AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fruit Salad: ఫ్రూట్ సలాడ్ తింటున్నారా?..అయితే ఇవి కలిపి తింటే ఆరోగ్యానికి లాభాలే లాభాలు..!

ఫ్రూట్ అండ్ వెజిటబుల్ సలాడ్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, ఫైబర్ వంటి పోషకాలు అందుతాయి. అయితే ఈ రెండు సలాడ్లను కలిపి తినే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Fruit Salad: ఫ్రూట్ సలాడ్ తింటున్నారా?..అయితే ఇవి కలిపి తింటే ఆరోగ్యానికి లాభాలే లాభాలు..!
ఆహారంతో పాటు పండ్లను తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. భోజనం తర్వాత పండ్లు తినడం వల్ల జీర్ణశక్తి తగ్గుతుంది. దీంతో జీర్ణవ్యవస్థపై ఒత్తిడి ఏర్పడి ఆహారం జీర్ణం కావడం కష్టమవుతుంది. పండ్లు ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికీ, వాటిలో సహజ చక్కెరలు ఉంటాయి. పండ్లను ఎక్కువగా తినడం వల్ల బరువు పెరగడంతోపాటు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం తర్వాత పండ్లు తినకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Velpula Bharath Rao
|

Updated on: Dec 15, 2024 | 8:17 AM

Share

సలాడ్ తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కొంతమందికి ఫ్రూట్ సలాడ్ ఇష్టం ఉంటే మరికొందరికి వెజిటబుల్ సలాడ్ అంటే ఇష్టం ఉంటుంది. ఇంకా కొంత మందికి ఫ్రూట్ వెజిటబుల్ సలాడ్‌లను కలిపి తినడానికి ఇష్టపడతారు. అయితే ఈ రెండింటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, పొటాషియం, జింక్ ఐరన్‌‌తో సహా అనేక పోషకాలు శరీరంలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ ఇనిస్టిట్యూట్‌లోని చీఫ్ డైటీషియన్ ప్రియా పాలివాల్ మాట్లాడుతూ.. పండ్లు కూరగాయల సలాడ్‌లను కలిపి తినడం ఆరోగ్యకరమైన ఎంపిక అని తెలిపారు. తాజా పళ్లు, కూరగాయలతో కూడిన సలాడ్‌ని కలిపి తింటే వాటి నుంచి విటమిన్లు, మినరల్స్, పీచు పదార్థాలు ఎక్కువగా లభించడమే కాకుండా వాటిల్లో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయని ఆమె చెప్పారు.

అయితే, ఈ రెండూ పండ్లు కూరగాయల సలాడ్‌లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే వీటిని తినే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. ఈ రెండు సలాడ్లను కలిపి తింటే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో నిపుణుల చెబుతున్న విషయాలు ఏంటంటే?

కూరగాయలు ఫ్రూట్ సలాడ్‌లను కలిపి తింటుంటే మంచి కాంబీనేషన్‌‌ను ఎంచుకోవాలి.  ఆపిల్, క్యారెట్,  ఎర్ర ముల్లంగి దుంపలను సలాడ్‌‌గా తీసుకుంటే మంచిది. ఇలా కూరగాయలు ఫ్రూట్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అలాగే ఫైబర్, విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తాయి. మధుమేహం కిడ్నీ రోగులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పండ్లు  కూరగాయలను సలాడ్ చేయడానికి ముందు, వాటిని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి.

ఫ్రూట్, వెజిటబుల్ సలాడ్‌లను కలిపి తినే ముందు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు అవి ఆరోగ్యానికి కొంత హాని కలిగించే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. కొన్ని పండ్లు, కూరగాయలు జీర్ణక్రియలో సమస్యలను కలిగిస్తాయి. అంతే కాదు, కొన్ని పండ్లు, కూరగాయలను కలిపి సలాడ్ రూపంలో తినడం వల్ల కూడా అలర్జీ సమస్యలు వస్తాయి. నిపుణులు కూడా వాటిని సరైన క్వాంటిటీలో తీసుకోవాలని సూచిస్తున్నారు.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను నేరుగా సంప్రదించండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి