Bitter Gourd: కాకర కాయ జ్యూస్‌తో అదిరే బెనిఫిట్స్..! దీనికి ఇవి కలుపుకొని తాగితే భలే టేస్ట్..
Bitter Gourd: కాకరకాయ చాలా చేదుగా ఉంటుంది అందుకే దీనిని తినడానికి చాలామంది ఇష్టపడరు. అయితే ఇది ఆరోగ్యానికి ఎంతో
Bitter Gourd: కాకరకాయ చాలా చేదుగా ఉంటుంది అందుకే దీనిని తినడానికి చాలామంది ఇష్టపడరు. అయితే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మీరు దీనిని అనేక విధాలుగా వినియోగించవచ్చు. ప్రతిరోజు కాకర జ్యూస్ కూడా తాగవచ్చు. ఇది అనేక ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. ఈ రసాన్ని మరింత రుచికరంగా చేయడానికి ఇందులో అనేక పదార్థాలు కలుపుకోవచ్చు. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.
1. నిమ్మరసం – దీని కోసం మీకు 2 కాకరకాయలు, టీస్పూన్ రాతి ఉప్పు, టీ స్పూన్ పసుపు పొడి, టీస్పూన్ నిమ్మరసం అవసరం. కాకరకాయలను నీటిలో బాగా కడగాలి. తొక్కలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి వాటిని తీయవద్దు. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్రతి ముక్క నుంచి విత్తనాలను తీసివేయాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కాకరకాయ ముక్కలు, నీరు, ఉప్పు, పసుపు పొడి వేసి కలపాలి. సుమారు 10-15 నిమిషాలు అలాగే ఉంచాలి. తద్వారా కొద్దిగా చేదు బయటకు వస్తుంది. జల్లెడ సహాయంతో కాకరకాయ ముక్కలను తీసి గ్లైండర్‌లో వేసి నీరు, రాతి ఉప్పు, నిమ్మరసం అందులో వేయాలి. మెత్తగా అయ్యాక ఒక గ్లాసులో తీసుకొని సేవించాలి.
ఆపిల్ రసంతో కాకర కాయ రసం: దీని కోసం మీకు ఒక మధ్య తరహా కాకరకాయ, ,టీస్పూన్ ఉప్పు, టీస్పూన్ నిమ్మరసం, కప్పు ఆపిల్ రసం అవసరం. ముందుగా కాకరను కోసి దాని విత్తనాలను తీయండి. కట్ చేసిన ముక్కలను చల్లటి నీటిలో సుమారు 30 నిమిషాలు నానబెట్టండి. మిక్సర్ గ్రైండర్‌లో ఉప్పు, నిమ్మరసం కలిపి పేస్ట్‌లా చేయండి. దీనిని ఆపిల్ వంటి తీపి పండ్లతో కలిపి సేవించండి.
కాకరకాయ రసం ప్రయోజనాలు 1. కాకరకాయ రసంలో తగినంత మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, మెదడు ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. 2. కాకరకాయలో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 3. ఇది ప్రొ విటమిన్ A కి గొప్ప మూలం. ఇది కళ్ళు, చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది.