Bendakaya Pachhadi: వేడి వేడి అన్నంలోకి బెండకాయ పచ్చడి వేసుకుని తింటే.. ఆహా అనాల్సిందే!!
వంకాయలతో, బీరకాయలతో, టమాటాలతో పచ్చడి చేసుకోవచ్చని తెలుసు కానీ.. బెండకాయ పచ్చడి గురించి చాలా తక్కువగా మందికి తెలిసి ఉంటుంది. ఎప్పుడూ బెండకాయతో కూరలు తిని విసిగిపోయి ఉంటారు. అలాంటి వారు ఈ సారి ఇలా పచ్చడి ట్రై చేయండి.. అస్సలు వదిలి పెట్టరు. బెండకాయతో పచ్చడేంటీ అనుకుంటున్నారా.. అసలు చాలా మంది బెండకాయలనే తినరు. కానీ బెండకాయలు తింటే కీళ్ల సమస్యలు తగ్గుతాయి. అలాంటి వాళ్లకు ఇలా పచ్చడి చేసి పెడితే..

వంకాయలతో, బీరకాయలతో, టమాటాలతో పచ్చడి చేసుకోవచ్చని తెలుసు కానీ.. బెండకాయ పచ్చడి గురించి చాలా తక్కువగా మందికి తెలిసి ఉంటుంది. ఎప్పుడూ బెండకాయతో కూరలు తిని విసిగిపోయి ఉంటారు. అలాంటి వారు ఈ సారి ఇలా పచ్చడి ట్రై చేయండి.. అస్సలు వదిలి పెట్టరు. బెండకాయతో పచ్చడేంటీ అనుకుంటున్నారా.. అసలు చాలా మంది బెండకాయలనే తినరు. కానీ బెండకాయలు తింటే కీళ్ల సమస్యలు తగ్గుతాయి. అలాంటి వాళ్లకు ఇలా పచ్చడి చేసి పెడితే.. ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకుని.. కొద్దిగా బెండకాయ పచ్చడి వేసుకుని తింటే.. ఆహా అనాల్సిందే. అంత రుచిగా ఉంటుంది. మరి బెండకాయ పచ్చడి ఎలా చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం.
బెండకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు:
బెండకాయలు, టమాటాలు, మెంతులు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కొత్తి మీర, కరివేపాకు, ఎండు మిర్చి, చింత పండు, ఉప్పు.
బెండకాయ పచ్చడి తయారీ విధానం:
ఒక కళాయి తీసుకుని.. నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి, కొత్తి మీర, కరివేపాకు వేసి మరికాసేపు వేయించుకున్నాక.. ఒక ప్లేట్ తీసుకుని వీటిని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కళాయిలో మరి కొద్దిగా నూనె వేసి.. ముందుగానే శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకోవాలి. వీటిని కలర్ మారేంత వరకూ వేయించు కోవాలి. ఆ నెక్ట్స్ టమాటాలు, ఉప్పు వేసి.. మీడియం మంటపై మూత పెట్టి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి.
బెండకాయ, టమాటా ముక్కలు పూర్తిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార బెట్టుకోవాలి. ముందు వేయించుకున్న దినుసులను మిక్సీ జార్ లోకి వేసుకుని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత టమాటా, బెండకాయలను కూడా వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత దీనికి తాళింపు వేసుకోవడమే. అంతే ఎంతో ఈజీగా ఈ రెసిపీ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు తయారు చేసేసుకోవచ్చు. ఎప్పుడూ బెండకాయతో కూరలు తిని బోర్ కొట్టిన వాళ్లు ఇలా వెరైటీగా పచ్చడి ట్రై చేయవచ్చు. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.




