AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిండి కలిపేటప్పుడు.. ఇదొక్కటి వేస్తే చాలు.. పూరీలు ఎక్కవ నూనె పీల్చుకోకుండా ప్లఫీగా వస్తాయి!

మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి పూరీలు తినడానికి చాలా మంది ఇష్టపడతారు. కానీ వాటిని ఎక్కువ ఆయిల్‌లో డీఫ్రై చేస్తారని.. నూనె ఎక్కువగా పీల్చుకుంటాయని తినేందుకు భయపడతారు. కానీ మీరు కొన్ని చిట్కాలు ఫాలో అయితే ఎక్కవ నూనె పీల్చుకోకుండా, పూరీలు కూడా చాలా మృదువుగా, ప్లఫీ ప్లఫీగా వస్తాయి. అదెలానో ఇక్కడ తెలుసుకుందాం.

పిండి కలిపేటప్పుడు.. ఇదొక్కటి వేస్తే చాలు.. పూరీలు ఎక్కవ నూనె పీల్చుకోకుండా ప్లఫీగా వస్తాయి!
Fluffy Poori Tips
Anand T
| Edited By: |

Updated on: Sep 30, 2026 | 8:08 AM

Share

దూదిలాంటి మెత్తటి పూరీలు కావాలంటే, పిండి కలిపేటప్పుడు పూర్తిగా నీళ్లకు బదులుగా సగం నీళ్లు, సగం గోరువెచ్చని పాలు వాడితే పూరీలు బాగా పొంగుతాయని. సెలెబ్రిటీ షెఫ్ రణ్‌వీర్ బ్రార్ సూచింయా చెబుతున్నారు. పిండి కలిపేటప్పుడు 1 కప్పు గోధుమ పిండిలో 1 చెంచా తాజా పెరుగు లేదా మీగడ కలపాలని.. దీనివల్ల పిండి చాలా మృదువుగా మారుతుంది, పూరీలు ఎక్కువ సమయం ఫ్రెష్‌గా, పొంగుతూ ఉంటాయని తెలిపారు. మీకు పూరీలు కాస్త క్రిస్పీగా రావాలంటే.. 2 కప్పుల గోధుమ పిండిలో 1 నుంచి 1.5 టేబుల్ స్పూన్ల సన్నటి ఉప్మా రవ్వ యాడ్ చేస్తే సరిపోతుంది.

పర్ఫెక్ట్ పూరీ కోసం కావాల్సిన పదార్థాలు

  • 2 కప్పుల గోధుమ పిండి
  • 1.5 టేబుల్ స్పూన్ల సన్నటి ఉప్మా రవ్వ
  • 1/2 టీస్పూన్ వాము
  • 1 టీస్పూన్ నెయ్యి లేదా నూనె
  • 1/2 టీస్పూన్ ఉప్పు
  • పిండి కలపడానికి తగినన్ని గోరువెచ్చని నీళ్లు
  • డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె

పర్ఫెక్ట్ పూరీల తయారీ విధానం

ఫర్ఫెక్ట్‌ పూరీలు తయారు చేసేందుకు ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో గోధుమ పిండి, రవ్వ, వాము, ఉప్పు, 1 చెంచా నెయ్యి వేయండి. చేత్తో ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. ఇప్పుడు కొద్దికొద్దిగా గోరువెచ్చని నీళ్లు పోస్తూ పిండిని గట్టిగా కలుపుకోండి. పూరీ పిండి చపాతీ పిండిలా మెత్తగా ఉండకూడదు. అలా ఉంటే పూరీలు నూనె పీల్చుకుని, వెంటనే చదునుగా మారిపోతాయి.

ఇప్పుడు కలిపిన పిండిపై కొద్దిగా నూనె రాసి, తడిపిన కాటన్ వస్త్రంతో కప్పి 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టండి. 15 నిమిషాల తర్వాత పిండిని మరో 1 నిమిషం పాటు బాగా పిసికి, సమాన పరిమాణంలో చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. ఉండలకు పొడి పిండి చల్లడానికి బదులుగా కొద్దిగా నూనె రాసి సమానంగా పూరీల్లా సాదుకోండి.

ఇప్పుడు కడాయిలో నూనెను బాగా వేడి చేయండి. నూనె నుండి తేలికపాటి పొగ వచ్చేటప్పుడు మంటను మీడియం-హైకి తగ్గించి నూనెలో పూరీని వేయండి. పూరీ వేసిన వెంటనే, చిల్లుల గరిటెతో దానిని తేలికగా నొక్కండి. పూరీ వెంటనే బెలూన్‌లా పైకి పొంగుతుంది. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసేయండి. అంతే ప్లఫీ ఫ్లఫీగా ఉండే ఫర్ఫెక్ట్ పూరీలు రెడీ అయినట్టే.. వాటిని ఆలూకుర్మా లేదా సాగుతో తింటే.. టేస్ట్ అదిరిపోతుందంతే.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us