Viral: హార్డ్ డ్రైవ్‌లో రూ. 3300 కోట్ల ఖజనా.. అనుకోకుండా చెత్తలో పడేసిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. కట్ చేస్తే..

ఒక వ్యక్తి హార్డ్ డ్రైవ్‌లో 8 వేల బిట్‌కాయిన్‌లను దాచాడు. అయితే అనుకోకుండా ఈ హార్డ్ డ్రైవ్‌ను చెత్త కుప్పలో విసిరాడు. కానీ దాని విలువను గుర్తించిన తర్వాత, ఆ డ్రైవ్ కోసం తీవ్రంగా వెతకడం ప్రారంభించాడు.

Viral: హార్డ్ డ్రైవ్‌లో రూ. 3300 కోట్ల ఖజనా.. అనుకోకుండా చెత్తలో పడేసిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. కట్ చేస్తే..
Garbage
Follow us

|

Updated on: Aug 06, 2022 | 5:52 PM

సరదాగా కొన్ని బిట్ కాయిన్లకు కొన్నాడు. ఇవేం పెద్దగా పనికిరావనుకున్నాడో, ఏమో.. అన్నింటినిక ఓ హార్డ్ డ్రైవ్‌లో పెట్టి, దాచేశాడు. ఆ తర్వాత వాటిని అనుకోకుండా ఓ భారీ చెత్త డంప్‌లో పడేశాడు. ఇంతలో వాటి విలువ తెలుసుకుని, ఇళ్లంతా వెతకడం మొదలుపెట్టాడు. ఎంత వెదికినా అవి దొరకలేదు. తీరా ఆలోచిస్తే, అది భారీ చెత్త డంప్‌లో పడేసినట్లు గుర్తించాడు. అక్కడ వెతికేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతకీ ఆ సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఐటీ ఇంజనీర్ జేమ్స్ హోవెల్స్ పదేళ్ల తర్వాత కోట్ల విలువైన 8000 బిట్‌కాయిన్‌ల నిధిని కనుగొనడం ప్రారంభించాడు. ఎంతో విలువైన బిట్‌కాయిన్‌లను హార్డ్ డ్రైవ్‌లో ఉంచాడు. జేమ్స్ హార్డ్ డ్రైవ్‌ను అనుకోకుండా ఓ చెత్త కుండీలో విసిరాడు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి, వెతుకులాట మొదలుపెట్టాడు. ఎందుకు అని అంటే.. ప్రస్తుతం తన బిట్‌కాయిన్ (1 బిట్‌కాయిన్ = రూ. 18,28,395) విలువను తెలుసుకుని షాక్ తిన్నాడు. దీంతో చెత్త కుప్పలన్నీ వెతికేస్తున్నాడు. 8 వేల బిట్‌కాయిన్‌ల ధరను పరిశీలిస్తే, అది రూ. 8000 * 18,28,395 = 32,91,11,10,000 (దాదాపు రూ. 3291 కోట్లు)అన్నమాట.

BBC నివేదిక ప్రకారం IT ఇంజనీర్ జేమ్స్ హోవెల్స్ తన హార్డ్ డ్రైవ్‌ను కనుగొనడానికి సంవత్సరాలుగా చెత్త కుప్పలను జల్లెడ పడుతున్నాడు. ఈ బిట్‌కాయిన్స్ తనకు లభిస్తే, అందులో 10 శాతాన్ని న్యూపోర్ట్ (వేల్స్)లో క్రిప్టో హబ్ నిర్మాణానికి వెచ్చిస్తానని జేమ్స్ ప్రకటించాడు.

ల్యాండ్‌ఫిల్‌ను (పెద్ద డంపింగ్ ప్రాంతం) ఇలా జల్లెడ పట్టి, చిందరవందర చేస్తే పర్యావరణానికి హాని కలుగుతుందని న్యూపోర్ట్ కౌన్సిల్ వాదిస్తోంది. ప్రస్తుతానికి మండలి అందుకు సిద్ధంగా కనిపించడం లేదంట.

ఇవి కూడా చదవండి

జేమ్స్ 2013లో అనుకోకుండా ఈ హార్డ్ డిస్క్‌ని ల్యాండ్‌ఫిల్‌లోకి విసిరాడు. హార్డ్ డ్రైవ్ అక్కడ ఉందని జేమ్స్ వాళ్లను ఒప్పించాడు. అతను చాలాసార్లు ఇక్కడ తవ్వాలని వేడుకున్నాడు. న్యూపోర్ట్ కౌన్సిల్ జేమ్స్ ప్రతిపాదనను చాలాసార్లు తిరస్కరించింది. దీని వెనుక పర్యావరణానికి జరిగే నష్టమేమిటని మండలి వాదించింది.

జేమ్స్‌కు పూర్తి విశ్వాసంతో ఉన్నాడు..

జేమ్స్ ఈ స్థలాన్ని తవ్వడం పెద్ద పని అని భావించి, ఇందుకోసం ఆయన నిధులు, నిపుణులను ఏర్పాటు చేశారు. అతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలిస్ట్‌ను కూడా సంప్రదించాడు. పర్యావరణానికి సంబంధించిన పనులను చూసేందుకు ఒక బృందాన్ని కూడా నియమించాడు. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే