AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Life style: నకిలీ కారం పొడిని ఎలా గుర్తించాలో తెలుసా? ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది.

దీంతో ప్రజల ప్రాణాలు గాల్లో దీపంలా మారుతున్నాయి. ఇలా కల్తీకి గురవుతున్న వాటిలో కారంపొడి ఒకటి. ప్రతీ ఇంట్లో కారంపొడి లేనిది రోజు గడవని పరిస్థితి. అలాంటి కారంపొడిని కల్తీ చేసి ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు కొందరు కేటుగాళ్లు. ఒకప్పుడు ఎర్ర మిరపకాయలను ఎండలో ఎండబెట్టి, పొడిగా చేసి, తరువాత ఉపయోగించేవారు....

Life style: నకిలీ కారం పొడిని ఎలా గుర్తించాలో తెలుసా? ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది.
Mirchi Powder Quality
Narender Vaitla
|

Updated on: Feb 15, 2024 | 7:44 AM

Share

ప్రస్తుతం ఎక్కడ చూసిన మోసమో రాజ్యమేలుతోంది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న అత్యాశతో కొందరు దొంగ దార్లు తొక్కుతున్నారు. ముఖ్యంగా మార్కెట్‌లో లభించే ప్రతీ వస్తువును నకిలీ చేసి అమ్మేస్తున్నారు. ఉప్పు నుంచి కారం వరకు అంతా నకిలీ మయమే. కొన్ని పేరున్న కంపెనీల పేర్లపై కూడా నకిలీ ప్రొడక్ట్స్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు.

దీంతో ప్రజల ప్రాణాలు గాల్లో దీపంలా మారుతున్నాయి. ఇలా కల్తీకి గురవుతున్న వాటిలో కారంపొడి ఒకటి. ప్రతీ ఇంట్లో కారంపొడి లేనిది రోజు గడవని పరిస్థితి. అలాంటి కారంపొడిని కల్తీ చేసి ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు కొందరు కేటుగాళ్లు. ఒకప్పుడు ఎర్ర మిరపకాయలను ఎండలో ఎండబెట్టి, పొడిగా చేసి, తరువాత ఉపయోగించేవారు. ఇప్పటికీ గ్రామాల్లో కొందరు ఇదే విధానాన్ని పాటిస్తున్నారు. అయితే ఉద్యోగాల్లో బిజీగా మారడం మరే కారణంతోనైనా ఇటీవల ఇన్‌స్టాంట్ మిర్చి పౌడర్‌ను కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.

దీంతో ఈ పౌడర్‌ను కల్తీ చేసి అమ్మేస్తున్నారు. కారం పొడికి మంచి రంగు రావడానికి ఫుడ్‌ కలర్‌ కలుపుతున్నారు. అలాగే కారం పొడి పరిమాణం పెరగడానికి ఏకంగా కొందరు అక్రమార్కులు ఇటు పొడిని కూడా కలిపేస్తున్నారు. అయితే దీనివల్ల ఎన్నో తీవ్రమైన అనారోగ్య సమస్యలు వెంటాడుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI ) కల్తీ కారాన్ని గుర్తించడానికి ఒక సులభమైన పద్ధతిని చెబుతోంది. దీంతో కేవలం 5 సెకన్లలో మీరు ఉపయోగిస్తున్న కారంపొడి నకిలీదా కాదా తెలుసుకోవచ్చు.

View this post on Instagram

A post shared by FSSAI (@fssai_safefood)

ఇందుకు సంబంధించి ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. ఇందులో భాగంగా ఒక గ్లాసు నీటిలో ఒట టీస్పూన్‌ మిరపొడిని కలపాలి. అనంతరం నీటిలో కడిగిన పొడిని కొద్ది మొత్తంలో తీసుకొని చేతిపై వేసుకొని రుద్దాలి. ఇలాచేస్తే ఏదైనా తేడా కనిపిస్తే కారంపొడిలో ఇసుక లేదా, ఇటుక పొడి కలిపినట్లు అర్థం. ఇక కారంపొడిలో రంగును కలిపిన విషయాన్ని తెలుసుకోవడానికి ఒక గ్లాసు నీటిలో కారంపొడి వేయాలి. అందులో ఏవైనా రంగు చారలు కనిపిస్తే ఆ పౌడర్ కల్తీ అని అర్థం చేసుకోవాలి. ఇక కారంపొడిలో స్టార్చ్‌ కలిపిన విషయాన్ని తెలుసుకోవడానికి కొన్ని చుక్కల టింక్చర్ అయోడిన్ లేదా అయోడిన్ ద్రావణాన్ని యాడ్‌ చేయాలి. ఒకవేళ నీలి రంగులోకి మారితే అందులో స్టార్చ్ కలిపినట్లు అర్థం చేసుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us