Pawan Kalyan: పవన్ ఒక్కడికే ఆ మంత్రం పని చేస్తుందా

చట్టం తన పని తను చేసుకుపోతుంది..! బాగా ఫేమస్ డైలాగ్ కదా ఇది..! పవన్ కళ్యాణ్‌కు ఈ డైలాగ్ బాగా సెట్ అవుతుందిప్పుడు. అసలే ఉప ముఖ్యమంత్రి.. పైగా అదేదో చట్టంతో పని అంటున్నారేంటి అంటూ కంగారొద్దండీ బాబూ..! ఈ మ్యాటర్ ఇంకాస్త క్లారిటీగా మాట్లాడుకుందాం పదండి..! అది ఎక్స్‌క్లూజివ్‌గా.. పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే అంత ఈజీ కాదని దర్శక నిర్మాతలకు కూడా తెలుసు

Phani CH

| Edited By: Ravi Kiran

Updated on: Dec 20, 2024 | 9:28 PM

చట్టం తన పని తను చేసుకుపోతుంది..! బాగా ఫేమస్ డైలాగ్ కదా ఇది..! పవన్ కళ్యాణ్‌కు ఈ డైలాగ్ బాగా సెట్ అవుతుందిప్పుడు. అసలే ఉప ముఖ్యమంత్రి.. పైగా అదేదో చట్టంతో పని అంటున్నారేంటి అంటూ కంగారొద్దండీ బాబూ..!  ఈ మ్యాటర్ ఇంకాస్త క్లారిటీగా మాట్లాడుకుందాం పదండి..! అది ఎక్స్‌క్లూజివ్‌గా..

1 / 5
పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే అంత ఈజీ కాదని దర్శక నిర్మాతలకు కూడా తెలుసు. తెలిసే ఆయనతో రంగంలోకి దిగారు. అందుకే మేకర్స్ కూడా పవన్ దారిలోనే నడుస్తున్నారిప్పుడు. ఆయనున్నా లేకపోయినా.. షూట్‌కు వచ్చినా రాకపోయినా షూటింగ్స్ మాత్రం అస్సలు ఆగట్లేదు. ఇండియాలో వీరమల్లు.. ఓవర్సీస్‌లో ఓజి షూట్స్ కుమ్మేస్తున్నాయంతే.

2 / 5
హరిహర వీరమల్లు కోసం ఈ మధ్యే డేట్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఆయన ఇచ్చిన కాసిన్ని కాల్షీట్స్‌నే బంగారంలా వాడేసుకుంటున్నారు మేకర్స్. మరోవైపు ఓజి దర్శకుడు సుజీత్ అయితే నెక్ట్స్ లెవల్.

3 / 5
పవన్ లేకుండానే OG కొత్త షెడ్యూల్ మొదలుపెట్టారు. అంతేకాదు.. తాజాగా డిజే టిల్లు ఫేమ్ నేహా శెట్టితో థాయ్‌లాండ్‌లో ఓ స్పెషల్ సాంగ్ షూట్ చేస్తున్నారు కూడా.డిసెంబర్‌లోనే ఓజి సెట్‌లో జాయిన్ కానున్నారు పవర్ స్టార్.

4 / 5
ఆలోపు ఆయన లేని సీన్స్ చిత్రీకరణ జరుగుతుంది. బ్యాంకాక్‌, థాయ్‌లాండ్ షెడ్యూల్స్ అయిపోతే ఓజి షూటింగ్ 90 శాతం పూర్తైనట్లే. అందుకే చెప్తుంది చట్టం తన పని తాను చేసుకుపోతుందని..! పవన్ లేకున్నా.. షూటింగ్స్ ఆగట్లేదు. అన్నీ కుదిర్తే 2025లో జనసేనాని నుంచి డబుల్ ట్రీట్ ఖాయం.

5 / 5
Follow us