AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Be Alert: ఆన్‌లైన్‌లో చికెన్ కొంటున్నారా..? ఈ విషయాలు గుర్తుంచుకోండి !

చికెన్ కొత్తగా ఉందా లేదా పాడైనదా అని గుర్తించడం చాలా ముఖ్యం. తాజా చికెన్ గులాబీ రంగులో ఉంటే మంచిదని, పసుపు రంగు ఉంటే దాని మీద ఫంగస్ చేరిందని తెలుసుకోవాలి. వాసన ద్వారా కూడా కొత్తగా ఉందా లేదా చెడిపోయిందా అని తేల్చవచ్చు. రబ్బరులా తయారైన చికెన్ తినడం వల్ల శారీరక సమస్యలు వస్తాయి. ఆన్‌లైన్‌లో ఫ్రోజెన్ చికెన్ ఆర్డర్ చేసే ముందు నాణ్యత చెక్ చేయాలి. తక్కువ ధరకే తీసుకుంటే అది పాడై ఉండే అవకాశం ఉంది. పాడైన చికెన్ వలన ఫుడ్ పాయిజన్ వంటి సమస్యలు తలెత్తుతాయి.

Be Alert: ఆన్‌లైన్‌లో చికెన్ కొంటున్నారా..? ఈ విషయాలు గుర్తుంచుకోండి !
Fresh Chicken
Prashanthi V
|

Updated on: Jan 19, 2025 | 6:35 PM

Share

చికెన్ కొనడంలో చాలా మంది చిన్నచిన్న జాగ్రత్తలు పాటించరు. అది తాజాగా ఉందా లేదా పాడైనదా అని గమనించకుండా తీసుకుంటారు. ఈ అలవాటు మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రత్యేకించి రెడీమేడ్ చికెన్ కొనేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం. ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తాజా చికెన్

చికెన్ తాజాగా ఉందో లేదో తెలుసుకోవడానికి దాని రంగు చాలా ముఖ్యమైన సూచన. లేత పసుపు రంగులో చికెన్ కనిపిస్తే దాని మీద ఫంగస్ చేరిందని అర్థం. అటువంటి చికెన్ తీసుకోవటం ఆరోగ్యానికి హానికరం.

వాసన ద్వారా గుర్తించండి

వాసన కూడా చికెన్ తాజాదనాన్ని గుర్తించడానికి ఉపయోగపడే మరో ముఖ్యమైన చిట్కా. తాజా చికెన్ చాలా మంచిగా వాసన వస్తుంది. కానీ కుళ్లిన వాసన వస్తే మాత్రం అది పాడయ్యిందని నిర్ధారించవచ్చు. కాబట్టి కొనేటప్పుడు స్మెల్ ను తప్పక గమనించండి.

వండిన తర్వాత ఎలా గుర్తించాలి ?

కొన్ని సందర్భాల్లో కొనేటప్పుడు కొత్తగా ఉన్నట్లు కనిపించిన చికెన్ వండిన తర్వాత రబ్బరు మాదిరిగా అవుతుంది. ఇది దాని నాణ్యత లోపం సూచిస్తుంది. అటువంటి చికెన్ తినడం వల్ల శారీరక సమస్యలు ఏర్పడవచ్చు.

ఆన్‌లైన్ చికెన్ తో జాగ్రత్త

ప్రస్తుతం ఆన్‌లైన్ ఆర్డర్ చేయడం సాధారణమైపోయింది. అయితే ఆన్‌లైన్ ద్వారా ఫ్రోజెన్ చికెన్ తీసుకునే పరిస్థితుల్లో చాలా జాగ్రత్తలు అవసరం. ఫ్రోజెన్ చికెన్ సరిగ్గా నిల్వ చేయలేకపోతే అది పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆన్‌లైన్ ఆర్డర్ చేసే ముందు నాణ్యతపై దృష్టి పెట్టండి.

ధరతో పాటు నాణ్యత ముఖ్యమే

చిన్నధరలో చికెన్ లభిస్తే తీసుకుందాం అని అనుకునే ముందు దాని నాణ్యతను చెక్ చేయడం చాలా ముఖ్యం. టేస్ట్‌తో పాటు ఆరోగ్యానికి మేలు చేసే చికెన్‌ను ఎంపిక చేయడం అవసరం. కొన్ని సార్లు తక్కువ ధరకే పాడైన చికెన్ అమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు నాణ్యతను మొదట చూడండి.

పాడైన చికెన్ తో ప్రమాదాలు ?

పాడైన చికెన్ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉంది. కడుపు నొప్పి, వాంతులు, డయేరియా వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇది గమనించకపోతే శరీరంపై దీర్ఘకాలిక ప్రభావాలు కూడా చూపవచ్చు.

నాన్ వెజ్ ప్రియులకు తాజా చికెన్‌ను గుర్తించడానికి పై చిట్కాలు చాలా ఉపయోగపడుతాయి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు రుచికరమైన ఆహారాన్ని కూడా ఆస్వాదించవచ్చు.