Gastric Problems: ఈ ఆహారపదార్ధాలు కష్టంగా జీర్ణమవుతాయి.. తినకూడని సమయంలో తింటే గుండె మంట ఏర్పడే అవకాశం ఉంది
Gastric Problem-Health Tips: ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైంది. ఆహారం ఘన, ద్రవ రూపాల్లో లభ్యం అవుతుంది. అయితే కొన్ని ఆహారపదార్ధాలు తేలికగా జీర్ణమయితే..
Gastric Problem-Health Tips: ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైంది. ఆహారం ఘన, ద్రవ రూపాల్లో లభ్యం అవుతుంది. అయితే కొన్ని ఆహారపదార్ధాలు తేలికగా జీర్ణమయితే.. మరికొన్ని ఆహారపదార్ధాలు జీర్ణమవడానికి సమయం పడుతుంది. అలా తినే ఆహారాలు మెల్లగా లేదా కష్టంగా జీర్ణం అయ్యేవిగా వుంటే అవి గుండె మంటకు కారణమవుతాయి. అయితే అలా అన్ని ఆహారపదార్ధాలు మంటను కలిగించవు. అయితే, చిన్నపాటి చాక్లెట్ లేదా ఐస్ క్రీమ్ వంటివి కూడా అజీర్ణం కలిగించవచ్చు. కొన్నిసార్లు ఆహారాలు తినవలసిన విధంగా తినకపోయినా అజీర్ణం ఏర్పడుతుంది. కొన్ని ఆహారాలు కష్టంగా జీర్ణం అవటం, గుండె మంటను కలిగించటం చేస్తాయి. ఈరోజు కష్టంగా జీర్ణమయ్యే ఆహారపదార్ధాల గురించి తెలుసుకుందాం.
గింజ ధాన్యాలు: పప్పులు, రాజ్మా, కిడ్నీ బీన్స్, గింజలు వంటివి కూడా బరువైన ఆహారపదార్ధాలు. వీటిలో కూడా ఆలిగో సచ్చరైడ్స్ అనే పదార్ధం వుంటుంది. అందుకనే వీటిని తింటే జీర్ణం అవడానికి సమయం పట్టి.. ఆకలి త్వరగా వేయదు.
పాలు : పాలల్లో లాక్టోస్ అని ఒక రకమైన షుగర్ ఉంటుంది. ఇది సాధారణంగా 70 శాతం పెద్ద వారికి జీర్ణ శక్తిపై ప్రభావం చూపిస్తుంది. పెద్దవారు లాక్టోస్ ఉన్న ఆహారాన్ని జీర్ణించుకోలేరు. లాక్టోస్ జీర్ణం చేయగల ఎంజైములు ఉత్పత్తి పెద్దవారిలో తగినంత ఉండకపోవడంతో పెద్దవాళ్లకు పాలు అరగడంపై ప్రభావం చూపిస్తుంది.
బాగా వేయించిన ఆహారాలు :తినే ఆహారపదార్ధాలు బాగా వేయించిన అజీర్ణం కలిగిస్తాయి. నూనెలో వేయించిన పదార్ధాలు కష్టంగా జీర్ణం అవుతాయి. ఇక బయట తినే బజ్జీల వంటివి వేయించేటపుడు.. అక్కడ ఉపయోగించే నూనె బాగా మరిగి ఉంటుంది.. అంతేకాదు మళ్ళీ మళ్ళీ నూనెను వేడి చేస్తారు కనుక అటువంటి ఆహారం మీ జీర్ణక్రియకు హాని కలిగిస్తుంది.
మసాలా ఆహారాలు : పచ్చి మిరపకాయలు, మిరియాల వంటివాటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. కనుక ఆరోగ్యానికి మంచివే. కాని అవి కూడా అజీర్ణం కలిగిస్తాయి. అయితే ఏదైనా ఎక్కువ మోతాదులో తీసుకుంటే అనారోగ్యానికి కారణమవుతాయి. నాలిక మండించే విధమైన ఆహారం తింటే అవి ఆహార గొట్టాన్ని కూడా మండించి గుండెమంట కలిగిస్తాయి.
కొన్ని రకాల ఆకు కూరలు, కేబేజి, బ్రక్కోలి, ముల్లంగి: కొన్ని రకాల ఆకు కూరలు -కేబేజి, బ్రక్కోలి, ముల్లంగి వంటివి బరువైన ఆహారాలు. అందుకని త్వరగా జీర్ణంకావు. వీటిలో ఆలిగో సచ్చరైడ్స్ అనే పదార్ధం జీర్ణం కావడానికి సమయం తీసుకొనేలా చేస్తుంది. అందుకని వీటిని తగిన శారీరక శ్రమ లేకుండా తింటే సరిగ్గా జీర్ణం కాకుండా ఒకొక్కసారి చిన్న పేగులోకి వెళ్ళిపోతాయి. అక్కడ గ్యాస్ తయారై అజీర్ణ ఆహారంతో బాక్టీరియా బలపడుతుంది.
సిట్రస్ పండ్ల రసాలు: సిట్రస్ పండ్ల రసాలు కూడా అజీర్ణం కలిగిస్తాయి. ఆహార గొట్టం కణాలను ఇబ్బందిపెట్టి ఆహారం వెలుపలికి వచ్చేలా చేస్తాయి. అందుకనే వీటిని సరైన సమయంలోనే తీసుకోవాలి. ముఖ్యంగా ఖాళీ పొట్టతో సిట్రస్ పండ్లు లేదా రసాలు తీసుకుంటే గ్యాస్ ప్రాబ్లెమ్ రావచ్చు.
విత్తనాలు: ఏ ఆహార విత్తనాలైనా జీర్ణం కాదు.. ఇంకా చెప్పాలంటే తిన్న ఆహారం విత్తనాలకంటే ముందు జీర్ణమవుతుంది. అందుకే టమాటా, వంకాయ, పచ్చిమిరప వంటివాటి గింజలు లోపల జీర్ణం కాకుండానే పేగుల ద్వారా ప్రయాణించి మలంలో బయటకు విసర్జించడం చూస్తూనే ఉంటాం.
రాగి అంబలి -రొట్టెలు: రాగుల్లో అధికంగా కాల్షియం, ఐరన్ అధికంగా ఉండంతో తినగానే బరువుగా అనిపిస్తుంది. ఆలస్యముగా జీర్ణమవుతుంది. ఇది మధుమేహ వ్యాధి గ్రస్తులకు చాలా మంచిది.
ఇవి ఆహారాలు కష్టంగా జీర్ణం అవుతాయి. కనుక తినే సమయం ఎంచుకోవాలి. అంతేకాదు శారీరక అలవాట్లకు అనుగుణంగా ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని ఆహారపదార్ధాలను గుండె మంట కలగకుండా తక్కువ మొత్తంలో తినాలి.
Also Read: Siddheshwar Dham: దర్శనంతోనే పాపాలను హరించే ఈ క్షేత్రంలో.. అర్జునుడు శివుడికోసం తపస్సు చేసినట్లు పురాణాల కథనం..