రోజూ ప్యాకెట్ పాలు తాగుతున్నారా ? అయితే ఎలాంటి పాలు మంచివో తెలుసా ?.. ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..
ప్రస్తుత ఆధునిక కాలంలో ప్యాకెట్ పాలు వాడకం ఎక్కువగా పెరిగిపోయింది. నేరుగా పశువుల నుంచి తీసుకువచ్చే పాలను తీసుకోవడం మర్చిపోయి..
ప్రస్తుత ఆధునిక కాలంలో ప్యాకెట్ పాలు వాడకం ఎక్కువగా పెరిగిపోయింది. నేరుగా పశువుల నుంచి తీసుకువచ్చే పాలను తీసుకోవడం మర్చిపోయి.. ప్రతి ఒక్కరు మార్కెట్లో లభించే ప్యాకెట్ పాలను ఉపయోగిస్తున్నారు. అయితే ప్యాకెట్ పాలను వాడడం మంచిందా ? అందులో నిజంగానే స్వచ్చమైన పాలు ఉంటాయా ? లేదా పౌడర్ పాలు ఉంటాయా? అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. ప్యాకెట్ పాలు మంచివా ? లేదా టెట్రా పాక్స్ మంచివా ? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్గానిక్ మిల్క్.. ఆర్గానిక్ మిల్క్ అంటే.. పాలు ఇచ్చే పశువులకు పెట్టే దాణాకు ఎలాంటి క్రిమి సంహారక మందులు వేయరు. అలాగే పశువులు ఎక్కువ పాలు ఇవ్వడానికి హార్మోన్స్ గానీ, మందులు గానీ వేయరు.
పచ్చిపాలు.. వీటిని పాశరైజ్ చేయరు. ఇవి ఎలాంటి పద్ధతిలోనూ ట్రీట్ చేయని హోల్ మిల్క్. ఇవి ఆర్గానిక్, ఇన్ ఆర్గానిక్ విధాలుగా లభిస్తాయి. లోకల్ గా ఉండే పాల కేంద్రాల సభ్యులు వీటిని సప్లై చేస్తుంటారు.
ఇన్ ఆర్గానిక్.. పాలు ఇచ్చే పశువులకు పెట్టే దాణా పెస్టిసైడ్స్ తో తయారు చేస్తారు. ఇవి ఉండే ప్రదేశం కూడా శుభ్రంగా ఉండదు.
ఏ పాలు మంచివంటే.. గ్రామీణా ప్రాంతాల్లో నుంచి పాలను ఎక్కువగా పట్టణాలకు సప్లై చేస్తుంటారు. పాలను పాశ్చరైజ్ చేసి.. హోమోజినైజ్ చేశాక ప్యాకెట్ లో పెట్టి విక్రయిస్తుంటారు. ఆ పాలని మరగబెట్టి వెంటనే చల్లార్చడాన్ని పాశ్చురైజ్ అంటారు. ఇలా చేయడం వలన పాలలో ఉన్న బాక్టీరియా నశించిపోతుంది. పాకెట్ మిల్క్ టోండ్, డబుల్ టోన్డ్ మిల్క్, ఫుల్ క్రీమ్ రకాల్లో లభిస్తుంటాయి.
పాలల్లో రకాలు.. పాశ్చురైజ్ చేసి హోమోజినైజ్ చేసి నీళ్లు కలపని పాలు ఫుల్ క్రీమ్ మిల్క్. అలాగే టోన్డ్, డబుల్ టోన్డ్ పాలల్లో నీళ్లు కలుస్తాయి. అయితే ఈ మూడింటిలో కెలొరీలూ, పోషక విలువలు వేరు వేరుగా ఉంటాయి. వీటిని ఎక్కువగా అర్బన్ ఏరియాల్లో వాడుతుంటారు.
Also Read: మరో గుర్తుండిపోయే ఐకానిక్ రోల్లో రామ్ చరణ్.. పాన్ ఇండియా డైరెక్టర్ సినిమాలో సరికొత్త లుక్..