ట్రాఫిక్ సిగ్నల్స్ రంగుల వెనుక రహస్యం ఇదే.. హిస్టరీ తెలిస్తే అవాక్ అవుతారు.!

ట్రాఫిక్ సిగ్నళ్లు మన జీవితాల్లో భాగమైపోయాయి. రోడ్లపై సురక్షితమైన డ్రైవింగ్ కోసం ఇవి చాలా అవసరం. వీటిని ఉల్లంఘిస్తే చలానా గట్టిగానే పడుతుంది. అప్పుడు చాలా మంది ఈ ట్రాఫిక్ సిగ్నళ్లలను ఎవడు కనిపెట్టాడ్రా బాబు అంటూ విసుక్కుంటారు. నిజానికీ ఈ సిగ్నళ్లను ఎవరు కనిపెట్టారు? ఎప్పటి నుంచి వాడుతున్నారో చూద్దామా..

ట్రాఫిక్ సిగ్నల్స్ రంగుల వెనుక రహస్యం ఇదే.. హిస్టరీ తెలిస్తే అవాక్ అవుతారు.!
Traffic Lighs
Follow us
Ravi C

| Edited By: Ravi Kiran

Updated on: Dec 20, 2024 | 9:21 PM

ట్రాఫిక్​ సిగ్నల్​ అందరి జీవితాల్లో భాగంగా మారిపోయింది. రోడ్డుపై అందరూ సవ్యంగా వెళ్లడానికి ఇవి ఎంతో ఉపయోగపడుతాయి. కానీ ఈ సిగ్నళ్లను మనం ఉల్లంఘిస్తే చలానా కట్​ అవుతుంది. అప్పుడు మాత్రం వీటిని ఎవడు కనిపెట్టాడ్రా? బాబాయ్​.. అని అనుకుంటాం. చాలా మందికి ఈ ప్రశ్న తలెత్తే ఉంటుంది. మరి నిజానికి ఈ సిగ్నల్​ ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరు దీన్ని తయారు చేశారు? ఈ వివరాలన్నీ మీకోసం..

ప్రపంచం పురోగమిస్తున్న కొద్దీ రోడ్లపై వాహనాల సంఖ్య భారీగా పెరుగుతూ వచ్చింది. ఫలితం ఇప్పుడు మనం చూస్తున్న ట్రాఫిక్​ జామ్​లే. దీనిని నియంత్రించడానికి ట్రాఫిక్​ సిగ్నల్స్​ అవసరం పడింది. 1868లో వీటి కథ లండన్​లో ప్రారంభమైంది. జనాభా పెరుగుతున్న కొద్దీ రోడ్లన్నీ గుర్రాలు, జట్కాలు, క్యారేజీలతో నిండిపోయేవి. దీంతో ఆయా రోడ్లపై నడిచే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా లండన్​లోని పార్లమెంట్​ స్క్వేర్​లో ఎక్కువ సమస్యగా ఉండేది. పోలీసులు కూడా ట్రాఫిక్​ను నియంత్రించలేకపోయారు. ఈ సమస్యను అధిగమించేందుకు ట్రాఫిక్​ సిగ్నల్స్​ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది.

మొదటి ట్రాఫిక్​ లైట్​

1868లో లండన్​ రైల్వే క్రాసింగ్​ వద్ద గ్యాస్​ ఆధారిత ట్రాఫిక్​ లైట్​ను ఏర్పాటు చేశారు. ఇందులో ఎరుపు, ఆకుపచ్చ రంగులు మాత్రమే ఉండేవి. దీన్ని మాన్యువల్​గా ఆపరేట్​ చేసేవారు. అమెరికాలో మాత్రం చాలా లేటుగా ట్రాఫిక్​ సిగ్నళ్లను ప్రవేశపెట్టారు. 1912 నుంచి సాల్ట్​ లేక్​ సిటీలో మొదటి విద్యుత్​తో వెలిగే ట్రాఫిక్​ లైట్లు అందుబాటులోకి వచ్చాయి. 1920 నుంచి ట్రాఫిక్​ లైట్లలో మూడో రంగు పసుపు చేరింది. అప్పటి నుంచి సిగ్నళ్లలో మూడు లైట్లు ఉంటూ వస్తున్నాయి.

భారత్​లో మొదటి సిగ్నల్​..

భారతదేశంలో ట్రాఫిక్​ లైట్ల వినియోగం 20వ శతాబ్దం మధ్యలో ప్రారంభమైంది. ప్రస్తుతం దేశంలోని అన్ని నగరాలు, పెద్ద పట్టణాల్లో ట్రాఫిక్​ సిగ్నళ్లను ఉపయోగిస్తున్నారు.