Balayya: 'ఎక్కడ ఏం అడగాలో తెలియదా..' బాలయ్యకు మరో సారి సీరియస్.. తప్పే లేదంటున్న ఫ్యాన్స్..

Balayya: ‘ఎక్కడ ఏం అడగాలో తెలియదా..’ బాలయ్యకు మరో సారి సీరియస్.. తప్పే లేదంటున్న ఫ్యాన్స్..

Anil kumar poka

|

Updated on: Aug 06, 2022 | 5:58 PM

బాలయ్య అంటే.. కోపం! కోపం అంటే బాలయ్య! అనే అందరూ అంటారు కాని.. ఆ బాలయ్యకు కోపం ఎందుకు వస్తుందో.. ఎలాంటి పరిస్థితుల్లో వస్తుందో.. ఆ పక్కనున్న ఫ్యాన్స్ ఏ చేస్తే వస్తుందోనని..


బాలయ్య అంటే.. కోపం! కోపం అంటే బాలయ్య! అనే అందరూ అంటారు కాని.. ఆ బాలయ్యకు కోపం ఎందుకు వస్తుందో.. ఎలాంటి పరిస్థితుల్లో వస్తుందో.. ఆ పక్కనున్న ఫ్యాన్స్ ఏ చేస్తే వస్తుందోనని ఎవరైనా ఆలోచించారా?!! అదే కనుక ఆలోచిస్తే.. బాలయ్యకు కాదు మీకు కూడా కోపం వస్తుంది!ఎస్ ! సమయం, సందర్భం లేకుండా.. హీరోలను సెల్ఫీల పేరుతో ఇబ్బంది పెట్టడం రీసెంట్ డేస్లో బాగా పెరిగిపోయింది. అయితే ఇదే అప్పుడప్పుడు హీరోలను ఫ్యాన్స్ పై విరుచుకుపడేలా.. వారిని పక్కకు నెట్టేలా చేస్తోంది. బాలయ్యను కూడా.. అప్పుడప్పుడు అలాగే చేసేలా చేసింది. దీంతో బాలయ్యకు కోపం అంటూ నెట్టింట ప్రచారం చేశారు చాలా మంది. ఆయనపై తీవ్ర విమర్శలు కూడా చేశారు మరికొంత మంది. కాని బాలయ్యను దగ్గర నుంచి చూసిన వారు.. ఆయన మనసెరిగిన వారు మాత్రం.. అక్కడ ఫ్యాన్స్ చేసిన అతిని.. అక్కడున్న పరిస్థితులను మాత్రమే తప్పుబడుతుంటారు.

తాజాగా అలాంటి సంఘటనే బాలయ్య విషయంలో మరో సారి జరిగింది. తన చెల్లి ఉమామహశ్వరిని కుంటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన బాలయ్య.. అలా కారు దిగారో లేదో.. ఒక్కసారిగా ఫ్యాన్స్ ఆయన్ను చూసేందుకు ఎగబడ్డారు. అక్కడున్న పరిస్థతిన.. సందర్భాన్ని పట్టించుకోకుండా.. ఒకరైతే.. సెల్ఫీ కావాలంటూ.. ఫోన్‌తో బాలయ్య ముందుకు వచ్చాడు. దీంతో బాలయ్య ఆ ఫ్యాన్‌ను కోపంతో చూస్తూ.. వెళ్లిపోయారు.ఇక తాజాగా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన కొంత మంది బాలయ్య హార్డ్ ఫ్యాన్స్.. తమ హీరోకు కోపం రావడానికి కారణం ఇలాంటి సందర్బాలే అంటూ చెబుతున్నారు. సమయం సందర్భం లేకుండా.. పరిస్థితులను అర్థం చేసుకోకుండా.. బాలయ్య పట్ల ఇలా ప్రవర్తించకండి అంటూ.. రిమైనింగ్ ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..