Vinayaka Chavithi: వినాయక చవితి స్పెషల్.. టేస్టీ టేస్టీ షుగర్ ఫ్రీ డ్రై ఫ్రూట్స్ మోదకాలు తయారీ విధానం..

| Edited By: Anil kumar poka

Aug 29, 2022 | 6:18 PM

మోదకం గణేశుడికి చాలా ప్రీతికరం. ఈ సందర్భంగా మొడకాన్ని ప్రసాదం కూడా చేసుకోవచ్చు. ఆరోగ్యకరమైన షుగర్ ఫ్రీ మోదకాలను తయారు చేసుకోవచ్చు. ఈ రోజు టేస్టీ టేస్టీ షుగర్ ఫ్రీ మోదకాలను తయారు విధానం గురించి  తెలుసుకుందాం.

Vinayaka Chavithi: వినాయక చవితి స్పెషల్.. టేస్టీ టేస్టీ షుగర్ ఫ్రీ డ్రై ఫ్రూట్స్ మోదకాలు తయారీ విధానం..
Ganesh Chaturthi 2022
Follow us on

Vinayaka Chavithi: భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి నాడు గణేష్ చతుర్థి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగ 10 రోజుల పాటు అంగరంగ వైభంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఇంట్లో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. పూజాదికార్యక్రమాలు నిర్వహిస్తారు.  వివిధ రకాల రుచికరమైన వంటకాలు తయారుచేస్తారు. మోదకం గణేశుడికి చాలా ప్రీతికరం. ఈ సందర్భంగా మొడకాన్ని ప్రసాదం కూడా చేసుకోవచ్చు. ఆరోగ్యకరమైన షుగర్ ఫ్రీ మోదకాలను తయారు చేసుకోవచ్చు. ఈ రోజు టేస్టీ టేస్టీ షుగర్ ఫ్రీ మోదకాలను తయారు విధానం గురించి  తెలుసుకుందాం.

షుగర్ ఫ్రీ మోదక తయారీకి కావలసిన పదార్ధాలు:
ఖర్జూరాలు-1 కప్పు
ఎండుద్రాక్ష-10
పిస్తాపప్పులు-10 తరిగిన
జీడిపప్పు-8
బాదం-8 తరిగిన
ఎండు కొబ్బరి పొడి-కప్పు
గసగసాలు-2 స్పూన్
నెయ్యి-2 స్పూన్

మోదక్ తయారు చేసే విధానం:
స్టెప్ – 1
బాణలిలో నెయ్యి వేసి వేడి చేయండి. అందులో గసగసాలు వేసి బాగా వేయించండి.
దశ – 2
ఇప్పుడు అందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి వేయించండి. అనంతరం కొబ్బరి పొడి వేసి వేయించండి.
దశ – 3
దీని తరువాత, ఖర్జూరాలను బ్లెండర్లో వేసి మెత్తగా పేస్ట్ చేయండి
దశ – 4
ఇప్పుడు వేయించిన డ్రై ఫ్రూట్స్ ను ఖర్జూర మిశ్రమాన్ని బాగా కలపాలి. మోదక మిశ్రమాన్ని రెడీ చేసి చల్లారనివ్వాలి.
దశ – 5
ఇప్పుడు మోదక్ అచ్చును తీసుకోండి. అందులో నెయ్యి వేసి.. మిశ్రమాన్ని అచ్చులో పోసి మోదకాలను రెడీ చేసుకోండి.
దశ – 6
ఈ విధంగా తయారు చేసిన మోదకాల పైన మోదక్‌ను గసగసాలతో అలంకరించండి. అంటే టేస్టీ టేస్టీ షుగర్ ఫ్రీ డ్రై ఫ్రూట్స్ మోదకాలు రెడీ.. గణపతికి నైవేద్యం పెట్టి అనుగ్రహం సొంతం చేసుకోండి.

ఇవి కూడా చదవండి

డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
డ్రై ఫ్రూట్స్‌ను భారతీయ వంటకాల్లో అదనపు రుచి కోసం ఉపయోగిస్తారు. ఇవి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. వాటిలో చాలా పోషకాలు ఉన్నాయి.  ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి పోషకాలు ఉన్నాయి. మీరు వీటిని స్నాక్స్‌గా కూడా తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ను స్వీట్స్,  ఖీర్ లో ఉపయోగిస్తారు. ఇందులో జీడిపప్పు, బాదం, పిస్తా, ఎండుద్రాక్ష , ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి