AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..?నిపుణులు ఏం చెబుతున్నారంటే..

ప్రతి రోజు మూడు ఖర్జూరాలు తినడం వల్ల ఆరోగ్యపరంగా బోలెడన్ని ప్రయోజనాలు చేకూరతాయని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఫైబర్‌, ప్రోటీన్‌, పొటాషియం, మెగ్నీషియం, కాపర్‌ వంటి మూలకాలు లభిస్తాయి. కానీ, వర్షాకాలంలో ఖర్ఝూరాలు తింటే ఏమౌతుందో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..?నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Dates
Jyothi Gadda
|

Updated on: Aug 07, 2025 | 6:38 PM

Share

వర్షాకాలంలో ఎదురయ్యే ఇన్ఫెక్షన్లు, ఇతర అనారోగ్యాలతో పోరాడే శక్తిని ఖర్జూరాలు శరీరానికి అందిస్తాయి. నిద్రలేమి సమస్యకు ఖర్జూరాలు మంచి మందుగా పని చేస్తాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో ఖర్జూరాలు తినటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది..ఖర్జూరాల్లో పీచు అధికంగా ఉంటుంది.. మలబద్ధకం, ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్‌ పెడుతుంది. ఖర్జూరాలను తినడం వల్ల శరీరంలోని అనవసర కొవ్వుల్ని కరిగించి, చక్కటి శరీరాకృతిని మనకు అందిస్తుంది. ఖర్జూరంలో కాల్షియం, ఫాస్పరస్‌ ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచుతాయి.

ఖర్జూరాలు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడతాయి. శరీరానికి శక్తిని అందిస్తాయి. ఇది నిద్ర రుగ్మతలను తొలగిస్తుంది. అలెర్జీలతో పోరాడటానికి సహాయపడుతుంది. ఖర్జూరాలు ఇన్ఫెక్షన్లతో పోరాడి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. మలబద్ధకం, ఆమ్లత్వం వంటి సమస్యలలో కూడా ఉపశమనం కలిగిస్తాయి. నెలసరి సమయంలో ఖర్జూరాలు తీసుకోవడం వల్ల అటు ఆరోగ్యంతో పాటు ఇటు నెలసరి నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచే శక్తి ఖర్జూరాలకు ఉందని పలు అధ్యయనాల్లో రుజువైంది.

ప్రసవానికి దగ్గరలో ఉన్న మహిళలు ఖర్జూరం తినడం వల్ల సుఖప్రసవం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఏ వయసు వారైనా సరే.. పరగడుపున ఖర్జూరాలను తీసుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు మూడు ఖర్జూరాలు తినడం వల్ల ఆరోగ్యపరంగా బోలెడన్ని ప్రయోజనాలు చేకూరతాయని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఫైబర్‌, ప్రోటీన్‌, పొటాషియం, మెగ్నీషియం, కాపర్‌ వంటి మూలకాలు లభిస్తాయి. వర్షాకాలంలో జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తాయి. జీర్ణ సమస్యలను దూరం చేసుకునేందుకు ఖర్జూరం తినడం ఉత్తమం. ఖర్జూరంలోని ఫైబర్‌ ఆహారం అరుగుదలను ప్రోత్సహిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..