Hair Care Tips: మీ జుట్టు అందంగా, ఒత్తుగా పెరగాలంటే ఇంట్లో ఈ సహజ చిట్కాలను ఉపయోగించి చూడండి..

షాంపూ, కండిషనింగ్ తర్వాత మీరు ఇంట్లో తయారుచేసిన వాటితో జుట్టుని శుభ్రం చేసుకోవచ్చు. ఇవి జుట్టుకు సంబంధించిన సమస్యను తొలగిస్తాయి. మీరు ఇంట్లో తయారు చేసిన హెయిర్ రిన్స్‌లను ఉపయోగించవచ్చో తెలుసుకుందాం.

Hair Care Tips: మీ జుట్టు అందంగా, ఒత్తుగా పెరగాలంటే ఇంట్లో ఈ సహజ చిట్కాలను ఉపయోగించి చూడండి..
Hair Care Tips
Follow us

|

Updated on: Aug 18, 2022 | 10:29 AM

Hair Care Tips: కాలక్రమంలో వచ్చిన మార్పుల్లో భాగంగా జుట్టు సంరక్షణ కోసం కుంకుడుకాయలు, షికాయి వంటి వాటి ప్లేస్ లో షాంపూ,  కండీషనర్‌ను ఉపయోగిస్తున్నారు. ఇవి జుట్టు శుభ్రంగా ఉంచుతాయి. సూర్యరశ్మి, దుమ్ము, కాలుష్యం కారణంగా చాలా సార్లు జుట్టు నిర్జీవంగా మారుతుంది. దీని కారణంగా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు చుండ్రు వంటి సమస్యను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీరు జుట్టు సంబంధిత సమస్యను ఎదుర్కోవటానికి సహజమైన పద్ధతుల్లోనే ఇంట్లో దొరికే వస్తువులతో సింపుల్ చిట్కాలను కూడా ప్రయత్నించవచ్చు. షాంపూ, కండిషనింగ్ తర్వాత మీరు ఇంట్లో తయారుచేసిన వాటితో జుట్టుని శుభ్రం చేసుకోవచ్చు. ఇవి జుట్టుకు సంబంధించిన సమస్యను తొలగిస్తాయి. మీరు ఇంట్లో తయారు చేసిన హెయిర్ రిన్స్‌లను ఉపయోగించవచ్చో తెలుసుకుందాం.

ఆపిల్ వెనిగర్: జుట్టుని శుభ్రం చేసుకోవడానికి, ఒక టీస్పూన్ ఆపిల్ వెనిగర్‌ను రెండు కప్పుల నీటిలో కలపండి. ఈ రెండింటినీ బాగా కలపాలి. జుట్టుకు షాంపూతో తలస్నానం చేసిన తర్వాత.. ఈ మిశ్రమంతో శుభ్రం చేసుకోండి. జుట్టులో pH స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది. మీ జుట్టు మెరుపును  పెంచుతుంది.

బ్లాక్ టీ:  జుట్టుని శుభ్రం చేసుకోవడానికి బ్లాక్ టీ కూడా మంది సహాయకారి. రెండు కప్పుల నీటిలో బ్లాక్ టీ బ్యాగ్‌లను ఉంచండి. రెండు గంటల పాటు అలా ఉంచిన తర్వాత.. జుట్టును షాంపూ చేసిన తర్వాత జుట్టును శుభ్రం చేసుకోండి. బ్లాక్ టీలో కెఫిన్ ఉంటుంది. దీని కారణంగా జుట్టు రంగు నల్లగా ఉంటుంది. మీరు దీన్ని వారానికి 2 నుండి 3 సార్లు ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి

కలబంద: కలబందను అనేక రకాల సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు కలబందను ఉపయోగించవచ్చు. దీని కోసం, అలోవెరా జెల్‌ను నీటితో బాగా కలపండి. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత మీ జుట్టును అలోవెరా జెల్ తో శుభ్రం చేసుకోండి. ఇది జుట్టుకు కండిషన్‌గా కూడా పనిచేస్తుంది.

నిమ్మ కాయ:   జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే నిమ్మకాయను ఉపయోగించవచ్చు. ఒక కప్పు నీటిలో నిమ్మరసం కలపండి. రెండిటిని బాగా కలపండి.  అనంతరం ఈ నీటితో జుట్టుని శుభ్రం చేసుకోండి. ఈ నిమ్మ నీటిని వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఉపయోగించవచ్చు. ఇది జుట్టు వేగంగా పెరిగేలా పనిచేస్తుంది. ఇది జుట్టు చిట్లకుండా కాపాడుతుంది.

బేకింగ్ సోడా: బేకింగ్ సోడా కూడా జుట్టుని శుభ్రం చూసుకోవడానికి బెస్ట్ ఆప్షన్. ఒక గిన్నెలో నీటిని తీసుకోండి. దానిలో కొంచెం బేకింగ్ సోడా కలపండి. ఇప్పుడు జుట్టుకు షాంపూ చేసిన తర్వాత ఇంట్లో తయారుచేసిన ఈ హెయిర్ రిన్స్‌ని ఉపయోగించండి. ఈ హెయిర్ రిన్స్‌తో జుట్టును మసాజ్ చేయండి. అనంతరం చల్లటి నీటితో జుట్టును కడగండి. జిడ్డుతో ఉన్నకు మంచి రెమిడీ బేకింగ్ షోడా నీరు..

అందానికి సంబంధించిన తాజా వార్తలను ఇక్కడ చదవండి ..

(ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ పాఠకుల ఆసక్తిని అనుసరించి ఇవ్వబడింది. TV9 తెలుగు వీటిని ధృవీకరించలేదు. నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే దీన్ని అనుసరించండి.)