- Telugu News Photo Gallery Spiritual photos Siddheshwar Dham Chardham On Solophok Hill, Namchi Sikkim
Siddheshwar Dham: దర్శనంతోనే పాపాలను హరించే ఈ క్షేత్రంలో.. అర్జునుడు శివుడికోసం తపస్సు చేసినట్లు పురాణాల కథనం..
Siddheshwar Dham: ప్రపంచం నలుమూలల నుండి యాత్రికులు సందర్శించే అత్యంత అద్భుతమైన శివాలయాలకు భారతదేశం నిలయం. కొండ కోణాల్లో ఉన్న ఆలయాలు నిర్మాణాలే కాదు విగ్రహాలు కూడా భక్తులను ఆకర్షిస్తాయి. అలా హిందువులు ఒక్కసారైనా చూడాలనుకునే శివాలయం సిక్కింలోని చార్ ధామ్ దేవాలయంగా పిలవబడుతున్న సిద్ధేశ్వర్ ధామ్.
Updated on: Sep 24, 2021 | 1:06 PM

సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్ నుండి రెండు గంటలు ప్రయాణం చేస్తే.. సిద్ధేశ్వర ధామ్ ఆలయానికి చేరుకోవచ్చు. ఆలయం చుట్టూ ఉన్న ప్రకృతి ఎంతగానో ఆకట్టుకుంటాయి. అంతేకాదు ఈ దేవాలయం చుట్టును అద్భుతమైన పర్వతాలు ఉన్నాయి. ఇక విష్ణువు, శ్రీకృష్ణుడు, జగన్నాథుడు , శివుడి నాలుగు పుణ్యక్షేత్రాలనుకలిగి ఉంది సిద్ధేశ్వర ధామ్ క్షేత్రం

సిద్దేశ్వర్ ధామ్ పుణ్యక్షేత్రం జోరెతంగ్ మధ్య కొండ మార్గంలో ఉంది. ఈ ఆలయంలో పరిసర ప్రాంతాల్లో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అంతేకాదు 108 అడుగుల శివుని విగ్రహం ఎంతగానో పర్యాటకులను, భక్తులను ఆకర్షిస్తుంది.

తమ పాపాలను కడిగేందుకు ఈ క్షేత్ర దర్శనం చేస్తే చాలు అనేది హిందువుల నమ్మకం. సోలోఫోక్ కొండ పై ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఆలయం దర్శనంకోసం పొగమంచు, మేఘాలనుదాటి వెళ్లడం ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది

ఇక్కడ క్షేత్రంలోని మహాభారత యుద్ధానికి ముందు.. ఈ కొండపై శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి అర్జునుడు తపస్సు చేసినట్లు పురాణాలు కథనం. శివుడి ప్రత్యక్షమై సర్వశక్తివంతమైన పాశుపత అస్త్రాన్ని సమర్పించాడు. అందుకనే ఈ క్షేత్రాన్ని శివుడి ప్రధాన తీర్ధయాత్ర క్షేత్రాల్లో ఒకటిగా హిందువులు భావిస్తారు.

ఈ ఆలయానికి చేరుకోవడానికి విమానాశ్రయం అయితే పశ్చిమ బెంగాల్‌లోని బాగ్‌దోగ్రా చేరుకోవాలి. దేశం నలుమూల నుంచి రైల్వే సదుపాయాలు ఉన్నాయి. ఇక నామ్చి రోడ్డు ద్వారా చేరుకోవచ్చు క్షేత్రానికి చేరుకోవడానికి ప్రైవేట్ టాక్సీలు అద్దెకు లభిస్తాయి.




