AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salmon Fish: సాల్మన్ చేపలు.. రుచితో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం.. లెక్కకు మించిన ప్రయోజనాలు

చికెన్, మటన్‌తో పోల్చుకుంటే.. ఫిష్ శరీరానికి చాలా ఉపయోగకరం అని ఆరోగ్య నిపుణులు చెబుతారు. సరిగ్గా కానీ పులుసు పెట్టినా, ఫ్రై చేసినా చేపల కూర ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.

Salmon Fish: సాల్మన్ చేపలు.. రుచితో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం.. లెక్కకు మించిన ప్రయోజనాలు
Salmon Fish
Ram Naramaneni
|

Updated on: Mar 05, 2022 | 6:20 PM

Share

health benefits of eating salmon: చికెన్, మటన్‌తో పోల్చుకుంటే.. ఫిష్ శరీరానికి చాలా ఉపయోగకరం అని ఆరోగ్య నిపుణులు చెబుతారు. సరిగ్గా కానీ పులుసు పెట్టినా, ఫ్రై చేసినా చేపల కూర ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఇక చేపల్లో చాలా రకాలుంటాయి. కొన్ని చేపలు రుచి కూడా వేరుగా ఉంటుంది. అయితే మీరు ఎప్పుడైనా సాల్మన్ చేపలు తిన్నారా..? కనీసం వాటి గురించి విన్నారా..? లేదంటే మాత్రం మీరు ఈ చేపల గురించి చాలా విషయాలు తెలసుకోవాలి.  ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఈ చేపల్లో మెండుగా ఉంటాయి. వీటిని తినడం వల్ల వ్యాధులతో పోరాడే శక్తి పెరుగుతుంది. ప్రాణాంతకమైన గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో  ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కీ రోల్ పోషిస్తాయి. ఇవి శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను బయటకు పంపి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో బాడీలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. రక్తనాళాల్లో కొవ్వు ఉండదు. ఫలితంగా గుండె జబ్బులు దరిచేరవు. అథెరోస్క్లెరోసిస్ అనేది గుండెకు వచ్చే ఒక మేజర్ ప్రాబ్లం. దీని వల్ల ధమనులలో ఫలకాలు ఏర్పడతాయి. సాల్మన్ చేపలోని ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఈ ఫలకాల వల్ల కలిగే మంటని చల్లార్చేందుకు,  అలా ఫలకాలు ఏర్పడకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి. సాల్మన్ చేపల్లో వివిధ విటమిన్‌లు, ప్రొటీన్లు, సెలీనియం దీని నుండి లభ్యమవుతాయి. ఇవన్నీ కాలేయ క్యాన్సర్‌ను నిరోధించడంలో తోడ్పడతాయి. గుండెపోటును కూడా అడ్డుకుంటాయి. అందుకే మార్కెట్‌కి వెళ్లినప్పుడు సాల్మన్ చేపలు కనిపిస్తే మాత్రం అస్సలు వదలొద్దు.. రుచితో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం.

Also Read:  Telangana: కంప్లైంట్ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన 3వ తరగతి బుడ్డోడు.. రీజన్ తెలిస్తే అవాక్కే