Health: చక్కటి నిద్రకు చిట్కాలు ఇవే.. వీటిని ఫాలో అయితే గాఢ నిద్ర మీ సొంతం

జీవితం ఉరుకులు పరుగులు మయమైంది. పెరిగిపోతున్న సాంకేతికత, మారిపోతున్న దినచర్య వంటి కారణాలతో కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఎన్నో సమస్యలు, మరెన్నో ఆలోచనలతో ప్రశాంతంగా నిద్రపోలేని పరిస్థితి తలెత్తుతోంది. అయితే.. చక్కటి...

Health: చక్కటి నిద్రకు చిట్కాలు ఇవే.. వీటిని ఫాలో అయితే గాఢ నిద్ర మీ సొంతం
Follow us

|

Updated on: Aug 14, 2022 | 7:52 PM

జీవితం ఉరుకులు పరుగులు మయమైంది. పెరిగిపోతున్న సాంకేతికత, మారిపోతున్న దినచర్య వంటి కారణాలతో కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఎన్నో సమస్యలు, మరెన్నో ఆలోచనలతో ప్రశాంతంగా నిద్రపోలేని పరిస్థితి తలెత్తుతోంది. అయితే.. చక్కటి ఆరోగ్యానికి నిద్ర (Sleeping) ఎంతో అవసరం. ప్రతి ఒక్కరికి 6 నుంచి 8 గంటల వరకు రాత్రి నిద్ర అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో బాగా నిద్ర పట్టేందుకు నిపుణులు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. వాటిని ఫాలో అయితే చక్కటి నిద్రను సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు. అవేంటంటే.. చాలా మంది రాత్రి లేట్ గా నిద్రపోయి ఉదయం బారెడు పొద్దెక్కేంత వరకు మంచం పై నుంచి లేవరు. అలా చేయడం మంచి పద్ధతి కాదని, సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణలు చెబుతున్నారు. శరీరానికి కనీసం 20 నిమిషాలు ఎండ తగిలేలా చూసుకోవాలి. బాడీకి కావససినంత ఎండ తగిలితే చక్కగా నిద్రపడుతుంది. అంతే కాకుండా సరైన మోతాదులో ఫైబర్‌ తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. గాఢంగా నిద్రపోయే అవకాశాన్ని పెంచుతుంది. విశ్రాంతి, అలసట తీరి నూతనోత్తేజం సొంతమవుతుంది. ఓట్స్‌, పప్పులు, పండ్లు, కూరగాయల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.

ముఖ్యంగా నిద్రపోయే ముందు ఓ పది నిమిషాలు చదివితే 68 శాతం ఒత్తిడి తగ్గుతుంది. 25 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద చక్కగా నిద్ర పడుతుంది. కాబట్టి పడుకునే గది సాధారణ ఉష్ణోగ్రత 25 డిగ్రీలు ఉండేలా చూసుకోవడం ముఖ్యం. ఆహ్లాదకరమైన సంగీతం వింటే మనసు తేలికవుతుంది. ఇది మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది. నిద్రకు ముందు పది నిమిషాలపాటు మ్యూడిక్ వింటే నిద్ర బాగా వస్తుంది. అంతే కాకుండా అయిదు నిమిషాలు దీర్ఘశ్వాస తీస్తూ, నెమ్మదిగా వదులుతూ యోగా చేయాలి. ఇలా చేస్తే మెదడుకు విశ్రాంతి దొరకుతుంది. తద్వారా గుండె కొట్టుకునే వేగం తగ్గి, టెన్షన్‌ లేకుండా నిద్రపడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..