AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: షుగర్‌ పేషెంట్లకు ఈ 4 పండ్లు దివ్య ఔషధం..! ఏంటో తెలుసుకోండి..

Diabetes: పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం అందరికి తెలిసిందే. పండ్లలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి సహజ సిద్ధమైన తీపిని కలిగి ఉంటాయి.

Diabetes: షుగర్‌ పేషెంట్లకు ఈ 4 పండ్లు దివ్య ఔషధం..! ఏంటో తెలుసుకోండి..
Diabetes Fruits
uppula Raju
|

Updated on: Sep 28, 2021 | 10:04 PM

Share

Diabetes: పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం అందరికి తెలిసిందే. పండ్లలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి సహజ సిద్ధమైన తీపిని కలిగి ఉంటాయి. అయితే పళ్లలోని సహజ చెక్కెర గురించి చాలా మంది ఆందోళన చెందుతుంటారు. ముఖ్యంగా డయాబెటీస్‌తో బాధపడేవారు పండ్లను తినేందుకు జంకుతుంటారు. అయితే కొన్ని పండ్లలో మాత్రం షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయని వాటిని అస్సలు తినరు. అయితే షుగర్‌ పేషెంట్లకు ఈ 4 పండ్లు దివ్య ఔషధమని చెప్పవచ్చు. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

1. చెర్రీ పండు.. చెర్రీ అనేది చాలా రుచికరమైన పండు. ఇందులో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు ఒక కప్పు చెర్రీస్‌లో 18 గ్రాముల చక్కెర మాత్రమే ఉంటుంది. తద్వారా మీరు తిన్న పండ్లలో ఎంత చక్కెర ఉంటుందో ఈజీగా అంచనా వేయొచ్చు.

2. రేగు పండు రేగుపండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. ఫైబర్, యాంటీఆక్సిడెంట్‌లతో పాటు రేగు పండ్లలో 15 రకాల విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇందులో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. అందుకే మధుమేహంతో బాధపడుతున్న వారికి ఇది అద్భుతమైన ఎంపిక.

3. ఆరెంజ్ పండు ఆరెంజ్‌లో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే దీనిని డయాబెటిస్ సూపర్‌ఫుడ్ అని పిలుస్తారు. నారింజ పండ్లు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ఒక నారింజలో దాదాపు 40 నుంచి 43 వరకు గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అంటే శరీరంలో నెమ్మదిగా జీర్ణమవుతుంది.

4. యాపిల్ పండు యాపిల్స్ రక్తంలో చక్కెర స్థాయిలను ఏమాత్రం పెరగనివ్వవు. అందుకే మధుమేహం ఉన్నవారికి ఇది అద్భుతమైన పండుగా పరిగణిస్తారు. యాపిల్స్‌లో పెద్ద మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అంతేకాదు అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది.

Zodiac Signs: ఈ రాశుల వారు చాలా గుంభనంగా ఉంటారు.. తమ గుట్టు ఎట్టి పరిస్థితిలోనూ బయటకు చెప్పరు

Pawan Kalyan: వరుస ట్వీట్స్‌తో విరుచుకుపడుతున్న పవన్ కళ్యాణ్.. తాజాగా మరొకటి..

AP Crime News: విజయవాడలో మరో దారుణం.. భర్త కళ్ల ముందే భార్య ఆత్మహత్య.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!