AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Oil for Heart Health: మీ గుండె పది కాలాలపాటు పదిలంగా ఉండాలా? అయితే ఈ నూనె మీకు బెస్ట్‌ ఆప్షన్..

చేప నూనెలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, కాల్షియం, ఐరన్‌, విటమిన్ డి వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. మాంసం తినని వారు కూడా ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల లోపాన్ని అధిగమించడానికి చేప నూనెను తీసుకోవచ్చు. ఇవి క్యాప్సూల్ రూపంలో అందుబాటులో ఉన్నందున, వాటిని ఎటువంటి సమస్య లేకుండా..

Best Oil for Heart Health: మీ గుండె పది కాలాలపాటు పదిలంగా ఉండాలా? అయితే ఈ నూనె మీకు బెస్ట్‌ ఆప్షన్..
Fish Oil
Srilakshmi C
|

Updated on: Jun 04, 2025 | 8:03 PM

Share

చేప నూనె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పలు రకాల అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండటానికి చేప నూనె తీసుకోవడం చాలా ముఖ్యం. చేప నూనెలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, కాల్షియం, ఐరన్‌, విటమిన్ డి వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. మాంసం తినని వారు కూడా ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల లోపాన్ని అధిగమించడానికి చేప నూనెను తీసుకోవచ్చు. ఇవి క్యాప్సూల్ రూపంలో అందుబాటులో ఉన్నందున, వాటిని ఎటువంటి సమస్య లేకుండా తీసుకోవచ్చు. చేప నూనె ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? మనం దీన్ని ఎందుకు తినాలి? వంటి విషయాలు ఈ కింద తెలుసుకోవచ్చు.

చేప నూనె తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

  • సాధారణంగా చేప నూనెలో ఒమేగా-3 సహా అనేక పోషకాలు ఉంటాయి. ఈ నూనె తీసుకోవడం గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
  • చేప నూనె తీసుకోవడం వల్ల శరీరంలోని హృదయనాళ వ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది.
  • చేప నూనెను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం కూడా గణనీయంగా తగ్గుతుంది. రక్త నాళాలలో రక్తం గడ్డకట్టే అవకాశం తగ్గుతుంది.
  • చేప నూనె ట్రైగ్లిజరైడ్లను కరిగించడంలో సహాయపడటమే కాకుండా, రక్త కొవ్వు, రక్త ప్రసరణతో సహా వివిధ వ్యాధులను నియంత్రించడంలో సహాయపడుతుంది.
  • టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులకు చేప నూనె చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించవచ్చు.
  • చేప నూనె ఎముకలను బలపరుస్తుంది మరియు ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  • చేప నూనెను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ వంటి వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తిని పెంచడానికి, అల్జీమర్స్ వ్యాధిని నివారించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
  • చేప నూనె శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది.
  • ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు జలుబు, ఫ్లూ రాకుండా నిరోధించడంలో సహాయపడతాయి. ఊపిరితిత్తులను కూడా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించాలని గుర్తుంచుకోండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.