AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Perfect Watermelon: వామ్మో ఇలాంటి పుచ్చకాయ తింటే ఆస్పత్రికే..! తస్మాత్‌ జాగ్రత్త..

వేగంగా పండించడానికి కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ఈ పదార్థాలు శరీరానికి హానికరం. కాల్షియం కార్బైడ్ ఎసిటిలీన్ వాయువును విడుదల చేస్తుంది. ఇది సహజ పండించేలా చేస్తుంది. కానీ ఫాస్ఫరస్ హైడ్రైడ్, ఆర్సెనిక్ లాంటి ప్రమాదకరమైన సమ్మేళనాలు కలిగి ఉండటంతో ఆరోగ్యానికి హానీ చేస్తాయని నిపుణులు చెప్తున్నారు.

Perfect Watermelon: వామ్మో ఇలాంటి పుచ్చకాయ తింటే ఆస్పత్రికే..! తస్మాత్‌ జాగ్రత్త..
Perfect Watermelon
Jyothi Gadda
|

Updated on: May 12, 2025 | 7:46 PM

Share

ఎండలు మండిపోతున్నాయి.. భానుడి భగభగలకు ఉక్కపోత, విపరీతమైన వేడితో పిల్లల నుంచి పెద్దల వరకు అల్లాడిపోతున్నారు. ఎండల వేడిమి, ఉక్కపోతతో చాలామంది వేసవి తాపానికి చెక్ పెట్టేందుకు శీతలపానీయలు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొబ్బరిబొండాం, పుచ్చకాయ, లెమన్ వాటర్, ఇతర జ్యూస్‌లు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. అయితే సమ్మర్ ఫ్రుట్ అనగానే చాలామంది పుచ్చకాయ మొదట గుర్తుకువస్తుంటుంది. అయితే మార్కెట్లో దొరికే పుచ్చకాయలు సైతం కల్తీ అవుతున్నాయనే ఆరోపణలు వినిస్తున్నాయి. రంగు, రుచితోపాటు ఎక్కువ రోజులు నిల్వ చేయడానికి ఇంజెక్షన్లు ఇస్తున్నారని తెలుస్తోంది. అయితే మీరు పుచ్చకాయ తింటున్నారా..? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి.

సాధారణంగా ఎండాకాలంలో పుచ్చకాయలకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. అందుకే కాలానుగుణ డిమాండ్‌ను తీర్చడానికి కొంతమంది వ్యాపారులు ఎక్కువ కాయలు అమ్మడానికి అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ క్రమంలో ఎరిథ్రోసిన్-బి (రెడ్-బి) వంటి సింథటిక్ రంగులతో పుచ్చకాయలను ఇంజెక్ట్ చేస్తున్నారు. వేగంగా పండించడానికి కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ఈ పదార్థాలు శరీరానికి హానికరం. కాల్షియం కార్బైడ్ ఎసిటిలీన్ వాయువును విడుదల చేస్తుంది. ఇది సహజ పండించేలా చేస్తుంది. కానీ ఫాస్ఫరస్ హైడ్రైడ్, ఆర్సెనిక్ లాంటి ప్రమాదకరమైన సమ్మేళనాలు కలిగి ఉండటంతో ఆరోగ్యానికి హానీ చేస్తాయని నిపుణులు చెప్తున్నారు.

పుచ్చకాయ కొనే ముందు గుర్తించుకోవాల్సిన విషయాలు..

ఇవి కూడా చదవండి

– ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉంటే తినొద్దు – పుచ్చుకాయలు కొనేముందు.. అక్కడున్న పండ్లు ఒకే రంగులో ఉంటే కొనొద్దు. – పండు ఒక భాగం మృదువుగా, మరో భాగం గట్టిగా అనిపిస్తే ఆ పండు కచ్చితంగా కల్తీ అయ్యినట్టే అని భావించాలి. – తొక్కపై అక్కడక్కడ పగుళ్లు ఉంటే మంచిదికాదని భావించాలి.

కల్తీ పండ్లతో కలిగే నష్టాలు

– వాంతులు – విరేచనాలు – బలహీనత – తలనొప్పి – జ్ఞాపకశక్తి కోల్పోవడం – నాడీ సంబంధిత సమస్యలు మూత్రపిండాల సమస్యలు

ఏం చేయాలంటే

– సేంద్రీయ ఉత్పత్తులను అమ్మడంలో ప్రసిద్ధి చెందిన వ్యాపారుల దగ్గర మాత్రమే కొనాలి. – పుచ్చకాలు ఎక్కడ సాగవుతున్నాయో అడిగి తెలుసుకోవడం మరవకండి. – FSSAI ప్రకారం సహజంగా పండిన పుచ్చకాయ దాని అడుగు భాగంలో పసుపు లేదా నారింజ మచ్చ ఉంటుంది. – తినడానికి ముందు బాగా కడగాలి. – తినడానికి ముందు మంచిదా?కదా? కచ్చితంగా చెక్ చేయాలి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..