Aloo Punugulu: పది నిమిషాల్లో వేడి వేడిగా రెడీ అయ్యే ఆలూ పునుగులు..

బంగాళ దుంపలు అంటే చాలా మందికి ఇష్టం. ఆలు గడ్డతో ఎలాంటి రెసిపీలు చేసినా చాలా రుచిగా ఉంటాయి. బంగాళ దుంపతో ఎన్నో వందల రకాల స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. ఆలుగడ్డతో తయారు చేసే చాలా రెసిపీలు ఇప్పటి వరకూ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మీ కోసం కేవలం పది నిమిషాల్లో త్వరగా రెడీ అయ్యే స్నాక్ తెలుసుకోబోతున్నాం. అన్నీ సిద్ధంగా ఉండాలే కానీ ఐదు నిమిషాల్లో మీరు తినేందుకు..

Aloo Punugulu: పది నిమిషాల్లో వేడి వేడిగా రెడీ అయ్యే ఆలూ పునుగులు..
Aloo Punugulu
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 09, 2024 | 9:18 PM

బంగాళ దుంపలు అంటే చాలా మందికి ఇష్టం. ఆలు గడ్డతో ఎలాంటి రెసిపీలు చేసినా చాలా రుచిగా ఉంటాయి. బంగాళ దుంపతో ఎన్నో వందల రకాల స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. ఆలుగడ్డతో తయారు చేసే చాలా రెసిపీలు ఇప్పటి వరకూ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మీ కోసం కేవలం పది నిమిషాల్లో త్వరగా రెడీ అయ్యే స్నాక్ తెలుసుకోబోతున్నాం. అన్నీ సిద్ధంగా ఉండాలే కానీ ఐదు నిమిషాల్లో మీరు తినేందుకు రెడీ ఉంటాయి. ఇవి తయారు చేయడం కూడా చాలా సింపుల్. మరి ఈ ఆలూ పునుగులను ఎలా తయారు చేస్తారు? దీని కోసం కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఆలూ పునుగులు తయారీకి కావాల్సిన పదార్థాలు:

ఉడికించిన ఆలు గడ్డ, పచ్చి మిర్చి, అల్లం ముక్కలు, ఉప్పు, కారం, జీలకర్ర, కరివేపాకు, కొత్తి మీర, ఉప్మా రవ్వ, టమాటాలు, వంట సోడా, ఆయిల్.

ఆలూ పునుగులు తయారీ విధానం:

బంగాళ దుంప పునుగులు తయారు చేసుకోవడానికి ముందుగా బంగాళ దుంపలను ఉడికించి పెట్టుకోవాలి. తొక్క తీసి మెత్తగా మెదిపి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లోకి పచ్చి మిర్చి, అల్లం, జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు ఉన్నా పర్వాలేదు. తినేటప్పుడు రుచిగా ఉంటాయి. ఈ పేస్టును కూడా పక్కన పెట్టిన బంగాళ దుంపలపై వేయాలి.

ఇవి కూడా చదవండి

ఆ నెక్ట్స్ ఇందులోనే ఉప్మా రవ్వ, సన్నగా తరిగిన టమాటాల ముక్కలు, కొత్తి మీర, కరివేపాకు, వంట సోడా అన్నీ వేసి బాగా కలుపు కోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి.. వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కాక చిన్న చిన్న పునుగులుగా వేయాలి. ఇవి ఎర్రగా వేగా తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే బంగాళ దుంప పునుగులు సిద్ధం. వేడి వేడిగా పుదీనా చట్నీ, టమాటా సాస్ లేదా అల్లం చట్నీ ఇవేమీ లేకున్నా నేరుగా తినేయవచ్చు.