, స్నాక్స్ తయారు చేసినా చాలా రుచిగా ఉంటాయి. ముఖ్యంగా మసాలా వంటలు అయితే సూపర్ అంతే. అయితే బగారా బైంగన్‌ కర్రీకి ఉండే రుచి మరొక కర్రీకి రాదు. ఈ కర్రీ ప్రిపేర్ చేయాలంటే.. కాస్త శ్రమ పడాలి. అయితే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. సింపుల్‌గా చేసినా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఈ రెసిపీ ఎంతో ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది. మరి ఈ కర్రీ తయారు చేయడానికి ఎలాంటి పదార్థాలు కావాలి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

బగారా బైంగన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు:

వంకాయలు, ఆవాలు, జీలకర్ర, కొబ్బరి, చింత పండు, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వులు, జీడిపప్పు, కరివేపాకు, కొత్తి మీర, ఆయిల్.

బగారా బైంగన్ కర్రీ తయారీ విధానం:

ముందుగా మిక్సీ గిన్నెలో కొబ్బరి, నువ్వులు, చింత పండు వేసి కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు వంకాయలను శుభ్రంగా కడిగి.. గుత్తి వంకాయ షేపులో కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కర్రీ పాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొబ్బరి, నువ్వుల పేస్ట్ వేసి వేయించాలి. ఇదంతా చిన్న మంట మీద పెట్టాలి. ఇప్పుడు ఈ గ్రేవీలో వంకాయ ముక్కలు వేసి సన్నగా వేయించు కోవాలి.

ఇవి కూడా చదవండి

వంకాయలు బాగా మగ్గాక.. అల్లం వెల్లులి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు వేసి కలపాలి. ఇలా ఓ పావు గంట సేపు చిన్న మంటపైనే కుక్ చేసుకోవాలి. చివరగా కొత్తిమీర, కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా సింపుల్‌గా కూడా బగారా బైంగన్ తయారు చేసుకోవచ్చు. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది.