Banana on empty stomach: ఖాళీ కడుపుతో అరటిపండు తింటే ఇన్ని కష్టాలా..? ఇలాంటి వారు పొరపాటున కూడా..

ఇందులో ఉండే పోషకాలు శరీరానికి శక్తిని అందించడమే కాకుండా ఆకలి సమస్యలను దూరం చేస్తుంది.  ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటి పండు తినటం వల్ల దాని ఆమ్లత్వం కారణంగా, ప్రేగు కదలికలు ప్రభావితమవుతాయి. ఉదయం ఏదైనా భోజనం చేసిన తర్వాత అరటిపండు తినడం చాలా మంచిది. అరటిపండ్లలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఖాళీ కడుపుతో అరటిపండు తింటే అందులోని మెగ్నీషియం రక్తంలో కలిసిపోతుంది.

Banana on empty stomach: ఖాళీ కడుపుతో అరటిపండు తింటే ఇన్ని కష్టాలా..? ఇలాంటి వారు పొరపాటున కూడా..
Banana
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 13, 2023 | 7:05 AM

నేడు, ప్రతిరోజూ ఖాళీ కడుపుతో అరటిపండు తినే వారు చాలా మంది ఉన్నారు. కొందరు బనానా స్మూతీని కూడా ఇష్టంగా తింటారు. కొందరు అరటిపండుతో పూరీ, చపాతీ పెట్టుకుని తింటుంటారు. మరికొందరు అరటిపండుతో కీర్‌ తయారు చేసుకుని తింటారు. అయితే, ఖాళీ కడుపుతో అరటిపండు తినడం సరైనదేనా అనేది అతిపెద్ద ప్రశ్న. అరటి ఒక అద్భుతమైన పండు. న్యూయార్క్‌లోని ప్రసిద్ధ డైటీషియన్ జెన్నిఫర్ మెంగ్, MS, RD ప్రకారం, అరటి ఒక పోషకమైన పండు, ఇది రుచికరమైనది. అంతే సరసమైనది కూడా. అరటిపండ్లలో పొటాషియం ఉంటుంది. ఇది pHని సమతుల్యం చేసే ఎలక్ట్రోలైట్‌లలో ఒకటి. ఇది మన శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి, రక్తపోటును నియంత్రించడానికి, జీర్ణక్రియ, కండరాల సంకోచం వంటి శారీరక విధులను కూడా నియంత్రించడానికి అవసరం.

ఖాళీ కడుపుతో అరటి తినొచ్చా..?

ఖాళీ కడుపుతో అరటిపండు తినడం సరైనదా కాదా అని సూటిగా సమాధానం చెప్పలేము. ఇది అరటిపండుపై ఆధారపడి ఉంటుంది. అరటిపండు రోగనిరోధక శక్తిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అరటిపండు పచ్చగా ఉన్నప్పుడు ఇందులో ఎక్కువ పీచుపదార్థం ఉంటుంది. చాలా రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది. అరటిపండ్లు పసుపు రంగులోకి మారడం, పక్వానికి మారడం ప్రారంభించిన వెంటనే, ఫైబర్, పరిమాణం తగ్గుతుంది. దీని వల్ల అరటిపండులో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిని కూడా పెంచుతుంది. మీరు ఉదయం ఖాళీ కడుపుతో అరటిపండు తింటే, అది శరీరంలో చక్కెర స్థాయిని పెంచే అవకాశం ఉంది. దీంతో మీరు త్వరగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. అందువల్ల, అరటిపండు తినాలని మీరు అనుకుంటే.. మధ్యాహ్నం లేదా వ్యాయామం చేసే ముందు లేదా జిమ్‌కు వెళ్లే ముందు తినాలని అంటారు. ఇకపోతే, పచ్చి అరటి పండు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆహారం ప్రేగుల్లో త్వరగా కదలడానికి, జీర్ణం కావడానికి ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండ్లు తింటే ఏమవుతుంది..?

మెంగ్ ప్రకారం, షుగర్‌ బాధితులు.. ఉదయం ఖాళీ కడుపుతో అరటిపండు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఉదయాన్నే అరటిపండు తినడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఆ తర్వాత శరీరం దానిని నియంత్రించడానికి ఎక్కువ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. మన శరీరం ప్రతిరోజు పని చేయడం వల్ల మన ఆహారంలో పలు పోషకాలు అవసరం ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి శక్తిని అందించడమే కాకుండా ఆకలి సమస్యలను దూరం చేస్తుంది.  ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటి పండు తినటం వల్ల దాని ఆమ్లత్వం కారణంగా, ప్రేగు కదలికలు ప్రభావితమవుతాయి. ఉదయం ఏదైనా భోజనం చేసిన తర్వాత అరటిపండు తినడం చాలా మంచిది. అరటిపండ్లలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఖాళీ కడుపుతో అరటిపండు తింటే అందులోని మెగ్నీషియం రక్తంలో కలిసిపోతుంది. రక్తంలో మెగ్నీషియం స్థాయిని పెంచుతుంది. అందువల్ల, రక్తంలో కాల్షియం మరియు మెగ్నీషియం స్థాయి సమతుల్యంగా ఉండదు. ఇది గుండెకు హాని కలిగించి, గుండె జబ్బులకు దారి తీస్తుంది. అయితే వైద్యులు సూచించిన మేరకు ఖాళీ కడుపుతో ఉదయాన్నే అరటి పండ్లు తినకూడదని అంటున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.