Baby Food Diet: బేబీ ఫుడ్.. సెలబ్రిటీలు స్లిమ్‌గా ఉండటానికి కారణం ఇదేనట.. పూర్తి వివరాలివే..!

Baby Food Diet: సెలబ్రిటీలు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. బరువు పెరగకుండా జాగ్రత్తలు పాటిస్తారు.

Baby Food Diet: బేబీ ఫుడ్.. సెలబ్రిటీలు స్లిమ్‌గా ఉండటానికి కారణం ఇదేనట.. పూర్తి వివరాలివే..!
Baby Food
Shiva Prajapati

|

Apr 23, 2022 | 2:22 PM

Baby Food Diet: సెలబ్రిటీలు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. బరువు పెరగకుండా జాగ్రత్తలు పాటిస్తారు. ముఖ్యంగా సెలబ్రిటీలు తమ డైట్‌లో బేబీ ఫుడ్ తీసుకుంటారని చాలా సందర్భాల్లో వినే ఉంటారు. అయితే, ఈ బేబీ ఫుడ్ ఏంటి? అనే సందేహం సామాన్య ప్రజల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అసలు ఈ బేబీ ఫుడ్ ఏంటి? దాని వల్లే కలిగే ప్రయోజనాలేంటి? అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. సెలబ్రిటీలు తమ ఫిగర్‌ని కాపాడుకోవడానికి బేబీ ఫుడ్‌ను తీసుకుంటారు. అయితే, బేబీ ఫుడ్‌తో ఫిట్‌నెస్‌ను శాశ్వతంగా ఉంటుందా? దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.

బేబీ ఫుడ్ డైట్ అంటే ఏమిటి? హెల్త్‌షాట్స్ ప్రకారం.. బేబీ ఫుడ్ డైట్ అంటే రోజువారీ ఆహారంలో సాధారణ ఆహారాన్ని తీసుకోకుండా, పిల్లల మాదిరిగా ఆహారం తీసుకోవడం జరుగుతుంది. బేబీ ఫుడ్ డైట్‌లో పండ్లు, కూరగాయలతో పాటు చికెన్ కూడా తీసుకోవచ్చు. ఈ డైట్‌లో తేలికపాటి, మసాలా లేని ఆహారం తీసుకుంటారు. పిల్లల ఆహారంలో తక్కువ కేలరీల పదార్థాలు ఉపయోగించబడతాయి. అందులో చక్కెర, కొవ్వు, ఉప్పు పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి డైట్‌నే పెద్దలు తీసుకోవడం వలన వేగంగా బరువు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది.

బేబీ ఫుడ్ డైట్‌లో ఏ ఆహారాలు తీసుకుంటారు.. 14 రకాల స్వచ్ఛమైన బేబీ ఫుడ్ ఈ డైట్‌లో తీసుకుంటారు. అల్పాహారం, భోజనం, రాత్రి భోజనంలో పండ్లు, కూరగాయలు, స్వల్పంగా మాంసాహారం తీసుకోవడం జరుగుతుంది. ఆహారంలో తగిన మొత్తంలో ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్స్ తీసుకోవాలి. చక్కెర లేకుండా టీ, కాఫీ తీసుకుంటారు. డైలీ వ్యాయామం తప్పనిసరి.

ఈ బేబీ ఫుడ్ ఎవరు తీసుకోవద్దు?.. నిపుణుడిని సంప్రదించకుండా బేబీ ఫుడ్ డైట్‌ని అనుసరించకూడదు. ఇప్పటికే కొన్ని రకాల జబ్బులు ఉన్నవారు, గర్భిణీలు, బిడ్డకు పాలిచ్చే స్త్రీలు దీనిని పాటించకూడదు.

బేబీ ఫుడ్ డైట్‌తో నష్టాలు.. 1. బేబీ ఫుడ్‌ని డైట్‌లో తీసుకోవడం వల్ల శరీరంలో బరువు తగ్గడం అనేది శాశ్వతంగా ఉండదు. 2. సాధారణ ఆహారం కంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. 3. ఇందులో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల తక్కువ శక్తిని కలిగి ఉంటారు. 4. ప్రోటీన్, ఫైబర్ లేకపోవడం వల్ల తిన్న తర్వాత కూడా ఆకలి వేస్తుంటుంది. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంటుంది.

Also read:

Car AirBags: ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్‌లు పని చేయకపోతే వారిదే బాధ్యత.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు..

TSTET: టీఎస్ టెట్ అప్లికేషన్‌లో తప్పులు.. అభ్యర్థుల టెన్షన్.. సవరణకు అవకాశం ఇచ్చేనా?..

EV Battery Safe Tips: ఈ టిప్స్‌ పాటించండి.. మీ ఎలక్ట్రిక్ వాహనాన్ని సురక్షితంగా ఉంచుకోండి..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu