Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Care: చలికాలంలో ముఖానికి స్క్రబ్ వాడుతున్నారా ? అయితే ఈ ఫేస్ స్ర్కబ్ గురించి తెలుసుకోండి..

ఏ రకమైన చర్మానికైనా ఎక్స్‌ఫోలియేట్ చాలా ముఖ్యం. చర్మం ఎక్స్ ఫోలియేట్ చేయకపోతే.. లేదా స్క్రబ్ చేయకపోతే స్కీన్ డల్

Skin Care: చలికాలంలో ముఖానికి స్క్రబ్ వాడుతున్నారా ? అయితే ఈ ఫేస్ స్ర్కబ్ గురించి తెలుసుకోండి..
Face Scrab
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 19, 2021 | 9:33 PM

ఏ రకమైన చర్మానికైనా ఎక్స్‌ఫోలియేట్ చాలా ముఖ్యం. చర్మం ఎక్స్ ఫోలియేట్ చేయకపోతే.. లేదా స్క్రబ్ చేయకపోతే స్కీన్ డల్ గా కనిపిస్తుంది. ఫేస్ స్క్రబ్ చేసినప్పుడు చర్మంపై మృత కణాలు తొలగిపోతాయి. దీంతో చర్మానికి రక్త ప్రసరణ పెరుగుతుంది. చర్మ సమస్యలు తగ్గడమే కాకుండా.. చలికాలంలో చాలా మంది స్క్రబ్ చేయరు. శీతకాలంలో ఫేస్ స్క్రబ్ చేయడం వలన చర్మం పొడిబారుతుందని అపోహలో ఉంటారు. అలాంటి వారు ఇంట్లో తయారు చేసిన స్క్రబ్ ఉపయోగిస్తే చర్మానికి ఎలాంటి హాని ఉండదు. ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా.

చలికాలంలో చర్మానికి పోషణగా ఉంచడమే కాకుండా.. డెడ్ స్కిన్ తొలగించుకోవాలనుకుంటే ఈ స్క్రబ్ ఉపయోగించాలి. ఇందుకోసం అర కప్పు పెరుగు, ఒక స్పూన్ చక్కర, 2 స్పూన్ల్ ఫిల్టర్ కాఫీ పౌడర్ కావాల్సి ఉంటుంది.

ముందుగు ఒక గిన్నె తీసుకుని అందులో అరకప్పు పెరుగు వేయాలి. అందులో నీరు లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత ఒక టీస్పూన్ పంచదార వేసి కలపాలి. ఇప్పుడు అందులో రెండు స్పూన్ల ఫిల్టర్ కాఫీ ఫౌడర్ వేసి కలపాలి. ఈ మిశ్రమం మొత్తగా అయితే మరో స్పూన్ ఫిల్టర్ కాఫీ ఫౌడర్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని దాదాపు 5 నిమిషాలు వదిలేయ్యాలి.

ఇక ఈ మిశ్రమాన్ని 15 నుంచి 20 నిమిషాలకు ఒకసారి ఉపయోగించవచ్చు. ఈ పేస్ట్ ను వెంట్రుకలకు తగలకుండా .. 5 నిమిషాల పాటు ముఖానికి పట్టించి.. ఆ తర్వాత చల్లని నీళ్లతో కడిగేయాలి. చేతి వేళ్లతో ముఖానికి మాసాజ్ చేయడం వలన డెడ్ స్కిన్ తొలగిపోతుంది. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది. సున్నితమైన చర్మం ఉన్నవారు.. ఎక్కువ సమయం మసాజ్ చేయవద్దు. ఇలా చేసిన తర్వాత ముఖంపై ఏదైనా మాయిశ్చరైజర్ రాయాలి.

Also Read: Shalu Chourasiya: కీలక మలుపులు తిరిగిన హీరోయిన్ శాలు చౌరాసియా కేసు.. నిందితుడిన పట్టుకున్న పోలీసులు

Suriya: ఆచార్యకు పోటీగా సూర్య సినిమా… థియేటర్లలో ఒకేరోజు సందడి చేయనున్న స్టార్ హీరోస్…

Bigg Boss 5 Telugu: ప్రేక్షకులకు ఎమోషనల్ టచ్ ఇస్తున్న ఆ ఇద్దరు.. డెస్టినీ వాళ్లను కలిపిందంటున్న నెటిజన్స్….