Mukesh Ambani: ముఖేష్ అంబానీ కొత్తింటికి ఎట్రాక్షన్‌గా మారిన కడియం నర్సరీ మొక్కలు.. వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా..

వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ ఇంటి సుందరీకరణకు.. తూర్పుగోదావరి జిల్లాలోని కడియం నుంచి చెట్లు బయలుదేరాయి.

Mukesh Ambani: ముఖేష్ అంబానీ కొత్తింటికి ఎట్రాక్షన్‌గా మారిన కడియం నర్సరీ మొక్కలు.. వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా..
Spain Born Olive Trees Were
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 26, 2021 | 1:34 PM

Olive Trees – Mukesh Ambani’s New House: వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ ఇంటి సుందరీకరణకు.. తూర్పుగోదావరి జిల్లాలోని కడియం నుంచి చెట్లు బయలుదేరాయి. అదేంటీ.. చెట్లు బయలెళ్లడమేంటని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు చదివింది నిజమే.. ముఖేష్ అంబానీ ఇష్టపడ్డ ఆ మొక్కల ఇంతింతై వటుడింతై అన్నట్టుగా చెట్లుగా మారి ఇప్పుడు ఆయన నూతన నివాసానికి స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారబోతున్నాయి. సువిశాలమైన గార్డెన్‌లో ఈ మొక్కలు ఉంటే వచ్చే అందమే వేరు. చాలా ప్రత్యేకతలు కలిగిన ఈ మొక్కల రేటు ఎంతో తెలుసా? ఒక్కొ మొక్క పాతిక లక్షల రూపాయలు. రెండు మొక్కలు అర కోటి. అలాగని ఇదంతా నర్సరీ రైతు లాభం మాత్రమే కాదు. వీటిని స్పెయిన్ నుంచి ఓడలో తీసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేక కంటైనర్‌లో లక్షలాది రూపాయల పెట్టుబడితో కడియంకు తరలించారు. అంటే ఈ రెండు మొక్కల ఖర్చు అర కోటి కాదు.. అంతకుమించి అన్నమాట.

మొక్కలకి గోదావరి మట్టి, నీళ్లతో ప్రత్యేక పోషణ చేపట్టారు. వెరైటీ రూపురేఖలు సృష్టించారు. చూడ్డానికి మహావృక్షాల్లా కనిపిస్తున్నాయి కానీ ఇవి నిజంగా మొక్కలే. కింది భాగం మెలికలు తిరిగినట్టు.. పై భాగంలో నిటురుగా అక్కడక్కడ గుబురుగా చాలా అందంగా తీర్చిదిద్దారు. రెండు ఆలివ్ మొక్కలతో పాటు నాలుగు నెట్‌ ఫారెస్ట్‌ మొక్కలు.. 8 స్పీ వైరల్‌ మొక్కలు.. ఓ కల్పవృక్షం అంబాని కొత్తగా నిర్మించే ఇంటికి వెళ్లాయి.

మొక్కల రేటు, ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. ఇంతకాలం ప్రేమగా, అపురూపంగా కడియం నర్సరీ రైతు వీరబాబ్ అండ్ కో పెంచారు. ఇక అవి వెళ్లిపోతుంటే వారిలో తెలియని భావోద్వేగం కనిపించింది. ట్రాలీలో మొక్కలను ఏర్పాటు చేసిన తర్వాత ఙ్ఞాపకంగా ఫోటోలు తీయించుకున్నారు.

ప్రపంచ కుబేరుల్లో టాప్ 10లో ఒకరు ముకేశ్ అంబానీ. దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో ఆయన నివసించే ఇల్లు ఏ రేంజ్‌లో ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలుసు. అత్యంత విలాసవంతమైన ఆ ఇంటి గురించి బోలెడన్ని కథనాలొచ్చాయి. లెటెస్ట్‌గా గుజరాత్ లోని జాంనగర్ లో మరో ఇంటిని నిర్మిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే అలీవ్‌ చెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి.

ఇవి కూడా చదవండి: Success Mantras: విజయానికి నాలుగు మెట్లు.. వీటిని అర్థం చేసుకున్న వారికి ఏదీ అసాధ్యం కాదు..

Constitution Day 2021: నవంబర్ 26 ప్రత్యేక ఏంటో తెలుసా.. ప్రతి ఒక్కరు ఈ రోజు స్పెషల్ ఎంటో తెలుసుకోవాలి..