Badusha: స్వీట్ షాపు స్టైల్లో బాదుషాలను ఇలా చేస్తే.. రుచి అదుర్స్..

సందర్భం, విశేషం, పండుగలు ఏవైనా సరే మొదట స్వీట్‌తోనే నోటిని తీపి చేస్తారు. ఇలా భారతీయులు ఎక్కువగా పూర్వకాలం నుంచి చేసే స్వీట్లలో బాదుషాలు కూడా ఒకటి. బాదుషాలను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. నోట్లో వేయగానే కరిగిపోతూ ఉంటాయి..

Badusha: స్వీట్ షాపు స్టైల్లో బాదుషాలను ఇలా చేస్తే.. రుచి అదుర్స్..
Badusha
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Dec 20, 2024 | 9:29 PM

సందర్భం, విశేషం, పండుగలు ఏవైనా సరే మొదట స్వీట్‌తోనే నోటిని తీపి చేస్తారు. ఇలా భారతీయులు ఎక్కువగా పూర్వకాలం నుంచి చేసే స్వీట్లలో బాదుషాలు కూడా ఒకటి. బాదుషాలను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. నోట్లో వేయగానే కరిగిపోతూ ఉంటాయి. పండుగలు, శుభార్యాల్లో వీటిని వడ్డించేవారు. వీటిని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కొద్దిగా సమయం పెడితే.. స్వీట్ షాపు స్టైల్‌లో బాదుషాలను ఇంట్లో చేయవచ్చు. మరి ఈ బాదుషాలను ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

బాదుషాలకు కావాల్సిన పదార్థాలు:

మైదా పిండి, బేకింగ్ సోడా, పెరుగు, యాలకుల పొడి, పంచదార, నెయ్యి, ఉప్పు, డ్రై ఫ్రూట్స్ తరుగు, ఆయిల్.

బాదుషా తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో మైదా పిండి వేసుకోవాలి. ఇందులో కొద్దిగా పెరుగు, కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి. వీటిని కలిపాక ఉప్పు, కొద్దిగా నెయ్యి వేసి చేతికి అంటుకోకుండా ఉండేలా చపాతీ ముద్దలా మెత్తగా చేసుకోవాలి. పిండి ఎంత మెత్తగా పిసికితే.. బాదుషాలు అంత సాఫ్ట్‌గా వస్తాయి. ఈ మిశ్రమాన్ని ఓ పావుగంట పక్కన పెట్టండి. ఆ తర్వాత ఉండలుగా చేసుకుని.. మధ్యలో ప్రెస్ చేసి.. హోల్ పెట్టండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే తయారు చేసి పెట్టుకున్న బాదుషాలను ఆయిల్‌లో వేసి ఎర్రగా వేయించుకోవాలి

ఇవి కూడా చదవండి

ఇప్పుడు పంచదార పాకం తీసుకోవాలి. ముందుగా స్టవ్ మీద ఓ గిన్నె పెట్టి నీళ్లు వేసి వేడి చేయాలి. నీళ్లు వేడెక్కగానే పంచదార వేసి కరిగించుకోవాలి. ఈ పంచదార మరుగుతుండగా కొద్దిగా నెయ్యి, యాలకుల పొడి వేసి కలపాలి. పాకం పల్చగానే ఉండాలి. పొయ్యి మీద ఉడుకుతున్నప్పుడే బాదుషాలను అందులో వేసి.. అన్నీ కాసేపు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టాలి. ఇప్పుడు బాదుషాలను తీసి పక్కన పెట్టి వాటిపై డ్రై ఫ్రూట్స్ తురుమును చల్లుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే బాదుషాలు సిద్ధం.