రాత్రిపూట పెరుగు తింటున్నారా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే

వేసవి(summer) ప్రారంభానికి ముందే ఎండలు మండిపోతున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పులతో మన డైట్ లో కూడా మార్పులు వస్తాయి. చిన్న చిన్న మార్పులకో ఆహార అలవాట్లను మార్చుకోవడం ద్వారా...

రాత్రిపూట పెరుగు తింటున్నారా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే
Curd
Follow us

|

Updated on: Mar 08, 2022 | 7:55 AM

వేసవి(summer) ప్రారంభానికి ముందే ఎండలు మండిపోతున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పులతో మన డైట్ లో కూడా మార్పులు వస్తాయి. చిన్న చిన్న మార్పులకో ఆహార అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఎండ వేడిమి నుంచి రక్షించుకోవచ్చు. వంటింట్లో ఉన్న సరకులతోనే వెరైటీగా చేసి రుచి, ఆరోగ్యాన్ని ఆస్వాదించవచ్చు. వేసవి అనగానే మనం ఎక్కువగా పెరుగు(Curd), మజ్జిగల మీద ఆధారపడుతూ ఉంటాం. పెరుగుకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. శరీరంలో తేమ శాతం తగ్గిపోకుండా కాపాడి, ఇమ్యూనిటీని పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. ఎముకలను బలంగా ఉంచేందుకు, జీర్ణ శక్తిని మెరుగు పరిచేందుకు పెరుగు చక్కని పదార్థం. దీనిని రోజూ డైట్ లో చేర్చుకుంటే అధిక బరువును కూడా తగ్గించేందుకు సహాయపడుతుంది.

ఆయుర్వేదంలోనూ పెరుగుకు విశేష ప్రాధాన్యం ఉంది. పెరుగు శరీరంలోని వేడిని నియంత్రించి, శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది. దగ్గు, జలుబు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు కర్డ్ తీసుకోకపోవడం ఉత్తమం. ఎప్పుడూ కూడా రాత్రి పూట పెరుగు తినకూడదు. అంతే కాకుండా పండ్లతో కలిపి పెరుగు తీనవద్దు. చికెన్, మాంసం, చేపలు వంటివి తినేటప్పుడు పెరుగును ఉపయోగించకపోవడం మంచిది. అయితే పెరుగు స్థానంలో మజ్జిగ తీసుకోవచ్చని డైట్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. మజ్జిగను రోజూ తీసుకోవచ్చు. ఉప్పు, మిరియాల పొడి, జీల కర్ర కలిపి తాగొచ్చు. మజ్జిగ ద్వారా జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అసిడిటీతో పోరాడుతుంది. ఎముకలను బలంగా చేస్తుంది. కొలెస్ట్రాల్‌, బరువు తగ్గించేందుకు సహాయపడుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమం ఉత్తమం.

Also Read

Viral Photo: మీకో సవాల్.. ఈ ఫోటోలో అందమైన జంతువు దాగుంది.. అదేంటో కనిపెట్టే శక్తి మీకుందా?

Tollywood: ఆడవాళ్లు మీకు జోహార్లు.. మెగా ఫోన్ పట్టి తమ సత్తా చాటిన నారీమణులు..

Viral Video: జడేజా స్టైల్‌ని ఫాలో అవుతున్న ఏనుగు పిల్ల.. ఫిదా అవుతున్న నెటిజన్లు