5

Viral Video: రాత్రి 8.30 గంటలు.. ఆరుబయట దాదాపు 150 మంది.. సీన్ కట్ చేస్తే.. ఒక్కసారిగా పరుగులు.. వైరల్ వీడియో

Odd News In Telugu: గురువారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఓ ఆలయంలో సావమణి కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమానికి చేసేందుకు దాదాపు 150 మందికి పైగా అక్కడికి చేరుకున్నారు. కానీ, ఇంతలో పెను ప్రమాదం జరిగింది. కళ్లముందే ఇంత జరిగినా..

Viral Video: రాత్రి 8.30 గంటలు.. ఆరుబయట దాదాపు 150 మంది.. సీన్ కట్ చేస్తే.. ఒక్కసారిగా పరుగులు.. వైరల్ వీడియో
Tree Viral Video
Follow us

|

Updated on: Aug 06, 2022 | 6:34 PM

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచం మొత్తం మారిపోయింది. ఎక్కడ ఏం జరిగినా.. క్షణాల్లో నెటిజన్లకు అందుబాటులోకి వస్తుంది. దీంతో ప్రజలంతా క్షణాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఏం జరిగినా తెలుసుకోగలుగుతున్నారు. అయితే, కొన్ని వీడియోలు మాత్రం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంటే, మరికొన్ని షాక్ ఇస్తుంటాయి. ఇలాంటి ఎన్నో వీడియోలు నెట్టింట్లో తెగ సందడి చేస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఓ ఆశ్చర్యకరమైన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోని చూసిన జనాలు షాక్ అవుతున్నారు. అసలు ఎక్కడ ఏం జరిగిందో తెలియక అయోమయంలో పడ్డారు.

బలమైన తుఫాను లేదా గాలి వచ్చినప్పుడే చెట్లు కూలడం చూసి ఉంటాం. కానీ, అలాంటి వాతావరణమే లేకుండా.. ఓ 30 ఏళ్ల భారీ వృక్షం కూలింది. ఈ సంఘటన జైపూర్‌లోని ఒక ఆలయం ముందు జరిగింది. ఈ తతంగం అంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది. అక్కడ భారీ పీపల్ చెట్టు కూలిపోయింది. అది చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

జైపూర్‌లోని భంక్రోటా ప్రాంతంలోని శ్రీరామ్ పాల్ బజాలీ ఆలయం ముందు కేవలం మూడు సెకన్ల వ్యవధిలో ముప్పై ఏళ్ల చెట్టు కూలిపోయింది. ఈ చెట్టు పడిపోయిన సమయంలో దాని కింద చాలా మంది కూర్చున్నారు. కానీ, చెట్టు పడే శబ్దానికి ప్రజలు అక్కడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటన గురువారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆలయంలోపల సావమణి కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమానికి హాజరయ్యేందుకు 150 మందికి పైగా అక్కడికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ కోశాధికారి గణేష్ యాదవ్ మాట్లాడుతూ.. ఆలయంలో ఇంత పెద్ద సంఘటన జరిగినా దేవుడి దయతో భక్తులకు ఎలాంటి దెబ్బలు తగలలేదని.. భారీ చెట్టు బలహీనంగా మారిందని, అందుకే ఇలా కూలిపోయిందని తెలిపారు.