ఇంట్లో తయారుచేసిన ఈ నూనెలతో జుట్టు రాలడానికి బ్రేక్ వేయండి..! కొద్ది రోజుల్లోనే కేశ సౌందర్యం..

జుట్టుకు తగినన్ని పోషకాలను అందించడానికి హెయిర్ ఆయిలింగ్ చాలా అవసరం. అయితే, కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, ఆవాల నూనె ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ నూనెలను జుట్టుకు పట్టించి మసాజ్ చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ పెరుగుతుంది.  అయితే, కొన్ని సార్లు ఈ  నూనెలు రాసుకున్నా పెద్దగా ప్రయోజనం లేకుంటే ఇంట్లోనే కొన్ని నూనెలు తయారు చేసుకుని వాడుకోవటం మంచిది. ఈ నూనెలన్నీ సహజసిద్ధమైన పదార్థాలతో తయారవుతాయి. కాబట్టి జుట్టుకు ఎలాంటి నష్టం వాటిల్లదు.

ఇంట్లో తయారుచేసిన ఈ నూనెలతో జుట్టు రాలడానికి బ్రేక్ వేయండి..! కొద్ది రోజుల్లోనే కేశ సౌందర్యం..
Stop Hair Fall
Follow us

|

Updated on: Dec 12, 2023 | 12:40 PM

ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలడం, గ్రే హెయిర్ సమస్యతో బాధపడుతున్నారు. అందులోనూ జుట్టు రాలడం సమస్య సాధారణమే, కానీ చిన్న వయసులో జుట్టు రాలడం మంచిది కాదు. ఇది మీ మొత్తం వ్యక్తిత్వాన్ని, రూపాన్ని పాడు చేస్తుంది. జుట్టు రాలడం సమస్యకు సకాలంలో చికిత్స చేయడం మంచిది. నైపుణ్యం కలిగిన హెయిర్ స్పెషలిస్ట్‌ని సంప్రదించండి. మీ జుట్టు రాలడం సమస్య గురించి చెప్పండి. అలాగే, మీ జుట్టును జాగ్రత్తగా చూసుకోండి. చాలా సార్లు, మురికిగా ఉన్న స్కాల్ప్ కూడా జుట్టు రాలడానికి దారితీస్తుంది. జుట్టుకు నూనె వేయకపోవడం, షాంపూ చేయకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం తినడం, శరీరంలో పోషకాల కొరత ఇవన్నీ కూడా దీనికి కారణం.

జుట్టుకు తగినన్ని పోషకాలను అందించడానికి హెయిర్ ఆయిలింగ్ చాలా అవసరం. అయితే, కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, ఆవాల నూనె ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ నూనెలను జుట్టుకు పట్టించి మసాజ్ చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ పెరుగుతుంది.  అయితే, కొన్ని సార్లు ఈ  నూనెలు రాసుకున్నా పెద్దగా ప్రయోజనం లేకుంటే ఇంట్లోనే కొన్ని నూనెలు తయారు చేసుకుని వాడుకోవటం మంచిది. ఈ నూనెలన్నీ సహజసిద్ధమైన పదార్థాలతో తయారవుతాయి. కాబట్టి జుట్టుకు ఎలాంటి నష్టం వాటిల్లదు. సహజ నూనెలు కూడా జుట్టు రాలడాన్ని ఆపుతాయి. ఈ రోజు మనం కొన్ని హెయిర్ ఆయిల్స్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి..వాటిని అప్లై చేయాలో తెలుసుకుందాం..

ఇంట్లో అలోవెరా జెల్ నుండి నూనె తయారీ కోసం..

ఇవి కూడా చదవండి

కలబందను జుట్టుకు చాలా మంది ఉపయోగిస్తారు. అలోవెరా జెల్‌ని జుట్టుకు అప్లై చేయాలని నిపుణులు కూడా చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. అలోవెరా జెల్ జుట్టుకు పోషణనిచ్చే అమినో యాసిడ్లను కలిగి ఉంటుంది. దీన్ని అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అలోవెరా జెల్ నుండి హెయిర్ ఆయిల్ తయారు చేయడానికి, ముందుగా అలోవెరా జెల్, కొబ్బరి నూనెను తీసుకోవాలి. ఈ రెండింటినీ ఒక పాత్రలో వేసి వేడి చేయాలి. కొబ్బరినూనెలో కలబంద జెల్ కరిగిపోయాక స్టవ్ మీద నుంచి దించాలి. ఇప్పుడు కొన్ని చుక్కల రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ వేసి కలపాలి. దీన్ని సీసాలో ఉంచి ఈ నూనెతో మీ జుట్టుకు వారానికి రెండు మూడు సార్లు మసాజ్ చేయండి.

ఉసిరి నూనెను ఇంట్లో తయారు చేసుకునే విధానం..

ఉసిరికాయ తినడం వల్ల ఆరోగ్యంతో పాటు జుట్టు, చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. ఉసిరికాయలో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. జుట్టు రాలడాన్ని నివారించడానికి మీరు ఉసిరిని తినవచ్చు. దీంతో హెయిర్ ఆయిల్ ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం 2-3 ఉసిరికాయలు తీసుకోండి. వాటిని ముక్కలుగా కట్‌ చేసుకుని ఎండలో ఆరనివ్వాలి. ఒకటి నుండి రెండు గంటల వరకు సూర్యకాంతిలో ఉంచండి. ఆ తర్వాత గ్యాస్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టి అందులో సమాన పరిమాణంలో నువ్వులు, కొబ్బరి నూనె కలపండి. దానిని వేడి చేయండి. ఇప్పుడు ఉసిరికాయ ముక్కలు కూడా వేయాలి. కాసేపు ఉడికించాలి. ఇప్పుడు మంటను ఆపేసి ఈ నూనెను చల్లబరచండి. ఆ తర్వాత ఉసిరి ముక్కలను మెత్తగా మిక్సి పట్టుకుని వడకట్టుకోవాలి. నూనెను వడగట్టి సీసాలో పెట్టుకోవాలి. దీన్ని మీ జుట్టుకు వారానికి రెండు మూడు సార్లు అప్లై చేయండి.

ఉల్లిపాయ రసంతో నూనెను తయారు చేయడం వల్ల..

ఉల్లిపాయ జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉల్లిపాయలలో అధిక మొత్తంలో సల్ఫర్ ఉంటుంది. ఇది స్కాల్ప్ ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తుంది. దీంతో జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. దీని కోసం కొన్ని ఉల్లిపాయలను తీసుకుని..ముక్కలుగా కోయండి. గ్యాస్ మీద గిన్నెపెట్టి అందులో ఒక కప్పు కొబ్బరి పోయాలి. నూనె వెడేక్కిన తర్వాత..అందులో ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు,మూడు లవంగాలు వేసి బాగా ఉడికించాలి. నూనె బాగా మరిగిన తర్వాత స్టావ్‌ ఆఫ్‌ చేసి నూనెను చల్లబరుచుకోవాలి. దీన్ని ఫిల్టర్ చేసి బాటిల్లో నిల్వచేసుకోండి. వారానికి రెండు మూడు సార్లు ఈ నూనెతో మీ తలకు మసాజ్ చేయండి. కొద్ది రోజుల్లోనే ఫలితం మీరే గమనిస్తారు..

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణలో భారీ వర్షాల ఎఫెక్ట్‌.. విద్యాసంస్థలకు సెలవు
తెలంగాణలో భారీ వర్షాల ఎఫెక్ట్‌.. విద్యాసంస్థలకు సెలవు
Weekly Horoscope: ఆ రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ ఆఫర్లు..
Weekly Horoscope: ఆ రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ ఆఫర్లు..
ప్రారంభమైన ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశం.. ఆ అంశాలపైనే చర్చ!
ప్రారంభమైన ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశం.. ఆ అంశాలపైనే చర్చ!
ప్రైవేట్ జెట్‌లో షిర్డీ వెళ్లిన దళపతి విజయ్.. కారణమిదే
ప్రైవేట్ జెట్‌లో షిర్డీ వెళ్లిన దళపతి విజయ్.. కారణమిదే
తగ్గేదేలే.. ఢిల్లీలో ఎమర్జెన్సీ సినిమా పాటలు రిలీజ్ చేసిన కంగనా
తగ్గేదేలే.. ఢిల్లీలో ఎమర్జెన్సీ సినిమా పాటలు రిలీజ్ చేసిన కంగనా
ఇక్కడ మీ ఇల్లు ఉంటే అధికారులు వచ్చేస్తారు..!
ఇక్కడ మీ ఇల్లు ఉంటే అధికారులు వచ్చేస్తారు..!
మంగళూరు స్టైల్ చేపల కూర.. తిన్నారంటే మళ్లీ ఇలాగే చేయమంటారు..
మంగళూరు స్టైల్ చేపల కూర.. తిన్నారంటే మళ్లీ ఇలాగే చేయమంటారు..
రెస్టారెంట్ స్టైల్ వెజ్ కూర్మ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
రెస్టారెంట్ స్టైల్ వెజ్ కూర్మ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
చిన్న పిల్లలకు ఎంతో ఇష్టమైన బెల్లం బిస్కెట్లు.. ఈజీగా చేసేయవచ్చు.
చిన్న పిల్లలకు ఎంతో ఇష్టమైన బెల్లం బిస్కెట్లు.. ఈజీగా చేసేయవచ్చు.
పుష్ప 2 సినిమాకు కళ్లు చెదిరే ఓటీటీ డీల్.. అన్ని వందల కోట్లా?
పుష్ప 2 సినిమాకు కళ్లు చెదిరే ఓటీటీ డీల్.. అన్ని వందల కోట్లా?
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్