Dulkar in CM Jagan Bio pic: జగన్ బయోపిక్‌లో దుల్కర్..? తన ఆన్సర్‌తో ఫిదా చేసిన హీరో..
'నేను విన్నాను.. నేను ఉన్నాను' .. ! సీఎం అవకముందు.. ఎలక్షన్ క్యాంపెయిన్‌లో జగన్ చెప్పిన ఈ మాట రీసెంట్ డేస్లో ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే! అటు టెలివిజన్ షోల నుంచి..
‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ .. ! సీఎం అవకముందు.. ఎలక్షన్ క్యాంపెయిన్‌లో జగన్ చెప్పిన ఈ మాట రీసెంట్ డేస్లో ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే! అటు టెలివిజన్ షోల నుంచి.. సినిమాల వరకు ఈ డైలాగ్ ఎప్పుడో ఒకప్పుడు వినిపిస్తూనే ఉంది. అందర్నీ ఆకట్టుకుంటూనే ఉంది. అయితే జగన్ చెప్పిన డైలాగే కాదు.. ఏకంగా జగనే సిల్వర్ స్క్రీన్ పైకనిపిస్తూ ఈ డైలాగ్ చెబితే ఎలా ఉంటుంది. జగన్ బయో పిక్ తెరకెక్కితే ఇంకెలా ఉంటుంది.! సూపర్ గా ఉంటుంది కదూ..! ఎస్ తాజాగా అలాంటి ఓ అవకాశమే వస్తే.. జగన్ లా కనిపిస్తా అంటున్నారు మల్లూ హీరో దుల్కర్ సల్మాన్.రీసెంట్గా సీతారామం ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ స్టార్ హీరో.. యాంకర్ అడిగిన ఓ క్రేజీ ఆన్సర్‌కు.. అప్‌కోర్స్ చేస్తా అంటూ సమాధానం చెప్పారు. సీఎం జగన్ ఫాదర్.. ది గ్రేట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌లో మీ ఫాదర్ మమ్ముట్టి నటించారు కదా.. ? మరి ఆయన అబ్బాయి, ప్రస్తుత సీఎం జగన్ బయోపిక్ వస్తే మీరు చేస్తారా? అంటూ యాంకర్ సంధించిన ప్రశ్నకు… చేస్తాను అంటూ ఆన్సర్ ఇచ్చారు. ఆ మాటతో.. ఆంధ్ర ప్రజల మనసు గెలుచుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..