Health Tips: అల్పాహారంలో వీటిని తీసుకుంటే.. పొట్ట సమస్యలకు చెక్ పెట్టినట్లే..

మీరు రోజూ అల్పాహారంలో మొలకెత్తిన శనగ పప్పును తీసుకోవచ్చు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి.

Health Tips: అల్పాహారంలో వీటిని తీసుకుంటే.. పొట్ట సమస్యలకు చెక్ పెట్టినట్లే..
Chana Sprouts Benefits
Follow us
Venkata Chari

|

Updated on: Aug 07, 2022 | 6:17 PM

శనగలు ఖాళీ కడుపుతో తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. వాటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శాకాహారులకు ఇది మంచి ప్రొటీన్ మూలంగా పనిచేస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు మనకు అందుతాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇందు కోసం ఈ పప్పును రాత్రంతా నానబెట్టాలి. అవి మొలకెత్తినప్పుడు వాటిని తినాల్సి ఉంటుంది. వీటిని ప్రతిరోజూ ఖాళీ కడుపుతో తినవచ్చు. దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే చాలా సేపు కడుపు నిండుగా ఉంచుతుంది. ఇది బరువు తగ్గించడంలో కూడా ఎంతో సహాయపడుతుంది. మొలకలు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడుత తెలుసుకుందాం..

  1. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు.. బ్లాక్ గ్రామ్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని నివారిస్తుంది. ఇది గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
  2. ఆరోగ్యకరమైన జుట్టు, చర్మం కోసం.. ఎండు శనగల్లో విటమిన్ ఎ, బి6, జింక్, మాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యకరమైన జుట్టు, చర్మాన్ని అందించడంలో సహాయపడుతుంది. ఇది చర్మం వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. ఇది జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది.
  3. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.. శనగల మొలకలలో ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. దీన్ని తీసుకోవడం ద్వారా చాలా కాలం పాటు కడుపు నిండిన అనుభూతిని పొందుతారు. దీని వినియోగం మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వీరు రెగ్యులర్ మొలకలు తినవచ్చు.
  4. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.. శనగల మొలకలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ సంబంధిత సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది. దీని వినియోగంతో మలబద్ధకం, ఆమ్లత్వం, ఉబ్బరం నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది పేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. ఎముకలను బలంగా ఉంచుతుంది.. శనగల మొలకలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ఇది దంతాలను దృఢంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. అందువల్ల, ఎముకలను బలోపేతం చేయడానికి రోజూ మొలకలను తినవచ్చు.
  7. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.. శనగల మొలకలలో విటమిన్ బి6 ఉంటుంది. దీనితో పాటు ఇందులో కోలిన్ ఉంటుంది. ఇది మనస్సును పదును పెట్టడానికి పని చేస్తుంది. ఇది ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

గమనిక: ఈ కథనంలో అందించిన వివరాలు కేవలం సాధారణ సమాచారం కోసమే. TV9 తెలుగు వీటిని ధృవీకరించలేదు. ఏదైనా టిప్స్ పాటించేముందు నిపుణులను సంప్రదించి సరైన నిర్ణయం తీసుకోవాలి.