Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parenting Tips: మీ పిల్లల జ్ఞాపకశక్తి పెరగాలా.? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు..

చిన్నారుల్లో జ్ఞాపకశక్తిని పెంపొందించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం కోచింగ్ సెంటర్స్‌ సైతం వెలిశాయి. అయితే ఎలాంటి కోచింగ్ సెంటర్స్ అవసరం లేకుండా ఇంట్లోనే పిల్లల ఆలోచన విధానంలో మార్పులు తీసుకురావొచ్చు. కొన్ని రకాల చిట్కాలు పాటించడం ద్వారా చిన్నారుల్లో జ్ఞాపక శక్తిని పెంపొందించొచ్చు. ఇంతకీ చిన్నారుల్లో...

Parenting Tips: మీ పిల్లల జ్ఞాపకశక్తి పెరగాలా.? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు..
Kids Memory
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 09, 2023 | 8:20 PM

ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో చిన్నతనం నుంచే పిల్లల చదువులపై దృష్టిసారిస్తున్నారు. చిన్నారుల్లో జ్ఞాపకశక్తిని పెంపొందించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం కోచింగ్ సెంటర్స్‌ సైతం వెలిశాయి. అయితే ఎలాంటి కోచింగ్ సెంటర్స్ అవసరం లేకుండా ఇంట్లోనే పిల్లల ఆలోచన విధానంలో మార్పులు తీసుకురావొచ్చు. కొన్ని రకాల చిట్కాలు పాటించడం ద్వారా చిన్నారుల్లో జ్ఞాపక శక్తిని పెంపొందించొచ్చు. ఇంతకీ చిన్నారుల్లో జ్ఞాపకశక్తిని పెంచాలంటే పాటించాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి.? ఇప్పుడు తెలుసుకుందాం..

* చిన్న పిల్లల మానసిక ఆరోగ్యం వారి తీసుకునే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఒమేగా-3 కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్స్‌, విటమిన్లు ఎక్కువగా ఉండే పోషకాలు తీసుకోవాలని చెబుతున్నారు. చేపలు, బెర్రీలు, ఆకు కూరలు, నట్స్‌ను చిన్నారుల ఆహారంలో భాగం చేయాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

* చిన్నారుల మానసిక ఆరోగ్యంపై నిద్ర కూడా ప్రభావం చేస్తుంది. గాఢమైన నిద్ర మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సరిపడ నిద్ర ఉంటేనే మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు.

* డీహైడ్రేషన్‌ వల్ల కూడా జ్ఞాపకశక్తి తగ్గే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఏకాగ్రతను కోల్పోతుంటారు. ఇక చిన్నారులు దాహం వేస్తే తప్ప నీళ్లు తాగరు. కాబట్టి.. క్రమంతప్పకుండా చిన్నారులకు నీటిని అందించాలి. దీనివల్ల మెదడు పని తీరు మెరుగవుతుంది.

* స్మార్ట్‌ ఫోన్‌ భూతం చిన్నారులను కూడా వదిలిపెట్టడం లేదు. ఫోన్‌లకు, ట్యాబ్‌లకు అతుక్కుపోతున్న చిన్న పిల్లల సంఖ్య పెరుగుతోంది. అయితే అధిక స్క్రీన్‌ సమయం కారణంగా మెదడుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. స్క్రీన్‌ టైమ్‌ను తగ్గియ్యడంతో పాటు పజిల్స్‌ లాంటివి అలవాటు చేయాలి.

* ధ్యానం, యోగా వంటివి కేవలం పెద్ద వారికి మాత్రమే పరిమితమనే ఆలోచనలో ఉంటాం. అయితే చిన్నారులకు మెడిటేషన్‌, యోగాపై చిన్నతనం నుంచే అలవాటు చేయాలి. దీనివల్ల ఏకాగ్రత పెరగడంతో పాటు, జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.

* ఇక చిన్నారులతో పెద్దలు గడిపే సమయం కూడా వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. పేరెంట్స్‌ నాణ్యమైన సమయం గడపడం ద్వారా చిన్నారుల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వారితో మాట్లాడడం, ఆటలు ఆడడం వంటి చేయడం ద్వారా వారితో ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతుండాలని చెబుతున్నారు.

* చిన్నారులకు క్లిష్టమైన పనులను ఒకేసారి కాకుండా విభజించాలి. సంక్షిష్టమైన పనులను విభజిస్తూ చిన్న చిన్నా పనులుగా విభజించి నేర్పించాలి. దీని ద్వారా వారి ఆలోచన విస్తృతి కూడా పెరుగుతుంది.

* చిన్నారుల్లో ఆసక్తిని పెంచేందుకు ప్రయత్నించాలి. వారు అడిగే ప్రశ్నలకు ఓపికతో సమాధానం చెప్పాలి. కొత్త కొత్త విషయాలను నేర్పించాలి, వారి ఆసక్తులు, ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తుండాలి. ఇలా చేయడం వల్ల వారిలో ఆలోచన శక్తి పెరగడంతో పాటు మెదడు క్రియాశీలకంగా పనిచేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..