AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Side Effects: చికెన్ ఇష్టంగా తింటున్నారా.. ఆందోళన కలిగించే ఈ వార్తల మీ ఆరోగ్యం కోసమే..

చాలా మంది చికెన్‌ని హాబీగా తింటారు. కొంతమంది చికెన్ లేకుండా జీవించలేరు. వెదరకు తగ్గట్లుగా కాస్త మసాలా దట్టించిన చికెన్‌ ఉంటే ఆ మజానే వేరు...!! కానీ.. చికెన్‌ ప్రియుల్లో దడ పుట్టించే నివేదిక తెరపైకి వచ్చింది. చికెన్‌ తింటే తంటాలు తప్పవని హెచ్చరిస్తోంది. చికెన్‌తో ఆరోగ్యానికి ముప్పని హెచ్చరిస్తోంది. అలాంటి వారికి ఈ వార్త ఆందోళనకు గురిచేస్తుంది. తాజా అధ్యయనంలో ఈ సంచనల విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Chicken Side Effects: చికెన్ ఇష్టంగా తింటున్నారా.. ఆందోళన కలిగించే ఈ వార్తల మీ ఆరోగ్యం కోసమే..
Chicken
Sanjay Kasula
|

Updated on: Mar 23, 2023 | 1:55 PM

Share

చికెన్ తినడం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్లు, విటమిన్లు, ఇతర పోషకాలు ఇందులో లభిస్తాయి. చాలా మంది చికెన్ తినడానికి ఇష్టపడతారు. బ్రేక్‌ఫాస్ట్‌లో బిర్యానీ కూడా తినడానికి ఇష్టపడతాడు. అయితే తాజాగా చికెన్‌కు సంబంధించి ఓ అధ్యయనం తెరపైకి వచ్చింది. చికెన్‌తో పాటు పౌష్టికాహారం మాత్రమే కాకుండా.. ప్లాస్టిక్‌ వ్యర్థలను కూడా వినియోగిస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో చికెన్ తినే ముందు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అసలు కోడిలోకి ప్లాస్టిక్ ఎలా వచ్చింది..? చికెన్ కర్రీ తింటే ఏం జరుగుతుంది..? ఇలాంటి ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

కోడి పిండంలో కనిపించే నానోప్లాస్టిక్

నివేదిక ప్రకారం, నెదర్లాండ్స్‌లోని లైడెన్ విశ్వవిద్యాలయంలో జీవశాస్త్రవేత్త మీరూ వాంగ్ ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనం ఎన్విరాన్‌మెంట్ ఇంటర్నేషనల్‌లో ప్రచురించబడింది. కోడి పిండాల్లో నానోప్లాస్టిక్‌లు ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఇది కొద్దిగా ప్లాస్టిక్ కాదు. పిండంలో నానోప్లాస్టిక్స్ చాలా ఎక్కువ మొత్తంలో కనుగొనబడ్డాయి. ఇది మానవ శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు.

శరీరంలో వివిధ భాగాలలో కణాలు

మీరూ మాంగ్ చాలా సీరియస్‌గా ఈ పరిశోధన చేశారు. పిండంతోపాటు కోళ్లలోని ఇతర భాగాలను కూడా పరిశీలించారు. మీరూ వాంగ్ కోడి పిండాలను ఫ్లోరోసెంట్ మైక్రోస్కోప్‌లో పరిశీలిస్తాడు. ప్రోబ్ పిండ గట్ గోడ లోపల నానోమీటర్-స్కేల్ మెరుస్తున్న ప్లాస్టిక్ కణాలను గుర్తించారు. ఇది కాకుండా, శరీరంలోని ఇతర భాగాలలో కూడా ప్లాస్టిక్ కణాలు కనుగొనారు.

అభివృద్ధిలో అడ్డంకి..

కోళ్ల పిండాల్లో ఇతర అవయవాల్లో ప్లాస్టిక్ రేణువులు ఉన్నట్లు మీరూ వాంగ్ పరిశోధనలో వెల్లడైంది. ఇతర కోళ్లతో పోలిస్తే వాటి అభివృద్ధి కూడా చాలా తక్కువ. కొన్ని కోడి కళ్ళు చిన్నవిగా మారాయి. కొన్ని కోడి ముఖం కూడా చెడిపోయింది. దీని ప్రభావం చికెన్ గుండెపై కనిపించింది. గుండె కండరాలు కూడా చాలా సన్నగా మారాయి.

మూత్రపిండాలు, ప్రేగులకు తీవ్రమైన ముప్పు

కోళ్లలో అలాంటి ప్లాస్టిక్‌ ఉందని పరిశోధకులు తెలిపారు. ఇటువంటి ప్లాస్టిక్ కణాలు సింథటిక్ బట్టలు. ప్లాస్టిక్ మైక్రోఫైబర్లలో కనిపిస్తాయి. ఈ రకమైన ప్లాస్టిక్ మానవ శరీరంలోకి ప్రవేశిస్తే.. అది మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులకు కూడా చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. ప్లాస్టిక్ కణాలు కూడా రక్తాన్ని సంక్రమిస్తాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం