Karivepaku Podi: ఆంధ్ర స్టైల్ లో కర్వేపాకు కారం పొడి తయారీ విధానం ఎలానో తెలుసుకుందాం
Karivepaku Podi: అన్నంలోకి రెగ్యులర్ గా వేసుకుని తినే కూరలతో పాటు కొన్ని సార్లు కందిపొడి, కరివేపాకు కారం పొడి వంటివి వేసుకుని తినడానికి ఇష్టపడతారు. ఇంకా చెప్పాలంటే కర్వేపాకు పొడిని ఇష్టపడని వారు బహుశా అసలు ఉండరేమో. వేడి వేడి అన్నం ఇడ్లి ల్లో నెయ్యితో పాటు కర్వేపాకు కారం పొడి సరిజోడి అనిపిస్తుంది. ఈ రోజు కరివేపాకు కారం పొడి తయారీ గురించి తెలుసుకుందాం.. తయారీకి కావాల్సిన పదార్ధాలు : తాజా కరివేపాకు ( […]
Karivepaku Podi: అన్నంలోకి రెగ్యులర్ గా వేసుకుని తినే కూరలతో పాటు కొన్ని సార్లు కందిపొడి, కరివేపాకు కారం పొడి వంటివి వేసుకుని తినడానికి ఇష్టపడతారు. ఇంకా చెప్పాలంటే కర్వేపాకు పొడిని ఇష్టపడని వారు బహుశా అసలు ఉండరేమో. వేడి వేడి అన్నం ఇడ్లి ల్లో నెయ్యితో పాటు కర్వేపాకు కారం పొడి సరిజోడి అనిపిస్తుంది. ఈ రోజు కరివేపాకు కారం పొడి తయారీ గురించి తెలుసుకుందాం..
తయారీకి కావాల్సిన పదార్ధాలు :
తాజా కరివేపాకు ( కొమ్మలతో సహా) ఎండు మిర్చి, చింతపండు, బెల్లం, ఉప్పు, పోపు సామాను. ఆవాలు, జీలకర్ర, కొంచెం పొట్టు మినపప్పు
తయారీ విధానం:
కరివేపాకు కొమ్మలను నిప్పులమీద తగినంత ఎత్తులో ఉంచి కాల్చాలి. ఆకుల మీద అక్కడక్కడ నల్ల మచ్చలు రాగానే పక్కన పెట్టుకోవాలి. ఎండు మిరపకాయలను కూడా ఇలాగే నల్ల మచ్చలు వచ్చే వరకూ కాల్చటమో నూనె లేకుండా వేయించటమో చేయాలి. చింతపండు నానబెట్టి గుజ్జు తీసి అందులో కరివేపాకు దూసి వెయ్యాలి. రోట్లో మొదట కాల్చిన ఎండు మిర్చిని నూరాలి. తర్వా చిటికెడు పసుపు, రుచికి ఉప్పు వేసి కరివేపాకుతో కూడిన చింతపండు వేయాలి. ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసి నూరుకోవాలి. ఇది మరీ జారుగా, లేదా లేహ్యంలా కాకూడదు. చివరగా, ఆవాలు, జీలకర్ర, కొంచెం పొట్టు మినప పోపు వేసి రోకలితో మెదపాలి. గిన్నెలోకి తీసుకోవాలి.
ఈ కర్వేపాకు కారం ఇడ్లీ, దోశ, వేడి అన్నం లోకి ఇది బాగుంటుంది. నెయ్యి వేసుకుంటే మరీ రుచి.