Masala Omelet: సింపుల్ అండ్ టేస్టీ మసాలా ఆమ్లెట్.. ఐదే నిమిషాల్లో సిద్ధం..

| Edited By: Shaik Madar Saheb

Jul 24, 2024 | 10:27 PM

ఆమ్లెట్ అంటే చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల దాకా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇవి ఎంతో రుచిగా కూడా ఉంటాయి. కేవలం ఉప్పూ, కారం వేసి తిన్నా చాలా టేస్టీగా వస్తాయి. చాలా మంది వీటిని తినేందుకు ఇష్టపడుతూంటారు. రైస్‌లో మంచి సైడ్ డిష్‌గా ఉంటుంది. అయితే ఎప్పుడూ తినే ఆమ్లెట్ కంటే కాస్త వెరైటీగా మసాలా ఆమ్లెట్ తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇందులో ఉపయోగించే పదార్థాలు కూడా ఆరోగ్యకరమైనవే. మరి ఈ టేస్టీగా మసాలా ఆమ్లెట్ తయారు..

Masala Omelet: సింపుల్ అండ్ టేస్టీ మసాలా ఆమ్లెట్.. ఐదే నిమిషాల్లో సిద్ధం..
Masala Omelet
Follow us on

ఆమ్లెట్ అంటే చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల దాకా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇవి ఎంతో రుచిగా కూడా ఉంటాయి. కేవలం ఉప్పూ, కారం వేసి తిన్నా చాలా టేస్టీగా వస్తాయి. చాలా మంది వీటిని తినేందుకు ఇష్టపడుతూంటారు. రైస్‌లో మంచి సైడ్ డిష్‌గా ఉంటుంది. అయితే ఎప్పుడూ తినే ఆమ్లెట్ కంటే కాస్త వెరైటీగా మసాలా ఆమ్లెట్ తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇందులో ఉపయోగించే పదార్థాలు కూడా ఆరోగ్యకరమైనవే. మరి ఈ టేస్టీగా మసాలా ఆమ్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.

మసాలా ఆమ్లెట్‌కి కావాల్సిన పదార్థాలు:

ఎగ్స్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, క్యాప్సికమ్, క్యారెట్, పాలు, ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, ఆయిల్ లేదా బటర్.

మసాలా ఆమ్లెట్‌ తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నెలోకి గుడ్లను చితక్కొటి వేయాలి. వీటిని నురగ వచ్చేలా బీట్ చేయాలి. ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, గరం మాసాలా వేసి మళ్లీ గిలక్కొట్టాలి. ఆ నెక్ట్స్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్, పాలు, మిరియాల పొడి, కొత్తిమీర తరుగు వేసి మళ్లీ గిలక్కొట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ లేదా బటర్ వేసి హీట్ చేయాలి. పాన్ వేడెక్కాక.. తయారు చేసుకుని పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసుకోండి. పెద్ద మంట కాకుండా.. చిన్న మంట మీద ఉంచాలి. చిన్న మంట మీద ఉంచితే గుడ్డులో వేసి కూరగాయలన్నీ చక్కగా ఉడుకుతాయి.

ఇవి కూడా చదవండి

ఈ మసాలా ఆమ్లెట్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆమ్లెట్‌లో అన్నీ వెజిటేబుల్స్ ఆరోగ్యానికి మంచిదే కాబట్టి.. పోషకాలు అన్నీ చక్కగా అందుతాయి. ఈ ఆమ్లెట్‌కే బయట వందల్లో చార్జ్ చేస్తారు. అదే మన ఇంట్లో చక్కగా తయారు చేసుకుని తినవచ్చు. పిల్లలకు స్నాక్ బాక్సులో లేదా చపాతీ మధ్యలో పెట్టి ఒక్కటి ఇచ్చినా మంచి పోషకాలు అందుతాయి. వారు కూడా ఇష్టంగా తింటారు.