Ganesh Chaturthi 2025: వినాయక చవితి స్పెషల్.. తమిళనాడు స్పెషల్ కొజుకట్టై.. రెసిపీ మీ కోసం..
హిందువులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటి వినాయక చవితి. ఈ పండగను దేశ వ్యాప్తంగా డిల్లీ నుంచి గల్లీ వరకూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే గణపతి పూజ, నియమాలు ప్రాంతాల వారీగా విభిన్నంగా ఉంటాయి. దక్షిణాదిలో ఒక తరహాలో, ఉత్తరాదివారు ఒక విధంగా నైవేద్యాలను సమర్పిస్తారు. ఈ రోజు గణపయ్యకు ఇష్టమైన మొదకాన్ని తమిళనాడు స్టైల్ లో తయారీ విధానం తెలుసుకుందాం.. దీనిని తమిళనాడులో కొజుకట్టై అంటారు.

వినాయక చవితిలో గణపయ్యకి సమర్పించే ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. నైవేద్యంగా సమర్పించే ఆహారంలో ఎక్కువగా బియ్యం పిండితో చేసినవే ఉంటాయి. చవితికి తప్పనిసరిగా చేసే వాటిలో ఒకటి మోదకం. దీనిని ఆంధ్ర, తమిళనాడు, కేరళ వంటి వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా తయారు చేస్తారు. ఈ రోజు గణపయ్యకు ఇష్టమైన తమిళనాడు తరహాలో చేసే కొజుకట్టై రెసిపీ గురించి తెలుసుకుందాం..
తయారీకి కావాల్సిన పదార్ధాలు
- బియ్యం పిండి – 1.5 కప్పులు
- కొబ్బరి కోరు – 1.5 కప్పు
- బెల్లం – 1 కప్పు (తీపికి అనుగుణంగా )
- యాలకుల పొడి – రెండు స్పూన్లు
- నెయ్యి – కొంచెం
- ఉప్పు – చిటికెడు
- నీరు – 1.1/4 కప్పు
తయారీ విధానం: స్టవ్ మీద బాణలి పెట్టి తురిమిన కొబ్బరి, బెల్లం వేసి బాగా కలపండి. తర్వాత నెయ్యి, యాలకుల పొడి వేసి.. ఈ మిశ్రమాన్ని బాగా ఉడికించండి. తర్వాత స్టవ్ మీద నుంచి బాణలి తీసి పక్కకు పెట్టండి. చల్లారిన తర్వాత మీడియం సైజ్ లో ఉండలు చుట్టుకోవాలి.
ఇంతలో మళ్ళీ మరొక గిన్నె తీసుకుని కప్పుమ్పావు నీరు పోసి.. నెయ్యి, కొంచెం ఉప్పు, కొంచెం బెల్లం పొడి వేసి నీరు మరిగించండి. నీరు మరిగిన తర్వత ఇందులో బియ్యం పొడి వేసి బాగా కలపాలి. ఈ బియ్యం పిండి మిశ్రమాన్ని బాగా కలిపి .. పెద్ద బంతి సైజ్ లో ఉండ చేసి.. దాని మద్యలో కొబ్బరి బెల్లం మిశ్రమ ఉండని పెట్టి.. ఈ స్టఫింగ్ ని బియ్యం పిండి మిశ్రమంతో కవర్ చేయండి. ఇలా అన్నిటిని చేసుకోవాలి.
ఇంతలో స్టవ్ మీద స్టీమర్ లేదా ఇడ్లీ పాత్రని పెట్టి పెట్టి.. అందులో తగినంత నీరు పోసి వేడి చేయాలి.. రెడీ చేసుకున్న కొజుకట్టై ఉండలను ఒక ప్లేట్ లో పెట్టి.. స్టీమర్ లో లేదా ఇడ్లీ పాత్రలో పెట్టి.. మీడియం మంట 10-15 నిమిషాలు ఆవిరికి ఉడికించండి. అంతే వినాయకుడికి సమర్పించడానికి కొజ్జుకట్టై సిద్ధంగా ఉంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








