AP Crime News: విజయవాడలో మరో దారుణం.. భర్త కళ్ల ముందే భార్య ఆత్మహత్య.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!

నెల్లూరులో భర్త శాడిజానికి భార్య బలైపోయింది. చనిపోతాను అంటేనే ఎవ్వరైనా వద్దని వారిస్తారు. కానీ, తన భార్య ఉరివేసుకుంటుంటే ఆనందంగా అదేపనిగా చూశాడు.

AP Crime News: విజయవాడలో మరో దారుణం.. భర్త కళ్ల ముందే భార్య ఆత్మహత్య.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
Suicide1
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 28, 2021 | 9:39 PM

Wife Ends Life in front Husband: నెల్లూరులో భర్త శాడిజానికి భార్య బలైపోయింది. చనిపోతాను అంటేనే ఎవ్వరైనా వద్దని వారిస్తారు. కానీ, తన భార్య ఉరివేసుకుంటుంటే ఆనందంగా అదేపనిగా చూశాడు. అంతేకాదు ఫోన్‌లో చిత్రీకరిస్తూ పైశాచికానందం పొందాడు. దీంతో ఊరివేసుకుని భర్త కళ్లముందే భార్య ప్రాణాలు విడిచింది. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. ఇది మరువకముందే మరో విషాద ఘటన విజయవాడలో చోటుచేసుకుంది.

విజయవాడలో వివాహిత ఆత్మహత్య తీవ్ర సంచలనం సృష్టించింది. గుంటూరు జిల్లా ఎర్రబాలెంకు చెందిన అంజన్ కృష్ణ, విజయవాడ చెందిన రేణుకా గత ఏడాది అక్టోబర్ నెలలలో ఘనంగా వివాహం జరిపించారు కుటుంబసభ్యులు. సెల్ ఫోన్ షాపులో పని చేస్తున్న అంజన్ కృష్ణ, భార్య రేణుకతో కలసి విజయవాడలో కొత్త కాపురం పెట్టాడు. రెండు నెలల సక్రమంగా సాగిన వారి కాపురంలో చిచ్చు రాజుకుంది. దీంతో తరుచూ భార్యను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా పరాయి మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో మందలించిన భార్య రేణుకను మానిసికంగా, శారీరకంగా హింసించాడని కుటుంబసభ్యులు తెలిపారు. భార్య పై కోపంతో ప్రతి రోజు వేధింపులకు గురి చేసేవాడని మృతిరాలి రేణుక కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసారు.

ఈ క్రమంలో భార్యపై కోపంతో ప్రతి రోజు వేధింపులకు గురి చేసేవాడని కుటుంబసభ్యులు అవేదన వ్యక్తం చేశారు. అనేక మార్లు రేణును చనిపోవాలని తిట్టే వాడని… చివరకు చనిపోయేట్లు చేశాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ బిడ్డ మరణానికి కారణమైన భర్త అంజన్ కృష్ణ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, కుటుంబసభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడు అంజన్ కృష్ణ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.

Read Also… Crime News: న‌వ వ‌దువు హ‌త్య కేసులో మరో ట్విస్ట్.. పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తున్న కొత్త కోణాలు..!