AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Milk Side Effects: వీటిని పాలతో పాటు అస్సలు తినకూడదు.. ఆరోగ్యానికి హానికరం.. ఎందుకో తెలుసుకోండి!

శరీరానికి కావాల్సిన పోషకాలు, కాల్షియం పాలల్లో పుష్కలంగా ఉన్నాయి. అవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. పిల్లలే కాదు...

Milk Side Effects: వీటిని పాలతో పాటు అస్సలు తినకూడదు.. ఆరోగ్యానికి హానికరం.. ఎందుకో తెలుసుకోండి!
Milk
Ravi Kiran
|

Updated on: Jan 07, 2022 | 9:44 AM

Share

శరీరానికి కావాల్సిన పోషకాలు, కాల్షియం పాలల్లో పుష్కలంగా ఉన్నాయి. అవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడతాయి. పిల్లలే కాదు, పెద్దవారిని సైతం రోజుకోసారైన పాలు తాగమని డాక్టర్లు సూచిస్తుంటారు. అయితే పాలతో పాటు కొన్ని ఆహార పదార్ధాలను తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. వాటిని పాలతో పాటు తిన్నట్లయితే.. ఎక్కడలేని అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. మరి ఆ ఆహార పదార్ధాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ముల్లంగి:

కొంతమంది వ్యక్తులు అల్పాహారంలో ముల్లంగికి సంబంధించిన ఏదైనా వంటకం తిని.. ఆ వెంటనే పాలు తాగుతుంటారు. అయితే ఇలా తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని డాక్టర్ల అభిప్రాయం. చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉందట. అందుకే ముల్లంగి తిన్న 2 గంటల తర్వాత పాలు తాగాలని సూచిస్తున్నారు.

మినపప్పు:

పాలతో పాటు పప్పు దినుసులను అస్సలు తీసుకోవద్దు. ముఖ్యంగా మినపప్పు.. అందులోనూ ఉప్పు లేదా ఆమ్లా పదార్ధాలు దానిలో కలిపినట్లయితే.. దాన్ని తీసుకున్నవెంటనే పాలు తాగొద్దు. డైట్‌లో భాగంగా ఈ రోజుల్లో చాలామంది మొలకెత్తిన పప్పులు తిన్న తర్వాత పాలు తాగుతున్నారు. అయితే ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరం. పాలతో పాటు మినపప్పును తింటే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు.

ఉప్పుతో కూడిన ఆహారాలు:

సహజంగా ఉప్పు లేకుండా ఏ వంటకం ఉండదు. వంటింటిలో ఉప్పు కీ రోల్ పోషిస్తుంది. అయితే ఉప్పు, పాలను అస్సలు కలపకూడదు. బ్రేక్‌ఫాస్ట్ తిన్న తర్వాత గానీ.. రాత్రి భోజనం చేసిన వెంటనే పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యుల సలహా. ఆయుర్వేదం ప్రకారం.. ఇలా చేస్తే చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందట. అందుకే టిఫిన్ లేదా భోజనం తర్వాత కొంత సమయం గ్యాప్ ఇచ్చి పాలు తీసుకోవాలని అంటారు.

పండ్లు:

ఆరెంజ్, లెమన్, లైమ్, ద్రాక్షపండు, చింతపండు, ఆమ్లా, గ్రీన్ ఆపిల్స్ లాంటి పుల్లని స్వభావం ఉన్న పండ్లను పాలతో కలిపి తినకూడదు. పాలు విషపూరితం కావచ్చు. అలాగే అరటిపండుతో పాటు పాలను అస్సలు తీసుకోవద్దు. పాలు, అరటిపండు కలిపి తీసుకోవడం వల్ల కఫం సమస్య ఏర్పడుతుంది. జీర్ణవ్యవస్థపై కూడా ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతున్నారు.

కాగా, ఈ ఆహార పదార్ధాలతో పాటు చెర్రీస్, ఈస్ట్ కలిగిన ఫుడ్స్, గుడ్లు, మాంసం, చేపలు, కిచ్చారి, పెరుగు, బీన్స్ లాంటివి కూడా పాలతో కలిపి తినకూడదట. వీటి వల్ల మనకు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. తేనే, బెల్లం, పంచదారను మాత్రమే పాలతో కలిపి తీసుకోవాలని.. మరేది పాలతో కలపొద్దని అంటున్నారు.